YSRCP Party Positions : వైసీపీ పార్టీ పదవుల పంపకం….-ysrcp president appoints presidents for party affiliated wings in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ysrcp President Appoints Presidents For Party Affiliated Wings In Andhra Pradesh

YSRCP Party Positions : వైసీపీ పార్టీ పదవుల పంపకం….

HT Telugu Desk HT Telugu
Jan 05, 2023 10:05 AM IST

YSRCP Party Positions ఏపీలో అధికార వైఎస్సార్సీపీలో పార్టీ పదవుల్ని ముఖ్యమంత్రి ఖరారు చేశారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో పార్టీ అనుబంధ విభాగాలకు బాధ్యుల్ని ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్‌కు కూడా కీలక బాధ్యతలు దక్కాయి. పార్టీ సోషల్‌ మీడియా, మీడియా సమన్వయ బాధ్యతల్ని సజ్జల భార్గవ రెడ్డికి అప్పగించారు.

వైసీపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం
వైసీపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం

YSRCP Party Positions వైసీపీలో ఎన్నికల ఉత్సాహాన్ని నింపేందుకు పార్టీ పదవుల నియామకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జితో పాటు పలు విభాగాలకు అధ్యక్షులను ఖరారు చేశారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో అన్ని విభాగాల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చే లక్ష్యంతో అనుబంధ విభాగాలకు పేర్లను ఖరారు చేశారు.

పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జిగా లేళ్ల అప్పిరెడ్డి, మీడియా, సోషల్ మీడియా కో ఆర్డినేటర్‌గా సజ్జల భార్గవ రెడ్డి, ఎన్టీఆర్‌ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా కొరివి చైతన్యలను నియమించారు.

యువజన విభాగానికి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మహిళా విభాగానికి ఎమ్మెల్సీ పోతుల సునీత, బీసీ సెల్‌‌కు జంగా కృష్ణమూర్తి, ఎస్టీ సెల్‌ విభాగానికి మత్సరస వెంకటలక్ష్మీ, మైదాన ప్రాంత గిరిజనులకు మేరాజోత్‌ హనుమంత్‌ నాయక్‌, రైతు విభాగానికి ఎంవీఎస్‌ నాగిరెడ్డి, విద్యార్థి విభాగానికి పానుగంటి చైతన్య, చేనేత విభాగానికి గంజి చిరంజీవి, వైయస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్ కాంగ్రెస్‌కు ర్‌ పూనూరు గౌతమ్‌రెడ్డి, వికలాంగుల విభాగానికి బందెల కిరణ్‌ రాజు, సాంస్కృతిక విభాగానికి వంగపండు ఉష, ప్రచార విభాగానికి ఆర్‌. ధనుంజయ్‌ రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డిలను నియమించారు.

పార్టీ ఫిర్యాదుల విభాగానికి అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, న్యాయ విభాగానికి ఎం. మనోహర్‌రెడ్డి, ఐటీ విభాగానికి సునీల్‌ పోసింరెడ్డి, ఎన్‌ఆర్‌ఐ విభాగానికి మేడపాటి వెంకట్‌, వైయస్‌ఆర్‌ టీచర్స్ ఫెడరేషన్‌కు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, ఎస్సీ సెల్‌‌కు జూపూడి ప్రభాకర్, ఎంపీ నందిగాం సురేష్‌, కైలే అనిల్‌కుమార్, మొండితోక అరుణ్‌ కుమార్‌లను నియమించారు.

మైనారిటీ సెల్‌‌కు వక్ఫ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ ఖాదర్‌బాషా, వైయస్‌ఆర్‌ సేవాదళ్‌‌కు కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి, డాక్టర్ల విభాగానికి బత్తుల అశోక్‌ కుమార్‌ రెడ్డి, క్రిష్టియన్‌ మైనారిటీ సెల్‌‌కు జాన్సన్‌ మేడిది, వాణిజ్య విభాగానికి పల్లపోతు మురళీకృష్ణ, చిప్పగిరి ప్రసాద్‌‌లను నియమించారు.

IPL_Entry_Point

టాపిక్