TTD Break Darshans : తిరుమల బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు….-ttd break darshans timings will change from december 1 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd Break Darshans Timings Will Change From December 1

TTD Break Darshans : తిరుమల బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు….

HT Telugu Desk HT Telugu
Nov 06, 2022 07:44 AM IST

TTD Break Darshans తిరుమల ‌శ్రీవారి బ్రేక్‌ దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి బ్రేక్ దర్శనాలను ఉదయం 8 నుంచి 12 గంటల మధ‌్య భక్తులకు కల్పించనున్నారు. ఆనంద నిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించేందుకు పాలకమండలి అమోదంతో చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.

టీటీడీ ఈవో ధర్మారెడ్డి
టీటీడీ ఈవో ధర్మారెడ్డి

TTD Break Darshansడిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాలలో మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. శ్రీవారి భక్తులకు కల్పించే బ్రేక్ దర్శనాలను ఉదయం 8-12 గంటల మధ‌్య కల్పించనున్నారు. కొత్తగా మారే సమయాలకు అనుగుణంగా ఆన్‌లైన్‌ టిక్కెట్‌ స్లాట్‌‌లను విడుదల చేయనున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శన సమయం మారనుంది. డిసెంబర్ ఒకటి నుంచి ఉదయం 8గంటల నుంచి 12 గంటల వరకు దర్శనాలు కల్పించనున్నారు. రూ.300 ప్రత్యక ప్రవేశ దర్శనం టిక్కెట్ల స్లాట్‌లను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు.

శ్రీవారి ఆలయంలోని ఆనందనిలయం బంగారు తాపడం పనులపై ఆరేడు నెలల నుంచి ఆగమ సలహా మండలి సభ్యులు పరిశీలిస్తున్నారని ఈవో చెప్పారు. బంగారు తాపడం పనులు ప్రారంభించిన ఆరు నెలల లోపు శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాలు, స్వామివారి దర్శనాలకు సంబంధించిన చర్యలపై ధర్మకర్తల మండలిలో చర్చించనున్నారు. ఆనంద నిలయంలో బంగారు తాపడం పనులు నిర్వహించేందుకు బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారని ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

మరోవైపు టీటీడీ ఆపన్న హస్తం పథకానికి లక్ష డిపాజిట్ చేసేవారికి ఆరు బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నారు. ఆపన్న పథకానికి రూ.10వేల విరాళం ఇచ్చే వారికి కూడా దర్శనం కల్పించాలని భక్తులు కోరారని అయితే అది సాధ్యపడదని ఈవో స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు విరాళం ఇచ్చి బ్రేక్ దర్శనాలు కోరే అవకాశం ఉండటంతో విరాళం మొత్తాన్ని తగ్గించలేమన్నారు. అక్టోబర్‌ నెలలో తిరుమల శ్రీవారిని 22.72లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, హుండీ కానుకలు రూ.122.23కోట్లు లభించాయని చెప్పారు. గత నెలలో తిరుమలలో దాదాపు 1.08కోట్ల లడ్డూలను విక్రయించారని, 10.25లక్షల మంది తలనీలాలు సమర్పించినట్లు చెప్పారు.

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను ఈ నెల 20 నుంచి 28వరకు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. టీటీడీ కార్తీక దీపోత్సవాన్ని నవంబర్ 7న కర్నూలు జిల్లా యాగంటిలో, 14న విశాఖపట్నం, 18న తిరుపతిలో నిర్వహించనున్నారు.

IPL_Entry_Point

టాపిక్