Heart Stroke Deaths :బెంబేలెత్తిస్తున్న గుండెపోటు చావులు…ఒకే రోజు ఇద్దరుమృతి-heart attack deaths two young boys killed with massive strokes in palnadu and satyasai districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Heart Stroke Deaths :బెంబేలెత్తిస్తున్న గుండెపోటు చావులు…ఒకే రోజు ఇద్దరుమృతి

Heart Stroke Deaths :బెంబేలెత్తిస్తున్న గుండెపోటు చావులు…ఒకే రోజు ఇద్దరుమృతి

HT Telugu Desk HT Telugu
Mar 08, 2023 08:00 AM IST

Heart Stroke Deaths ఆటలు ఆడుతూ, పాఠాలు చెబుతూ, వ్యాయామాలు చేస్తూ అప్పటి వరకు చలాకీగా ఉన్న వారు ఆకస్మాత్తుగా గుండెపోటుతో విలవిలలాడుతూ ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు చనిపోయారు. నిద్రలో ఒకరు, కబడ్డీ ఆడుతూ మరొకరు గుండె పోటుకు బలయ్యారు.

గుండెపోటుతో చనిపోయిన ఫిరోజ్‌ఖాన్‌, తనూజ్ నాయక్
గుండెపోటుతో చనిపోయిన ఫిరోజ్‌ఖాన్‌, తనూజ్ నాయక్

‌Heart Stroke Deaths గుండెపోటు చావులు కొనసాగుతున్నాయి. గత వారం పది రోజులుగా ఎక్కడో చోట ఆకస్మిక మరణాలు జరుగుతునూ ఉన్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వారు, యువకులు, ఆరోగ్యంగా ఉన్నఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్నారు. గత పక్షం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా మరణాలు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి.

తాజాగా పల్నాడు జిల్లాలో గుండెపోటుతో ఓ విద్యార్థి నిద్రలోనే మరణించాడు. మరో విద్యార్థి కబడ్డీ ఆడుతూ కుప్పకూలి, ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి మృత్యువాత పడ్డాడు. చిన్న వయసులోనే యువకులు ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

20 ఏళ్లలోపు వయసున్నఇద్దరు యువకులు గుండెపోటుకు బలయ్యారు. చిన్న వయసులో ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో యువకుల మరణాలు అంతు లేని విషాదాన్ని నింపాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన ఫిరోజ్‌ఖాన్‌ చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

సోమవారం కాలేజీ నుంచి వచ్చాక రాత్రి వరకు చదువుకుని నిద్రపోయాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెద్దగా గురక పెడుతూ శబ్దాలు చేయడంతో పక్కనే ఉన్న సోదరి ఫర్జానా భయపడి తల్లిదండ్రులను నిద్ర లేపింది. వారు వచ్చి కడుపు నొప్పిగా భావించి మంచినీరు తాగించాలని చూసినా లోపలకు గుటక వేయకపోపోవడంతో బాధితుడ్ని హుటాహుటిన చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

విద్యార్థిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. తన కొడుకు కష్టపడి చదువుకుంటాడని, ఎలాంటి ఒత్తిడి, అనారోగ్యం లేవని, అనారోగ్య సమస్యలు లేవని మృతుని తండ్రి వజీర్‌బాషా విలపించారు. నిన్నటి తమతో కలిసి తిరిగిన మిత్రుడు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో స్నేహితులు, బంధువులు ఖిన్నులయ్యారు. గుండె పోటు తర్వాత మెదడుకు రక్తప్రసరణ పూర్తిగా నిలిచిపోవడంతో ఫిరోజ్‌ఖాన్‌ మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు.

అనంతపురంలో ఆడుకుంటున్న ఓ విద్యార్ధి గుండెపోటుకు గురయ్యాడు. ఓ ప్రైవేటు కళాశాలలో బీ-ఫార్మసి చదువుతున్న తనూజ్‌నాయక్‌ అనే విద్యార్థి మార్చి 1వ తేదీన కళాశాల ప్రాంగణంలో కబడ్డీ ఆడుతూ సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినా పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరులోని ఆసుపత్రిలో చేర్పించారు.

తనూజ్‌ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి బాధితుడు మృతి చెందాడు. గుండెపోటు వల్లే తమ కుమారుడు మృతి చెందాడని వైద్యులు చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం ఈ- అచ్చంపల్లి తండాకు చెందిన తనూజ్‌ కుటుంబంబెంగళూరుకు వలస వెళ్లింది. బాగా చదివి వృద్ధిలోకి వస్తాడనుకున్న చిన్న వయసులోనే మృతి చెందడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు.

IPL_Entry_Point