AP BRS : బీఆర్ఎస్‌కు ఈసీ షాక్ ..ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా రద్దు-election commission withdrew state party recognition to brs in andhra pradesh did not contest in 2014 election ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Brs : బీఆర్ఎస్‌కు ఈసీ షాక్ ..ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా రద్దు

AP BRS : బీఆర్ఎస్‌కు ఈసీ షాక్ ..ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా రద్దు

HT Telugu Desk HT Telugu
Apr 11, 2023 08:30 AM IST

AP BRS : బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ హోదా గుర్తింపు కోల్పోయింది. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో నాటి టిఆర్‌ఎస్‌ పార్టీ పోటీ చేయకపోవడంతో తెలంగాణకు మాత్రమే పరిమితం అయ్యింది.

ఏపీలో కారు జోరుకు ఎన్నికల సంఘం బ్రేకులు
ఏపీలో కారు జోరుకు ఎన్నికల సంఘం బ్రేకులు

AP BRS : జాతీయ పార్టీగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ను రాష్ట్ర పార్టీగా మాత్రమే గుర్తించింది. ఏపీలో బీఆర్ఎస్ ను రాష్ట్ర పార్టీగా గుర్తించ లేదు. తెలంగాణలో మాత్రమే బీఆర్ఎస్ కు రాష్ట్ర పార్టీ గుర్తింపు ఉంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. రాష్ట్ర విభజన సమయంలో టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) తెలంగాణ, ఏపీలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు దక్కించుకుంది.

విభజన అనంతరం ఆ పార్టీ తెలంగాణకు మాత్రమే పరిమితం అయింది. ఏపీలో జరిగిన ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అదే విధంగా ఏపీలో ఆ పార్టీకి సంబంధించి సమాచారం ఇవ్వాలని ఈసీ కోరినా సమావేశాలకు బీఆర్ఎస్ హాజరుకాలేదు. ఎన్నికల గుర్తులు( రిజర్వేషన్, కేటాయింపులు) 1968 ఆర్డర్ ప్రకారం తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ ప్రకటించింది.

రాష్ట్ర పార్టీ హోదా రావాలంటే?

ఏదైనా పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా రావాలంటే....ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆ పార్టీ కనీసం 3 శాతం ఓట్లు రావాల్సి ఉంది. లేదంటే మూడు అసెంబ్లీ సీట్లు గెలవాల్సి ఉంటుంది. అటువంటి పార్టీకి రాష్ట్ర హోదా కల్పిస్తుంది ఈసీ. విభజన అనంతరం ఏపీలో జరిగిన ఏ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. దీంతో బీఆర్ఎస్ ఏపీలో రాష్ట్ర పార్టీ హోదాను కోల్పోయింది.

దేశంలోని పలు రాజకీయ పార్టీలను రాష్ట్ర పార్టీ హోదాను కోల్పోయాయి. పుదుచ్చేరిలోని పీఎంకే, మణిపూర్ లోని పీడీఏ, ఉత్తరప్రదేశ్ లోని ఆర్ఎల్డీ, పశ్చిమ బెంగాల్లోని ఆర్ఎస్పీ, మిజోరంలోని ఎంపీసీ కూడా రాష్ట్ర పార్టీ హోదాను కోల్పోయాయి. రామ్ విలాస్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ, మేఘాలయాలోని వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ, త్రిపురలోని త్రిపా మోథాకు రాష్ట్ర పార్టీ హోదా కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్ర బీఆర్ఎస్ లో చేరికలు

మరోవైపు మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఎన్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ సలుంఖే , మాజీ ఎమ్మెల్యే సంగీత వి థోంబరే భర్త విజయ్ థోంబరే తదితరులు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ విధానాలతో ఆకర్షితులైన పలు పార్టీల నాయకులు, ప్రముఖులుతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీలు నేతలు చెబుతున్నారు.

మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే శంకర్న ధోంగే నేతృత్వంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు సోమవారం హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబి కండువాలు కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

IPL_Entry_Point