AP Genco Record: ఏపీ జెన్‌కో రికార్డ్..ఒక్క రోజులో 105.620మిలియన్‌ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి-ap genco has set a record for producing the most electricity in a single day ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Genco Has Set A Record For Producing The Most Electricity In A Single Day

AP Genco Record: ఏపీ జెన్‌కో రికార్డ్..ఒక్క రోజులో 105.620మిలియన్‌ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

HT Telugu Desk HT Telugu
May 15, 2023 07:10 AM IST

AP Genco Record:ఏపీ జెన్ కో కొత్త రికార్డు సృష్టించింది. ఒకేరోజు 105 .620 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఒక్కరోజులో జెన్‌కో ప్లాంట్ల నుంచి 5137 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసి రికార్డు సృష్టించారు.

జెన్‌కో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి
జెన్‌కో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి

AP Genco Record: ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విద్యుదుత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. శనివారం 105.620 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి నమోదు చేసింది. శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకూ సుమారు 114 మిలియన్ యూనిట్ల విద్యుదుత్వత్తి చేయగా జెన్ కో వినియోగానికి పోనూ 105.620 మిలియన్ యూనిట్లు గ్రిడ్ కు సరఫరా చేసింది. ఒక్క రోజులో 5137 మెగావాట్లను సొంతంగా అందించడం రికార్డుగా జెన్‌కో అధికారులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఒకరోజులో ఇదే అత్యధిక ఉత్పత్తిగా నిలిచింది. అత్యధిక విద్యుదుత్పత్తి చేయడానికి అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసినట్లు జెన్ కో ఎండీ చక్రధర్ బాబు తెలిపారు. రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించినందుకు ఏపీ జెన్ కో ఉద్యోగులను మేనేజింగ్ డైరెక్టర్ చక్రధర్ బాబు అభినందించారు.

వేసవి తీవ్రత నేపథ్యంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేసి రాష్ట్ర అవసరాలను తీర్చడానికి మరింత అంకిత భావంతో పని చేయాలని ఉద్యోగులకు సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వ సహకారంతో ఏపీ జెన్ కో అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఎండీ తెలిపారు.

విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌లో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన కొత్త యూనిట్ విద్యుదుత్పత్తి త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. లోయర్ సీలేరులో మరో 230 మెగావాట్ల ఉత్పత్తి కోసం రెండు యూనిట్ల నిర్మాణ పనులు త్వరగా చేపట్టి ఏడాదిలో పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు.

IPL_Entry_Point