Telugu News Updates 04 March: జీఐఎస్‌ 2023లో రెండో రోజు పలు ఒప్పందాలు-telangana and andhrapradesh telugu live news updates 4th march 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Telangana And Andhrapradesh Telugu Live News Updates 4th March 2023

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023

Telugu News Updates 04 March: జీఐఎస్‌ 2023లో రెండో రోజు పలు ఒప్పందాలు

05:48 AM ISTHT Telugu Desk
  • Share on Facebook
05:48 AM IST

  • Global Investment Summit Updates 2023: విశాఖ వేదికగా తలపెట్టిన ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రెండవ రోజు కొనసాగనుంది. శనివారం ఉదయం 9 గంటలకు ఎంవోయూలపై సంతకాలతో ప్రారంభం కానుంది. 10.30 గంటలకు ప్రముఖ ఇండో అమెరికన్‌ మ్యుజీషియన్‌ కర్ష్‌ కాలే బ్యాండ్‌ ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ప్రారంభ ఉపన్యాసం, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రసంగించారు.  శనివారం మొత్తం 8 రంగాలపై సెషన్లు  ఉండనున్నాయి. తొలి రోజు శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు రూ.11,87,756 కోట్ల విలువైన 92 ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Sat, 04 Mar 202305:48 AM IST

విజయం సాధించింది

జీఐఎస్‌ అంచనాలకు మించి విజయం సాధించిందన్నారు ఏపీ సీఎస్. పారిశ్రామిక దిగ్గజాలు తమ విలువైన అభిప్రాయాలు పంచుకున్నారని అన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. 

Sat, 04 Mar 202304:37 AM IST

తిరుపతి - ఊటీ 

సమ్మర్ వచ్చేసింది...! అయితే చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం చూస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా ఊటీ వెళ్లే వారికోసం సూపర్ ప్యాకేజీ తీసుకువచ్చింది. 'ULTIMATE OOTY EX TIRUPATI ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యే... ఈ టూర్ లో ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి.

Tirupati Ooty Tour Schedule: 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ మార్చి 14వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు.

Sat, 04 Mar 202303:13 AM IST

టెలీ మానస్

పరీక్షల కాలం రావటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ క్రమంలో ఒత్తిడిని భరించలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని... తెలంగాణ ఇంటర్ బోర్డులు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలన్న ఆలోచనతో ‘టెలి-మానస్’ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా విద్యార్థులకు సైకాలజిస్టులతో సేవలు అందించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Sat, 04 Mar 202302:44 AM IST

14 నుంచి అసెంబ్లీ సమావేశాలు 

ఏసీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై క్లారిటీ వచ్చేసింది. మార్చి 14వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి సంబంధించి ఉభయ సభలనూ ఉద్దేశించి 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ప్రసంగిస్తారు. ఇక శాసనమండలి సమావేశాలు కూడా మార్చి 14వ తేదీనే ప్రారంభం కానున్నాయి.

Sat, 04 Mar 202302:44 AM IST

స్పెషల్ ట్రైన్స్.. 

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు తేదీలతో పాటు టైమింగ్స్ వివరాలను పేర్కొంది. మరోవైపు పలు రూట్లలో నడిచే రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది.

Sat, 04 Mar 202302:43 AM IST

కీలక ఒప్పందాలు

Global Investment Summit Updates 2023: విశాఖ వేదికగా తలపెట్టిన ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రెండవ రోజు కొనసాగనుంది. శనివారం ఉదయం 9 గంటలకు ఎంవోయూలపై సంతకాలతో ప్రారంభం కానుంది. 10.30 గంటలకు ప్రముఖ ఇండో అమెరికన్‌ మ్యుజీషియన్‌ కర్ష్‌ కాలే బ్యాండ్‌ ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ప్రారంభ ఉపన్యాసం, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడనున్నారు. శనివారం మొత్తం 8 రంగాలపై సెషన్లు ఉండనున్నాయి. తొలి రోజు శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు రూ.11,87,756 కోట్ల విలువైన 92 ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Sat, 04 Mar 202302:43 AM IST

ఏం జరగబోతుంది

TS Govt Petition in Supreme Court Against Governor: గత కొద్దిరోజులుగా తెలంగాణ గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లు వ్యవహారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. గవర్నర్ తమిళిసై అనుసరిస్తున్న వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. గతేడాది శాసనసభ ఆమోదించిందిన పలు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి రిట్ పిటిషన్ వేశారు. ఈ రిట్ పిటీషన్ లో ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చారు. ఈ వ్యాజంపై త్వరలోనే సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో కేసుపై అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పబోతుంది..? గత తీర్పులను ప్రస్తావిస్తూ... కొత్తగా కీలక తీర్పు ఏమైనా ఇస్తుందా..? అసలు ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.