విజయవాడ(Vijayawada)లో ఆసుపత్రి బయటే మహిళ ప్రసవం జరిగింది. అక్కడకు వచ్చిన మీడియా సిబ్బందితో సెక్యూరిటీ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రిలోకి అనుమతి లేదని చెప్పారు. మీడియాతో మాట్లాడేందుకు వైద్యులు నిరాకరించారు. హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు నిరంతరంగా జరుగుతున్నాయని అంటున్నారు. ఇన్ని జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం ఆగ్రహం బంధువులు చేస్తున్నారు.,ఇటీవలే.. తిరుపతి(Tirupati) ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నెలలు నిండిన మహిళ ఒకరు ఆస్పత్రి సమీపంలోనే రోడ్డు ప్రసవించారు. గత కొన్ని రోజులుగా ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న మహిళకు నెలలు నిండటంతో నడిరోడ్డుపైనే ప్రసవించాల్సి వచ్చింది.,బాధిత మహిళకు నొప్పులు రావడంతో ఆస్పత్రికి సమీపంలో రోడ్డుపై పడిపోయింది. ఆమె పరిస్థితికి తల్లడిల్లిన స్థానికులు దుప్పట్లు కప్పి ప్రసవానికి సహకరించారు. మహిళ ఒంటరిగా ఆస్పత్రికి రావడంతో చికిత్స చేసేందుకు వైద్యులు నిరాకరించారని స్థానికులు ఆరోపించారు. మహిళ రోడ్డుపై ప్రసవించిన విషయం తెలుసుకున్న వైద్యులు, భద్రతా సిబ్బంది అంబులెన్సులో మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వర్గాలు మాత్రం ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నారు.,బాధిత మహిళ ఆస్పత్రిలో చేరేందుకు రాలేదని,ఆమె వెంట సహాయకులు లేరనే కారణంతో ఆస్పత్రిలో చేర్చుకోలేదనే వార్తలు అవాస్తవమని ఆస్పత్రి ఆర్‌ఎంఓ రాధారాణి చెప్పారు. తన పేరు కాంతారి అనే చెబుతోందని, ఇక్కడకు ఎందుకొచ్చిందనే వివరాలు చెప్పలేదన్నారు. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత కూడా మహిళ వివరాలు వెల్లడించడం లేదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.,ఆ మధ్య జరిగిన తిరుపతి ఆస్పత్రి ఘటనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. తిరుపతి ఘటనతో హృదయం చలించిపోతుందని, నడిరోడ్డుపై మహిళ ప్రసవం గుండెను కలచివేస్తుందని ట్వీట్ చేశారు. తోడుగా సహాయకులు లేరని పురిటి నొప్పులతో వచ్చిన మహిళలను ప్రసూతి ఆసుపత్రి సిబ్బంది చేర్చుకోకపోవడం దారుణమన్నారు. స్థానికులు దుప్పట్లు అడ్డుపెట్టి ప్రసవం చేయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ హ్యాష్ టాగ్‌తో ట్వీట్ చేశారు.