Telugu News  /  Andhra Pradesh  /  Apsrtc Cargo Door Delivery Service Start From 1st September
ఏపీఎస్ఆర్టీసీ
ఏపీఎస్ఆర్టీసీ

APSRTC : ఏపీఎస్​ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ.. ఎప్పటి నుంచి అంటే?

24 July 2022, 17:01 ISTHT Telugu Desk
24 July 2022, 17:01 IST

ఏపీఎస్​ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ ప్రారంభించనుంది. త్వరలో ఈ సదుపాయం అమలులోకి రానుంది.

ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలు త్వరలో ఇంటి వరకూ రానున్నాయి. 50కేజీల వరకు మీరు బుకింగ్ చేసిన పార్శిల్, కొరియర్స్​ను మీ ఇంటి ముందకుకు వస్తాయి. ఈ సేవలు ఆర్టీసీ సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమలు చేయనుంది. పార్శిల్ కౌంటర్ నుంచి 10 కిలో మీటర్ల పరిధిలో ఈ డోర్ డెలివరీ అందుతుంది. ఆంధ్రప్రదేశ్​లోని జిల్లా కేంద్రాలు, పట్టణాలలో డోర్ డెలివరి సదుపాయం ఉంటుంది. 1 కేజీ వరకు బరువు ఉంటే.. రూ.18గా ఛార్జ్ చేస్తారు. 1 కేజీ నుంచి 6 కేజీలు-రూ.30, 6 కేజీల నుంచి 10 కేజీలు-రూ.36, 10 కేజీల నుంచి 25 కేజీలు-రూ.48, 25 కేజీల నుంచి 50 కేజీలు- రూ.59గా చెల్లించాలి.

ట్రెండింగ్ వార్తలు