YSR IT Agency : రూ.50 కోట్లతో వైఎస్సార్‌ ఐటీ ఏజెన్సీ-ysr it agency with 50 crores
Telugu News  /  Andhra Pradesh  /  Ysr It Agency With 50 Crores
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

YSR IT Agency : రూ.50 కోట్లతో వైఎస్సార్‌ ఐటీ ఏజెన్సీ

01 August 2022, 20:27 ISTHT Telugu Desk
01 August 2022, 20:27 IST

వైఎస్సార్‌ ఐటీ ఏజెన్సీ రూ.50 కోట్ల వ్యయంతో స్థాపించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి అన్నారు. భవిష్యత్తులో గూగుల్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకునే ఉద్దేశం ఉందన్నారు.

కర్నూలులోని సిల్వర్‌ జూబ్లీ కళాశాల ప్రాంగణంలో స్థాపించిన క్లస్టర్‌ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్‌ అప్‌స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి ధ్రువపత్రాలను అందజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగ సాధనలో విద్యార్థులను ముందు వరుసలో నిలిపే కార్యక్రమాన్ని కేవలం వర్సిటీలో డిజైన్‌ చేశారన్నారు. రూ.50 కోట్లతో వైఎస్సార్‌ ఐటీ ఏజెన్సీ రూ.50 కోట్ల వ్యయంతో స్థాపించనున్నట్లు తెలిపారు.

'కర్నూలులోని మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 460 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. 252 మంది ఉత్తీర్ణత సాధించడం ఒక గొప్ప విషయం. భవిష్యత్ లో గూగుల్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకునే ఉద్దేశం ఉంది.' అని హేమచంద్రారెడ్డి అన్నారు.