EPFO interest: ఈపీఎఫ్ వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది?.. చందాదారుల ప్రశ్నకు సమాధానమిచ్చిన ఈపీఎఫ్ఓ-epf when will interest be credited subscribers quizzed epfo in online quiz ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Epfo Interest: ఈపీఎఫ్ వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది?.. చందాదారుల ప్రశ్నకు సమాధానమిచ్చిన ఈపీఎఫ్ఓ

EPFO interest: ఈపీఎఫ్ వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది?.. చందాదారుల ప్రశ్నకు సమాధానమిచ్చిన ఈపీఎఫ్ఓ

HT Telugu Desk HT Telugu
Apr 25, 2024 01:26 PM IST

EPFO interest: ఉద్యోగ భవిష్య నిధి (EPF) వడ్డీని జమ చేయడానికి సంబంధించి ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది. వడ్డీని జమ చేసే ప్రక్రియ పైప్ లైన్ లో ఉందని, త్వరలోనే వడ్డీని జమ చేస్తామని వెల్లడించింది. ఎలాంటి వడ్డీ నష్టం లేకుండా పూర్తిగా వడ్డీని జమ చేస్తామని స్పష్టం చేసింది.

ఈపీఎఫ్ఓ వడ్డీ జమ
ఈపీఎఫ్ఓ వడ్డీ జమ

EPFO interest: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సోషల్ మీడియా ఫాలోవర్ల కోసం 'ఎక్స్' ప్లాట్ ఫామ్ లో క్విజ్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్నవారికి ప్రశంసా పత్రాలను అందజేసింది. అయితే, చాలామంది చందాదారులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ ఎప్పుడు జమ అవుతుందని ఈపీఎఫ్ఓ ని ప్రశ్నించడం విశేషం. దీనిపై ఈపీఎఫ్ఓ స్పందిస్తూ ఈ ప్రక్రియ పైప్ లైన్ లో ఉందని, త్వరలోనే వడ్డీని (EPF interest) జమ చేస్తామని తెలిపింది. వడ్డీ ఎప్పుడు జమ చేసినా వడ్డీ నష్టపోకుండా పూర్తిగా జమ చేస్తామని హామీ ఇచ్చింది.

స్టాండర్డ్ రిప్లై..

ఈపీఎఫ్ఓ ఇచ్చిన ఈ రిప్లై పై పలువురు చందాదారులు సరదాగా స్పందించారు. ఇది ఈపీఎఫ్ఓ ప్రతి సంవత్సరం చెప్పే 'ప్రామాణిక' సమాధానమని అభివర్ణించారు. ఈపీఎఫ్ఓ పోర్టల్ https://www.epfindia.gov.in/ లో పాస్ బుక్ ఆప్షన్ సరిగా పనిచేయడం లేదని పలువరు చందాదారులు ఈపీఎఫ్ఓ (EPFO) దృష్టికి తీసుకువెళ్లారు. పాస్ బుక్ ఎంట్రీస్ అప్ డేట్ కావడం లేదని కొందరు, పాస్ బుక్ అసలు ఓపెన్ కావడం లేదని మరికొందరు తెలియజేశారు.

వడ్డీ జమ అయిందో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు

ఈపీఎఫ్ (EPFO) అకౌంట్ లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి సబ్ స్క్రైబర్ ఈ క్రింది మార్గాలను ఆశ్రయించవచ్చు:

1. ఉమంగ్ యాప్ ఉపయోగించవచ్చు.

2. ఈపీఎఫ్ మెంబర్ ఈ-సేవా పోర్టల్ ను సందర్శించవచ్చు.

3. 7738299899 కు SMS పంపండి

4. 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

  • ఉమంగ్ యాప్ ఉపయోగించండి: యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్ లో పాస్ బుక్ యాక్సెస్ చేసుకోవడానికి మీ వివరాలను నమోదు చేయండి.
  • ఈపీఎఫ్ వెబ్సైట్ https://www.epfindia.gov.in/ ను సందర్శించండి: ఈపీఎఫ్ ఇండియా వెబ్సైట్ కు వెళ్లండి. ఇక్కడ 'ఉద్యోగుల కోసం' విభాగానికి వెళ్లండి.
  • ఇప్పుడు సర్వీసెస్ విభాగానికి వెళ్లి మెంబర్ పాస్ బుక్ పై క్లిక్ చేయాలి.
  • కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.
  • అందులో సైన్ ఇన్ చేయడానికి యూఏఎన్ (Universal Account Number UAN), పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయండి.
  • యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న 6 గంటల తర్వాత పాస్ బుక్ కనిపిస్తుంది.
  • ఎస్ఎంఎస్ ద్వారా సేవను పొందడానికి, 7738299899 చేయడానికి మీరు ఈ సందేశాన్ని నమోదు చేయాలి: "EPFOHO UAN".
  • రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పాస్ బుక్ వివరాలు తెలుసుకోవచ్చు.

WhatsApp channel