Hide WhatsApp chats : ఈ ట్రిక్స్​తో మీ వాట్సాప్​ చాట్స్​ను క్షణాల్లో హైడ్​ చేేసేయండి..-hide your whatsapp chats within seconds with these 2 tricks ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Hide Your Whatsapp Chats Within Seconds With These 2 Tricks

Hide WhatsApp chats : ఈ ట్రిక్స్​తో మీ వాట్సాప్​ చాట్స్​ను క్షణాల్లో హైడ్​ చేేసేయండి..

Sharath Chitturi HT Telugu
May 27, 2023 09:20 AM IST

How to hide WhatsApp chats : వాట్సాప్​లో చాట్స్​ను హైడ్​ చేయాలని చూస్తున్నారు? అయితే అందుబాటులో ఉన్న కొన్ని ఆప్షన్స్​ గురించి ఇక్కడ తెలుసుకోండి..

ఈ రెండు ట్రిక్స్​తో మీ వాట్సాప్​ చాట్స్​ను హైడ్​ చేేసేయండి..
ఈ రెండు ట్రిక్స్​తో మీ వాట్సాప్​ చాట్స్​ను హైడ్​ చేేసేయండి.. (REUTERS)

How to hide WhatsApp chats : మీ వాట్సాప్​ చాట్స్​ ఇతరులు చూడకూడదని భావిస్తున్నారా? చాట్స్​ను హైడ్​ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ ట్రిక్స్​ గురించి మీరు తెలుసుకోవాల్సిందే! అవేంటంటే..

ట్రిక్​ 1- ఆర్కైవ్​ ఆప్షన్​..

స్టెప్​ 1:- వాట్సాప్​ ఓపెన్​ చేసి.. సంబంధిత చాట్​ను లాంగ్ ​ప్రెస్​ చేయండి.

స్టెప్​ 1:- ఆర్కైవ్​ ఐకాన్​ మీద క్లిక్​ చేయండి. ఈ ఆప్షన్​ టాప్​ సైడ్​ రైట్​ కార్నర్​లో ఉంటుంది. బాక్స్​లో డౌన్​ ఆరోతో ఆ ఐకాన్​ ఉంటుంది. ఆ వెంటనే సంబంధిత చాట్​.. ఆర్కైవ్డ్​ ఫోల్డర్​లోకి వెళుతుంది.

తాత్కాలికంగా చాట్స్​ను హైడ్​ చేసుకోవాలని భావించే వారికే ఈ ఫీచర్​ సూట్​ అవుతుంది. ఎందుకంటే.. సంబంధిత చాట్​ నుంచి ఏదైనా మెసేజ్​ వస్తే.. అది ఇన్​బాక్స్​ టాప్​లో కనిపించేస్తుంది. పైగా.. ఆర్కైవ్డ్​ ఫోల్డర్​.. ఇన్​బాక్స్​పైనే కనిపిస్తుంది. దాని యాక్సెస్​ చాలా సులభం.

ట్రిక్​ 2- చాట్​ లాక్​..

WhatsApp chat lock feature : ఈ చాట్​ లాక్​ ఫీచర్​ను కొత్తగా ప్రవేశపెట్టింది వాట్సాప్​. ఈ ఫీచర్​తో క్షణాల్లో మీ చాట్స్​ను మాయం చేసేయవచ్చు. క్షణాల్లోనే మీరు యాక్సెస్​ చేసుకోవచ్చు కూడా!

ఈ చాట్​ లాక్​ ఫీచర్​ ఆండ్రాయిడ్​, ఐఓఎస్​లో అందుబాటులో ఉంది. మీరు మీ యాప్​ను అప్డేట్​ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:- WhatsApp : మీ పడకగదిలోని మాటలను వాట్సాప్​ వింటోందట.. నిజమేనా?

స్టెప్​ 1:- మీరు ఏ చాట్​ని లాక్​ చేయాలని అనుకుంటున్నారో దాని మీద క్లిక్​ చేయండి. ప్రొఫైల్​లోకి వెళ్లండి. కిందకి స్క్రోల్​ చేయండి. చాట్​ లాక్​ ఆప్షన్​ కనిపిస్తుంది. దాని మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 2:- ఫింగర్​ప్రింట్​ లేదా ఫేస్​ ఐడీతో మీరు సంబంధిత చాట్​ను లాక్​ చేసుకోవచ్చు.

ఇలా చేసిన చాట్స్​.. లాక్డ్​ చాట్​ ఫోల్డర్​లోకి వెళతాయి. మీ ఇన్​బాక్స్​ని కిందకి స్వైప్​ చేస్తే లాక్డ్​ చాట్​ ఫోల్డర్​ కనిపిస్తుంది. అందులోని చాట్స్​ను యాక్సెస్​ చేయాలంటే.. మళ్లీ మీరు ఫింగర్​ప్రింట్​ లేదా ఫేస్​ ఐడీని చూపించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్​లో ఒక విశేషం ఉంది. ఇది నోటిఫికేషన్స్​ను కూడా సైలెంట్​ చేసేస్తుంది. ఫలితంగా మెసేజ్​లు వచ్చినా పాపప్​ అవ్వదు!

ఈ చాట్​ లాక్​ ఫీచర్​ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

వాట్సాప్​లో ఎడిట్​ ఫీచర్​..

యూజర్లను ఆకర్షించేందుకు, యాప్​ను సులభతరం చేసేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తుంది వాట్సాప్​. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్​ను తీసుకొస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు.. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా.. మెసేజ్ సెండ్ చేసిన తర్వాత కూడా 15 నిమిషాల్లోగా దాన్ని ఎడిట్ చేయవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం