November Special Trains : నవంబరులో కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు-special trains between dibrugarh to kanyakumari in november via visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Special Trains Between Dibrugarh To Kanyakumari In November Via Visakhapatnam

November Special Trains : నవంబరులో కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu
Oct 31, 2022 08:07 PM IST

Special Trains To Kanyakumari : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భారతీయ రైల్వే.. పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా నవంబరులో కన్యాకుమారికి స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

నవంబర్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దిబ్రూగర్-కన్యాకుమారి(dibrugarh to kanyakumari) మధ్య ప్రత్యేక రైళ్లు మూడు ట్రిప్పులుగా నడవనున్నాయి. రైలు నెంబర్ 05906 దిబ్రూగర్-కన్యాకుమారి స్పెషల్.. నవంబర్ 1,8, 15 తేదీల్లో దిబ్రూగర్‌ నుంచి 07.25 గంటలకు బయలుదేరుతాయి. విశాఖపట్నం(Visakhapatnam) గురువారం 03.30 గంటలకు చేరుకుంటుంది. శుక్రవారం రాత్రి 10.00 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో, రైలు నెంబర్ 05905 కన్యాకుమారి-దిబ్రూగర్ ప్రత్యేక రైలు.. నవంబర్ 6, 13, 20 (ఆదివారాలు) 05.20 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరుతుంది. ఆ తర్వాత 11.45 గంటలకు విశాఖపట్నం(Visakhapatnam) వస్తుంది. బుధవారం రాత్రి 08.50 గంటలకు దిబ్రూగర్ చేరుకుంటుంది.

సెకండ్ ఏసీ-1, థర్డ్ ఏసీ-4, స్లీపర్ క్లాస్-11, జనరల్ సెకండ్ క్లాస్-3, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ కోచ్‌లు-1, ఏసీ ప్యాంట్రీ కార్-1, జనరేటర్ కార్-1 ఉంటాయి.

స్టాప్‌లు: భద్రక్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్(Srikakulam Road), విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి.

100 ప్రత్యేక రైళ్లు

మరోవైపు దక్షిణ మధ‌్య రైల్వే పరిధిలో 100 ప్రత్యేక రైళ్లను దేశంలోని వివిధ ప్రాంతాలకు నడుపనున్నారు. ప్రయాణికుల రద్దీ కొనసాగుతుండటంతో ప్రత్యేక రైళ్లను కొనసాగిస్తున్నట్లుగా అధికాగారులు ప్రకటించారు. నవంబర్‌ నుంచి డిసెంబర్‌ చివరి వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.తిరుపతి -ఔరంగాబాద్‌,తిరుపతి-అకోలా ,హైదరాబాద్‌ -తిరుపతి, కాజీపేట-తిరుపతి , విజయవాడ-నాగర్‌ సోల్‌, కాకినాడటౌన్‌-లింగంపల్లి, మచిలీపట్నం-సికింద్రబాద్‌ మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు.

ట్రైన్‌ నంబర్‌ 07637 తిరుపతి -ఔరంగాబాద్‌ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. నవంబర్‌ 6 నుంచి నవంబర్‌ 27వరకు ప్రతి ఆదివారం ఈ రైలును తిరుపతి నుంచి నడుపనున్నారు. మొత్తం నాలుగు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

ట్రైన్ నంబర్‌ 07638 ఔరంగబాద్‌-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు ప్రతి సోమవారం ఔరంగాబాద్‌లో బయలుదేరుతుంది. నవంబర్‌ 7- 28మధ్య ప్రతి సోమవారం ఈ రైలును నడుపుతారు. మొత్తం నాలుగు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

ట్రైన్‌ నంబర్ 07605 తిరుపతి-అకోలా మధ్య ప్రతి శుక్రవారం ప్రత్యేక రైలు నడువనుంది. నవంబర్‌ నాలుగు నుంచి డిసెంబర్‌ 31 వరకు ప్రతి శుక్రవారం నడిచే ఈ ప్రత్యేక రైలుకు రెండు నెలల్లో 9సార్లు స్పెషల్‌ సర్వీసుగా నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు ట్రైన్‌ నంబర్‌ 07606గా అకోలా-తిరుపతి మధ్య ప్రతి ఆదివారం నడుస్తుంది. నవంబర్‌ 6 నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

ట్రైన్‌ నంబర్‌ 07643 హైదరాబాద్‌ -తిరుపతి మధ్య ప్రతి సోమవారం ప్రత్యేక రైలు నడుపనున్నారు. నవంబర్‌ 7 నుంచి నవంబర్‌ 28వరకు నెలలో నాలుగు ప్రత్యేక సర్వీసులు నడుపుతారు. తిరుగు ప్రయాణంలో 07644 నంబరుతో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వస్తుంది. తిరుపతి నుంచి వచ్చే రైలు ప్రతి మంగళవారం నడుపుతారు. దీనిని కూడా నవంబర్‌లో నాలుగు సార్లు నడుపుతారు.

ట్రైన్ నంబర్‌ 07698 విజయవాడ-నాగర్‌ సోల్‌ మధ్య ప్రతి శుక్రవారం ప్రత్యేక రైలు నడువనుంది. నవంబర్‌ నాలుగు నుంచి 25వరకు ఈ రైలును నడుపుతారు. తిరుగు ప్రయాణంలో 07699 నంబరుతో ప్రతి శనివారం నాగర్‌సోల్‌-విజయవాడ మధ్య ఈ రైలు నడుస్తుంది. నాగర్‌సోల్‌లో ప్రతి ఆదివారం ఈ రైలు బయలుదేరుతుంది.

ట్రైన్ నంబర్‌ 07091 కాజీపేట-తిరుపతి మధ్య ప్రతి మంగళవారం ప్రత్యేక రైలు నడుపనున్నారు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 27వరకు ఈ రైలును రెండు నెలల పాటు 8 సర్వీసులు నడుపనున్నారు. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 07092తో తిరుపతి కాజీపేట మధ్య ప్రతి మంగళవారం నడుస్తుంది.

ట్రైన్‌ నంబర్‌ 07141 కాకినాడటౌన్‌-లింగంపల్లి మధ్య ప్రతి మంగళ, బుధ, శుక్రవారాల్లో నవంబర్‌ 3 నుంచి డిసెంబర్‌ వరకు వారానికి మూడు ప్రత్యేక రైళ్లను నడుపుతారు. నెలలో మొత్తం 13 ప్రత్యేక రైళ్లను కాకినాడ-లింగం పల్లి మధ్య నడుపనున్నారు. తిరుగు ప్రయాణంలో 07142 నంబరుతో లింగంపల్లి-కాకినాడ మధ్య మంగళ, గురు, శనివారం మధ్య నవంబర్ 3 నుంచి డిసెంబర్‌ 1 వరకు 13సర్వీసులు నడుపనున్నారు.

ట్రైన్‌ నంబర్‌ 07185 మచిలీపట్నం-సికింద్రబాద్‌ ప్రత్యేక రైలు నవంబర్ ఆరు నుంచి డిసెంబర్‌ 25 వరకు ప్రతి ఆదివారం నడుపుతారు. రెండు నెలల్లో 8 ప్రత్యేక సర్వీసులు నడుపనున్నారు. తిరుగు ప్రయాణంలో 07186 నంబరుతో సికింద్రబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రతి ఆదివారం ఈ రైలు నడుపుతారు.

IPL_Entry_Point