Exalta Zeek e-scooters । మంటలు వ్యాపించని టెక్నాలజీతో.. ఎక్సాల్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌లు-exalta zeek electric scooters launched know models prices and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Exalta Zeek Electric Scooters Launched, Know Models, Prices, And More

Exalta Zeek e-scooters । మంటలు వ్యాపించని టెక్నాలజీతో.. ఎక్సాల్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌లు

HT Telugu Desk HT Telugu
Oct 10, 2022 05:02 PM IST

EV కంపెనీ ఎక్సాల్టా నుంచి Exalta Zeek సిరీస్‌లో సరసమైన ధరలోనే వివిధ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు విడుదలయ్యాయి. సుమారు 100 కిమీ రేంజ్ అందించగలవు. పూర్తి వివరాలు చూడండి.

Exalta Zeek 4X ఎలక్ట్రిక్ స్కూటర్
Exalta Zeek 4X ఎలక్ట్రిక్ స్కూటర్

భారతదేశంలోని ప్రముఖ సోలార్ ఉత్పత్తి సంస్థ, EV కంపెనీ అయిన ఎక్సాల్టా, తాజాగా తమ బ్రాండ్ నుంచి నాలుగు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసింది. Exalta తమ Zeek సిరీస్‌లో ఈ కొత్త ఇ-స్కూటర్‌లను విడుదల చేసింది. ఇందులో 1X, 2X, 3X అలాగే 4X అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఉన్నాయి. ప్రతి మోడల్ ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. మోడల్‌ను బట్టి స్కూటర్‌లో LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్‌లైట్, USB ఛార్జర్, రైడ్ మోడ్‌లు, రివర్స్ ఫంక్షన్ , యాంటీ థెఫ్ట్ అలారం మొదలైన ఫీచర్లు ఉంటాయి. వీటి ధరలు మోడల్ ఆధారంగా రూ. 99,000 నుంచి రూ. 1,15,000 వరకు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఈ స్కూటర్లన్నీ అగ్ని ప్రమాద నివారణ సాంకేతికతను కలిగి ఉంటాయని కంపెనీ పేర్కొంది. స్కూటర్‌కు మంటలు వ్యాపించకుండా దీనిలోని BMS (బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్) నియంత్రిస్తుంది. అదనపు భద్రత కోసం థర్మల్ రన్‌అవేలో ఉష్ణోగ్రత పెరుగుదలను తగ్గించేందుకు కట్ ఆఫ్ సర్క్యూట్‌ను కూడా అమర్చారు.

Exalta Zeek ఎలక్ట్రిక్ స్కూటర్లలో Lipo4GR బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. దీనిని BLDC ఎలక్ట్రిక్ మోటార్‌తో కనెక్ట్ చేశారు. ఈ స్కూటర్‌లు పూర్తి ఛార్జ్ అవటానికి 4-6 గంటల సమయం పడుతుంది. ఒక పూర్తి ఛార్జ్‌తో 90-100 కిమీల వరకు ప్రయాణ పరిధిని అందించగలవు.

Exalta Zeek 1X ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఫీచర్లు, స్పెక్స్

దీని ధర రూ. 99,000/- . ఇందులోని 48/30 లిథియం/లెడ్ యాసిడ్ బ్యాటరీ 1.6 kWh శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో LCD మీటర్, LED లైట్, USB ఛార్జర్, 3 స్పీడ్ మోడ్, పార్కింగ్ రివర్స్, వన్ బటన్ రిపేర్, రిమూవ్ కీ, యాంటీ తెఫ్ట్ అలారం వైర్‌లెస్ కంట్రోలర్, E-ABS ఉన్నాయి. ఇది ఎకో, సిటీ, టర్బో అనే 3 డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. 70-80 కిమీ పరిధిని అందిస్తుంది.

Exalta Zeek 2X ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఫీచర్లు, స్పెక్స్

దీని ధర రూ. 1,05,000/- ఇందులోని 48/30 లిథియం/లెడ్ యాసిడ్ బ్యాటరీ 1.6 kWh శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో LCD మీటర్, LED లైట్, USB ఛార్జర్, 3 స్పీడ్ మోడ్, పార్కింగ్ రివర్స్, వన్ బటన్ రిపేర్, రిమూవ్ కీ, యాంటీ తెఫ్ట్ అలారం, వైర్‌లెస్ కంట్రోలర్, E-ABS ఉన్నాయి. ఇది ఎకో, సిటీ, టర్బో అనే 3 డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. 70-80 కిమీ పరిధిని అందిస్తుంది.

Exalta Zeek 3X ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఫీచర్లు, స్పెక్స్

ధర రూ. 1,10,000/- ఇందులోని 48 లిథియం లేదా 30 లెడ్ యాసిడ్ బ్యాటరీ 1.6 kWh శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో LCD మీటర్, LED లైట్, USB ఛార్జర్, 3 స్పీడ్ మోడ్, పార్కింగ్ రివర్స్, బన్ బటన్ రిపేర్, రిమూవ్ కీ, యాంటీ తెఫ్ట్ అలారం వైర్‌లెస్ కంట్రోలర్, E-ABS ఉన్నాయి. ఇది ఎకో, సిటీ, టర్బో అనే 3 డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. 70-80 కిమీ పరిధిని అందిస్తుంది.

Exalta Zeek 4X ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఫీచర్లు, స్పెక్స్

ఇది టాప్-ఎండ్ మోడల్. దీని ధర రూ. 1,15,000/- ఇందులోని 48/30 లిథియం/లెడ్ యాసిడ్ బ్యాటరీ 1.6 kWh శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో LCD మీటర్, LED లైట్, USB ఛార్జర్, 3 స్పీడ్ మోడ్, పార్కింగ్ రివర్స్, వన్ బటన్ రిపేర్, రిమూవ్ కీ, యాంటీ తెఫ్ట్ అలారం, వైర్‌లెస్ కంట్రోలర్, E-ABS ఉన్నాయి. ఇది ఎకో, సిటీ, టర్బో అనే 3 డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. 90-100 కిమీ పరిధిని అందిస్తుంది.

ఈ స్కూటర్లు బ్లాక్, రెడ్, సిల్వర్, వైట్, బ్లూ జెమ్ అనే 5 కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. అన్ని స్కూటర్లు దాదాపు ఒకేరకమైన ఫీచర్లు కలిగి ఉన్నా, హార్డ్‌వేర్ పరంగా స్వల్ప మార్పులుంటాయి.

WhatsApp channel

సంబంధిత కథనం