7 seater cars launch in India : లాంచ్​కి సిద్ధంగా ఉన్న 7సీటర్​ వెహికిల్స్​ ఇవే..-list of upcoming 7 seater cars that will launch in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  List Of Upcoming 7 Seater Cars That Will Launch In India

7 seater cars launch in India : లాంచ్​కి సిద్ధంగా ఉన్న 7సీటర్​ వెహికిల్స్​ ఇవే..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 29, 2022 09:35 AM IST

Upcoming 7 seater cars in India : ఇండియాలో 7 సీటర్​ ఎస్​యూవీలు, ఎంపీవీలకు కూడా డిమాండ్​ పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే.. కొత్త లాంచ్​లతో ముందుకొస్తున్నాయి ఆటో సంస్థలు. వాటిపై మీరు ఓ లుక్కేయండి..

లాంచ్​ సిద్ధంగా ఉన్న 7 సీటర్​ కార్స్​ ఇవే..
లాంచ్​ సిద్ధంగా ఉన్న 7 సీటర్​ కార్స్​ ఇవే..

Upcoming 7 seater cars in India : ఇండియాలో ఎస్​యూవీ, ఎం​పీవీలకు ఈ మధ్య డిమాండ్​ పెరుగుతోంది. ముఖ్యంగా 7 సీటర్​ వాహనాలపై కస్టమర్లలో ఆసక్తి పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆటో సంస్థలు ఆయా సెగ్మెంట్​లపై దృష్టిపెట్టి, కొత్త వాహనాలతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇండియాలో లాంచ్​కి సిద్ధంగా ఉన్న ఐదు 7 సీటర్​ వెహికిల్స్​పై ఓ లుక్కేద్దాం..

ట్రెండింగ్ వార్తలు

టయోటా ఇన్నోవా హైక్రాస్​..

Toyota Innova Hycross : టయోటా ఇన్నోవాకు ఇండియా మార్కెట్​లో విపరీతమైన క్రేజ్​ ఉంది. దానిని లబ్ధిచేసుకునేందుకు.. 7 సీటర్​ ఇన్నోవా హైక్రాస్​ను తయారు చేసింది టయోటా. ఇందుకు సంబంధించిన ఫస్ట్​ లుక్​ను ఇటీవలే విడుదల చేసింది. ఈ ఏడాది చివరి నాటికి టయోటా ఇన్నోవా హైక్రాస్​.. ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇన్నోవా హైక్రాస్​లో టయోటా కొన్ని మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. ఇందులో ఫ్రంట్​ వీల్​ డ్రైవ్​ ఉంటుంది. పెట్రోల్​ ఇంజిన్​లో మాత్రమే ఇది లభిస్తుంది. మోనోకోక్యూ ఛాసీస్​ ఉండే అవకాశం ఉంది.

మారుతీ సుజుకీ..

మారుతీ సుజుకీ కూడా 7సీటర్​ ఎంపీవీ వాహనాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఇన్నోవా హైక్రాస్​ను పోలి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. టయోటాకు చెందిన ఓ వాహనాన్ని మారుతీ సుజుకీ రీబ్యాడ్జ్​ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. ఇంజిన్​, ట్రాన్స్​మీషన్​, ఎక్స్​టీరియర్​ డిజైన్​ వంటివి రెండింట్లోనూ ఒకే విధంగా ఉండొచ్చు.

ఫోర్స్​ గూర్ఖ 5 డోర్​..

Force Gurkha 5 door : 5 డోర్​ గూర్ఖ వర్షెన్​పై ఫోర్స్​ గత కొంతకాలంగా కసరత్తులు చేస్తోంది. ఇండియా మార్కెట్​లో ఇది త్వరలోనే లాంచ్​ అవుతుందని సమాచారం. దీని వీల్​బేస్​ పెద్దగా ఉంటుందని, అయితే విడ్త్​ మాత్రం 3 డోర్​ వేరియంట్​తో పోలి ఉంటుందని తెలుస్తోంది. ఈ కారుకు.. 3వ రో కూడా జతచేసినట్టు సమాచారం. 3 డోర్​ వేరియంట్​తో పోల్చుకుంటే.. 5 డోర్​ కారు ఇంజిన్​లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

సిట్రోయెన్​ సీ3..

Citroen C3 MPV : ఇండియా రోడ్లపై 7సీటర్​ సిట్రోయెన్​ సీ3 వేరియంట్​ ఇటీవలే దర్శనమిచ్చింది. సిట్రోయెన్​ లైనప్​లో సీ3 చాలా చౌకైన వాహనంగా నిలిచింది. ఇది 5 సీటర్​ వర్షెన్​. ఇక 7 సీటర్​ను కూడా తీసుకొచ్చేందుకు సిట్రోయెన్​ కసరత్తులు చేస్తున్నట్టు స్పష్టమైంది. ఇందులో టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్​ ఉండొచ్చు. ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

నిస్సాన్​ ఎక్స్​ ట్రైల్​..

Nissan X trail : నిస్సాన్​ ఎక్స్​ ట్రైల్​కి చెందిన ఫోర్త్​ జనరేషన్​ ప్రస్తుతం మార్కెట్​లో ఉంది. కాగా.. ఈ ఎస్​యూవీలో 7 సీటర్​ను తీసుకొస్తున్నట్టు ఇటీవలే స్పష్టం చేసింది ఆటో సంస్థ. పెట్రోల్​ హైబ్రీడ్​ ఇంజిన్​లో ఇది మార్కెట్​లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం