APSRTC Multi City Journey: ఏపీఎస్‌ఆర్టీసీలో కొత్త సదుపాయం,కనెక్టింగ్ జర్నీకి రిజర్వేషన్-reservation facility for multi city connecting journeys in aps rtc ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Reservation Facility For Multi City Connecting Journeys In Aps Rtc

APSRTC Multi City Journey: ఏపీఎస్‌ఆర్టీసీలో కొత్త సదుపాయం,కనెక్టింగ్ జర్నీకి రిజర్వేషన్

HT Telugu Desk HT Telugu
May 05, 2023 10:04 AM IST

APSRTC Multi City Journey: దూర ప్రాంత ప్రయాణాలకు నేరుగా బస్సు సదుపాయం లేకున్నా ఒకే సారి టిక్కెట్లను రిజర్వ్ చేసుకునే సదుపాయానికి ఏపీఎస్‌ ఆర్టీసి శ్రీకారం చుట్టింది. రైల్వే బ్రేక్ జర్నీ తరహాలో మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్‌ ప్రారంభించారు.

ఆర్టీసీలో మల్టీ సిటీ రిజర్వేషన్ సదుపాయం
ఆర్టీసీలో మల్టీ సిటీ రిజర్వేషన్ సదుపాయం

APSRTC Multi City Journey: ఏపీఎస్‌ ఆర్టీసీలో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి నేరుగా బస్సులు అందుబాటులో లేకపోతే కనెక్టింగ్ జర్నీ రిజర్వేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. రైళ్లలో బ్రేక్ జర్నీ తరహాలో నిర్ణీత వ్యవధిలో ప్రయాణాలకు ఒకేసారి రిజర్వేషన్ కల్పిస్తారు. దీని ద్వారా ప్రయాణికులకు డబ్బు,సమయం రెండు ఆదా కానున్నాయి.

చేరాల్సిన గమ్యస్థానానికి నేరుగా బస్సులు లేకపోయినా ఒకేసారి గమ్యస్థానానికి రిజర్వేషన్ చేసుకునే విధానానికి ఏపీఎస్‌ ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. రైలు ప్రయాణంలో బ్రేక్ జర్నీ తరహాలో కొత్త విధానం తీసుకొచ్చారు. విమాన ప్రయాణికులు తమ గమ్యస్థానానికి నేరుగా విమాన సర్వీసులు లేకపోతే కొంత దూరం ప్రయాణించే మరో చోట విమానం మారి ప్రయాణించే విధంగా మల్టీ సిటీ రిజర్వేషన్ జర్నీ విధానానికి ఏపీఎస్‌ ఆర్టీసీ శ‌్రీకారం చుట్టింది.

రైలు, విమాన ప్రయాణాల తరహా ఏర్పాట్లను ఆర్టీసీలో అమల్లోకి తెస్తున్నారు. ఆర్టీసీ బస్సులో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నేరుగా బస్సు లేకపోతే మధ్యలో ప్రధాన కూడలిగా ఉన్న నగరం, పట్టణం నుంచి బస్సు మారి గమ్యానికి వెళ్లేందుకు ఒకే టికెట్‌ రిజర్వ్‌ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. 'మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్‌' పేరిట దీనిని అందుబాటులోకి తెచ్చారు. శ్రీకాకుళానికి చెందిన ఓ ప్రయాణికుడు అనంతపురం వెళ్లేందుకు నేరుగా లాంగ్ డిస్టెన్స్‌ బస్సులు ఉండవు.

ఇకపై శ్రీకాకుళం నుంచి విజయవాడకు ఒక బస్సులో వచ్చి, విజయవాడ నుంచి అనంతపురానికి మరో సర్వీసులో వెళ్లడానికి కూడా ఒకే టికెట్‌లో రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. రెండు బస్సుల్లో ప్రయాణించేందుకు రిజర్వేషన్‌ చేసుకున్నా కేవలం ఒక్కసారి మాత్రమే రిజర్వేషన్‌ ఛార్జి వసూలు చేస్తారు. ప్రయాణికుడు మొదట ఓ బస్సులో ప్రయాణించి రెండో ప్రాంతం నుంచి మరో బస్సులోకి మారేందుకు గడువు కూడా ఇస్తారు. ఇలా 2 నుంచి 22 గంటల వ్యవధిలోగా ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. ఆ సమయాల్లో అందుబాటులో ఉన్న సర్వీసులను ముందుగానే రిజర్వేషన్‌ చేసుకోవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా 137 మార్గాల్లో ఈ విధానాన్ని తొలిసారి అమలుచేయనున్నారు. యూటీఎస్‌ మొబైల్‌ అప్లికేషన్‌తో, ఆర్టీసీ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఈ రిజర్వేషన్లు చేసుకోవచ్చు. దేశంలోని ప్రభుత్వరంగ రోడ్డు రవాణా సంస్థల్లో రాష్ట్రంలోనే ఈ విధానాన్ని తొలిసారి అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వారంలోనే కొత్త విధానం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

IPL_Entry_Point