Baaz Electric Bike । తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్, అద్దెకు కూడా తీసుకోవచ్చు!-baaz electric bike launched in india with attractive features know price details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Baaz Electric Bike । తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్, అద్దెకు కూడా తీసుకోవచ్చు!

Baaz Electric Bike । తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్, అద్దెకు కూడా తీసుకోవచ్చు!

HT Telugu Desk HT Telugu
Oct 20, 2022 12:25 PM IST

Baaz Electric Bike: బాజ్ కంపెనీ తక్కువ ధరకే ఎక్కువ మన్నిక గల ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసింది. ఇది రోజూవారీగా డెలివరీలు చేసే వర్కర్లకు చాలా బాగుంటుంది. అద్దెకు కూడా తీసుకోవచ్చు. పూర్తి వివరాలు చూడండి.

Baaz Electric Bike
Baaz Electric Bike

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, స్కూటర్‌ల మార్కెట్ ఊపందుకుంటోంది. తాజాగా, బాజ్ బైక్స్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ తమ బ్రాండ్ మీద మొట్టమొదటి 'స్మార్ట్-రగ్డ్' ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా మేడ్-ఇన్-ఇండియా. IIT ఢిల్లీకి చెందిన వ్యవస్థాపక బృందం సొంతంగా డిజైన్ చేసిన, రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. బాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతో పాటు, ఎంతో దృఢంగా ఉంది. ఎక్స్-షోరూమ్ వద్ద దీని ధర రూ. 35,000/- గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి బ్యాటరీని వేరు చేయవచ్చు.

ద్విచక్ర వాహన లాజిస్టిక్ మార్కెట్‌కు తక్కువ ఖర్చుతో కూడుకున్న, వినూత్నమైన పరిష్కారాలను తీసుకురావాలనే లక్ష్యంతో, తమ బాజ్ స్కూటర్‌ను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ బైక్స్ ప్రత్యేకంగా రోజూవారీ అవసరాలను తీర్చే గిగ్ వర్కర్లు, డెలీవరీ వర్కర్ల కోసం అభివృద్ధి చేసినవి. తేలికపాటి సామాగ్రిని తీసుకెళ్లటానికి ఈ బైక్ సీట్ వెనక భాగంలో ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి బ్యాటరీని వేరు చేసే వీలు ఉండటంతో ఖర్చును మరింత పొదుపు చేయవచ్చు.

Baaz Electric Bikes అద్దెకు కూడా

ఈ బాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటుగా EV కంపెనీ బాజ్ స్వాపింగ్ నెట్‌వర్క్, అలాగే ఎనర్జీ పాడ్స్ (స్వాప్ చేయగల బ్యాటరీ)ని కూడా లాంచ్ చేసింది.

సరికొత్త బాజ్ బైక్స్ అద్దె ప్రాతిపదికన కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఇ-స్కూటర్‌ను బాజ్ అధికారిక రెంటల్ భాగస్వామి వద్ద నుండి అద్దెకు తీసుకోవచ్చు, Baaz స్వాపింగ్ నెట్‌వర్క్ పే-యాజ్-యు-మూవ్ మోడల్‌లో ఇది పని చేస్తుంది. సూక్ష్మ వ్యాపారవేత్తలకు ఇది సాధికారత కల్పిస్తుంది. ఈ బాజ్ ఈ స్కూటర్‌లను చిన్న తరహా డీలర్‌షిప్‌లకు విక్రయించనున్నారు. (Also Read: టీవీఎస్ సరికొత్త మోటార్‌సైకిల్ TVS Raider 125 SmartXonnect)

Baaz Electric Bike ఫీచర్లు, రేంజ్

బాజ్ స్కూటర్ రోజువారీగా 100 కిమీల కంటే ఎక్కువ పరిధి వరకు వినియోగించవచ్చు. సుదీర్ఘ ప్రయాణాల సమయంలో రైడర్‌ల సౌకర్యం, భద్రత కోసం ఈ బైక్ ఎర్గోనామిక్స్‌ను కలిగి ఉంటుంది.

బాజ్ స్కూటర్ స్లో స్పీడ్ ఎలక్ట్రిక్ వాహనం. దీని గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. ఈ బైక్ నడపటానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇందులో యాంటీ-వాండలిజం, యాంటీ-థెఫ్ట్, కీలెస్ స్టార్ట్, GPS-ట్రాకింగ్, బ్యాటరీ మెకానిజం వంటి ఫీచర్లు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం