Gomati chakra: గోమతి చక్రాలు ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?-what happens if you keep gomati chakras at home what are the results ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gomati Chakra: గోమతి చక్రాలు ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

Gomati chakra: గోమతి చక్రాలు ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

Gunti Soundarya HT Telugu
Apr 30, 2024 09:06 AM IST

Gomati chakra: గోమతి చక్రాలు అంటే ఏంటి? వీటిని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి. అదృష్టం కోసం ఎన్ని గోమతి చక్రాలు ఇంట్లో పెట్టుకోవచ్చో తెలుసుకుందాం.

గోమతి చక్రాలు ఇంట్లో పెట్టుకోవచ్చా?
గోమతి చక్రాలు ఇంట్లో పెట్టుకోవచ్చా? (pinterest)

Gomati chakra: చాలా మంది ఇంట్లో గోమతి చక్రాలు పూజ గదిలో కనిపిస్తునే ఉంటాయి. నత్తగుల్ల పైన ఉండే డొప్ప మాదిరిగా ఇవి ఉంటాయి. సహజ సముద్రపు ఉత్పత్తులు ఈ గోమతి చక్రాలు. గుజరాత్ రాష్ట్రం ద్వారకలో ఇవి ఎక్కువగా దొరుకుతాయి.

కృష్ణుడి చేతిలోనే సుదర్శన చక్రాన్ని ఇవి పోలి ఉంటాయి. అందుకే వీటిని నాగచక్రం, విష్ణు చక్రం అని కూడా పిలుస్తారు. గోమతి చక్రాలు పూజల్లో బాగా ఉపయోగిస్తారు. ఇవి ఉంటే నరదిష్టి నుంచి కాపాడుతుందని నమ్ముతారు. అందుకే చాలా మంది మెడలో లాకెట్ గా ధరిస్తారు. ఎర్రగా ఉన్న గోమతి చక్రాలను తాంత్రిక విద్యలలో ఉపయోగిస్తారు. వీటిలో 6, 9 అనే సంఖ్యలు దాగి ఉన్నాయని పండితులు చెబుతారు.

గోమతి చక్రాలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

శాస్త్రం ప్రకారం ఆరు శుక్ర గ్రహానికి చెందినది అయితే తొమ్మిది కుజ గ్రహానికి చెందినది. జాతకంలో కుజ, శుక్ర గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ఆటంకాలు, ప్రేమికుల మధ్య వివాదాలు వంటి సమస్యలు ఏర్పడతాయి. వీటి నుంచి బయటపడేందుకు గోమతి చక్రాలు ధరిస్తే కుజ, శుక్రుల స్థానాలు బలపడతాయని పండితులు చెబుతున్నారు.

లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు గోమతి చక్రాలను పూజ గదిలో పెట్టుకుంటారు. మరికొందరు ఎర్రటి వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టుకుంటారు. ఇలా చేస్తే డబ్బుకు కొదువ ఉండదని నమ్ముతారు. శ్రీ యంత్రం లేదా అష్టలక్ష్మి యంత్రంతో గోమతి చక్రాలని కలిపి ఉంచుతారు. వీటిని శుక్రవారం పూట పూజ చేస్తారు. గోమతి చక్రాలు శుక్ర గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. మొదటిసారిగా ఇంటికి వీటిని తీసుకొచ్చిన తర్వాత గంగా జలం లేదా పసుపు నీళ్లతో శుభ్రంగా కడిగి పరిశుభ్రమైన వస్త్రంతో తుడిచి పూజ గదిలో పెట్టుకోవచ్చు.

గోమతి చక్రం ఉపయోగాలు

గోమతి చక్రం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. జ్యోతిషశాస్త్ర ప్రకారం ఒక గోమతి చక్రాన్ని తాగే నీళ్లలో ఉంచడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే దీన్ని లాకెట్ గా ధరిస్తే నర దిష్టి తగ్గుతుంది. బాలారిష్ట దోషాలు కూడా పోతాయని జ్యోతిష్యులు సూచిస్తారు.

రెండు గోమతి చక్రాలను బీరువాలో గాని డబ్బులు ఉంచే ప్రదేశంలో గాని పెట్టుకుంటే సంపద వృద్ధి చెందుతుంది. ధనానికి లోటు అనేది ఉండదు. అలాగే వీటిని పరుపు కింద లేదా దిండి కింద పెట్టుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా జీవిస్తారు.

గోమతి చక్రాలను బ్రాస్లెట్ లాగా చేసుకుని చేతికి పెట్టుకోవడం వల్ల మీకు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులను సులభంగా ఆకర్షించగలుగుతారు.

పంటలు సరిగా పండక నష్టాలు వస్తున్నట్లయితే మీరు నాలుగు గోమతి చక్రాలను పొడిచేసి దున్నేటప్పుడు పొలంలో వేసుకోవచ్చు. లేదా మామూలుగా వాటి పొడిని చల్లుకోవడం పంటలు సమృద్ధిగా పండుతాయి. లాభాలు గడిస్తారు. అలాగే గృహ నిర్మాణ సమయంలో గర్భ స్థానంలో నాలుగు గోమతి చక్రాలు భూమిలో స్థాపించడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణం పూర్తవుతుంది. ఇంట్లోని వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. వాహనానికి కట్టుకోవడం వల్ల వాహన ప్రమాదాల నుండి బయటపడతారు.

సంతానం కోసం 

సంతానం లేని వారికి, తరచూ గర్భస్రావం అవుతున్న మహిళలు ఐదు గోమతి చక్రాలను నడుముకు కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గర్భం నిలుస్తుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ దగ్గరికి కూడా ఐదు గోమతి చక్రాలు పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వారికి ఏకాగ్రత పెరిగి చదువులో రాణిస్తారు.

పుత్ర సంతానం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు 5 గోమతి చక్రాలను పారే నదిలో గాని జలాశయాల్లో కానీ వదలాలి.

అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ మంచం పట్టిన వాళ్ళు త్వరగా కోలుకునేందుకు ఆరు గోమతి చక్రాలను రోగి మంచానికి కట్టాలి. ఇలా చేయడం వల్ల వారి ఆనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శత్రువులపై విజయం సాధించేందుకు వీటిని దగ్గర ఉంచుకోవచ్చు.

ఏడు గోమతి చక్రాలు ఇంట్లో ఉంటే వైవాహిక జీవితం ఆనందంతో నిండిపోతుంది. ఇతరులతో మీ బంధాలు మెరుగుపడతాయి. దంపతుల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు తొలగిపోతాయి.

ఎనిమిది గోమతి చక్రాలు అష్టలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. తొమ్మిది చక్రాలని ఇంట్లో పెట్టుకుంటే ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది.

దోషాలు తొలగిపోయేందుకు 

పది చక్రాలు మీరు పని చేసే ఆఫీస్ లో పెట్టుకుంటే మీకు మంచి గుర్తింపు ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు.

గృహ నిర్మాణం చేసేటప్పుడు పునాదిలో పదకొండు గోమతి చక్రాలు వేస్తే వాస్తు దోషాలు లేకుండా ఉంటాయి.

13 గోమతి చక్రాలను శివాలయంలో దానం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.

27 గోమతి చక్రాలను వ్యాపారం చేసే కార్యాలయం గుమ్మానికి కట్టుకోవాలి.ఆ ద్వారం గుండా ప్రయాణిస్తూ వ్యాపారం చేసే వారికి దినదినాభివృద్ధి కలుగుతుంది.

కాలసర్ప దోషం, నాగ దోషం మొదలైనవి ఉన్నవాళ్లు గోమతి చక్రాలను ధరించవచ్చు లేదా వాటిని పూజించవచ్చు. వీటిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే మెడలో లాకెట్ లో కూడా ధరించవచ్చు. 

WhatsApp channel

టాపిక్