Ap weather Update: ఏపీలో కొనసాగుతున్న వడగాల్పులు..-people of andhra pradesh are shaking with high temperatures ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Update: ఏపీలో కొనసాగుతున్న వడగాల్పులు..

Ap weather Update: ఏపీలో కొనసాగుతున్న వడగాల్పులు..

HT Telugu Desk HT Telugu
Jun 07, 2023 11:31 AM IST

Ap weather Update: ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మరో వారం రోజుల వరకు నైరుతి రుతు పవనాలు ప్రవేశించే పరిస్థితి లేకపోవడంతో వేసవి ఉష్ణోగ్రతలు జనాల్ని అల్లాడిస్తున్నాయి.

ఏపీలో ఎండలు
ఏపీలో ఎండలు

Ap weather Update: ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 218 మండలాల్లో వడగాల్పులు,గురువారం 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 260 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా వరదరాజపురంలో 43.3°C, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9°C, ఏన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.7°C, అల్లూరి జిల్లా కొండైగూడెం,తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.6°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 161 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వెల్లడించారు.

బుధవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీఎస్‌డిఎంఏ వెల్లడించింది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య ,చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C - 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. మరోవైపు వేసవిలో అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే అకాల వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.

Whats_app_banner