Electric Smart Meters : 200 యూనిట్లు దాటిన వారికే స్మార్ట్ మీటర్లు…-ap energy department says no need for misconceptions about the installation of smart meters ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Electric Smart Meters : 200 యూనిట్లు దాటిన వారికే స్మార్ట్ మీటర్లు…

Electric Smart Meters : 200 యూనిట్లు దాటిన వారికే స్మార్ట్ మీటర్లు…

HT Telugu Desk HT Telugu
Jan 03, 2023 09:44 AM IST

Electric Smart Meters ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై జరుగుతున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని ఇంధన శాఖ కోరుతుోంది. గృహ వినియోగంలో 200యూనిట్ల వినియోగానికి పైబడిన వారికే కొత్త మీటర్లను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. స్మార్ట్ మీటర్ల కొనుగోలు వ్యవహారంలో దేశ వ్యాప్తంగా ఒకే తరహా నిబంధనలు అమల్లో ఉన్నాయని చెబుతున్నారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్
ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్

Electric Smart Meters గృహ అవసరాల కనెక్షన్లలో 4 లక్షల 72 వేల కనెక్షన్లను మాత్రమే తొలి దశలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అమృత్ సిటీలలోను, జిల్లా హెడ్ క్వార్టర్స్‌ లోను, 200 యూనిట్లు దాటిన 4.72 లక్షల కనెక్షన్స్‌ కి మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్పష్టం చేశారు.

రాష్ట్రం‌ మొత్తంగా ఒక కోటి 89 లక్షల వినియోగదారులు ఉన్నారని తెలిపారు. మొత్తం 1.89 కోట్ల కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లు బిగించడానికి టెండర్లు పిలిచారని జరుగుతున్న ప్రచారం అవాస్తవని, దీనిని ఇంధనశాఖ ఖండిస్తుందని చెప్పారు. ఫేజ్-2లో 13.54 లక్షల మందికి స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఫేజ్-2 కి ఇంకా టెండర్లు పిలవలేదని స్పష్టం చేశారు.

ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, గుజరాత్ తదితర 15 రాష్ట్రాలు స్మార్ట్ మీటర్లకి టెండర్లు పిలిచాయన్నారు. ఆంధ్రప్రదేశ్ 16వ రాష్ట్రంగా టెండర్లు పిలుస్తోందన్నారు. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 2022 నాటికి ఫీడర్లు, డిసెంబర్ 2025 నాటికి వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ఆర్డీఎస్ఎస్ స్కీమ్ లో భాగంగా మార్చి 2025 నాటికి అన్ని ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని తెలిపారు. తదనుగుణంగా 2019 లోనే అన్ని మీటర్లను స్మార్ట్ మీటర్లుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని 2020లో రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు.

రాష్ట్రంలో దాదాపు 18 లక్షల 57 వేల వ్యవసాయ కనెక్షన్లను స్మార్ట్ మీటర్లుగా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. దీనికోసం ఆర్.డీఎస్ఎస్ ద్వారా 60% గ్రాంట్ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. మొదటి ఫేజులో 27 లక్షల 68 వేల మీటర్లు‌ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నామని వాటిలో ఫీడర్లకు 3 లక్షల 7వేల కనెక్షన్లు , ప్రభుత్వ కార్యాలయాలకు దాదాపు 3లక్షల 22 వేల కనెక్షన్లు, పరిశ్రమలకు ఒక లక్షా 19 వేల 500 కనెక్షన్లు , కమర్షియల్ కనెక్షన్లు 15లక్షల 47 వేలు ఉన్నాయని చెబుతున్నారు

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇంధనశాఖలో కూడా మార్పులు జరగాలని రాష్ట్రంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చెప్పారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడంపై ఇంధన శాఖకు ఎలాంటి అభ్యంతరం లేదని, పూర్తిగా ఆహ్వానిస్తోందన్నారు.

ఆర్డీఎస్ఎస్ పథకం క్రింద కేంద్రం నుంచి రాష్ట్రానికి 5,484 కోట్లు గ్రాంటుగా వస్తాయని తెలిపారు. 30 శాతం ఓవర్ లోడ్ ఉన్న ఫీడర్లను గుర్తించామన్నారు. కేంద్రం నుంచి గ్రాంట్ వస్తుంది కాబట్టి ఆ భారం డిస్కంలపై పడదని తెలిపారు. స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారులకి అదనపు భారం పడదన్నారు. రైతుల మీద పైసా కూడా భారం పడకుండా ప్రభుత్వమే స్మార్ట్ మీటర్ల భారాన్ని భరిస్తోందని విజయానంద్ తెలిపారు.

IPL_Entry_Point