Amitabh Bachchan: టీమిండియా క్రికెట‌ర్ల‌కు ప్ర‌భాస్ క‌ల్కి టీమ్ స‌ర్‌ప్రైజ్ - యుద్ధానికి సిద్ధంకండి అంటూ అమితాబ్ పిలుపు-kalki 2898 ad makers supports team india in t20 world cup 2024 amitabh bachchan special message video vira ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Amitabh Bachchan: టీమిండియా క్రికెట‌ర్ల‌కు ప్ర‌భాస్ క‌ల్కి టీమ్ స‌ర్‌ప్రైజ్ - యుద్ధానికి సిద్ధంకండి అంటూ అమితాబ్ పిలుపు

Amitabh Bachchan: టీమిండియా క్రికెట‌ర్ల‌కు ప్ర‌భాస్ క‌ల్కి టీమ్ స‌ర్‌ప్రైజ్ - యుద్ధానికి సిద్ధంకండి అంటూ అమితాబ్ పిలుపు

Nelki Naresh Kumar HT Telugu
May 02, 2024 12:09 PM IST

Amitabh Bachchan: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌బోతున్న టీమిండియా క్రికెట‌ర్ల‌లో ప్ర‌భాస్ క‌ల్కి మూవీ టీమ్ స్ఫూర్తిని నింపుతూ ప్ర‌త్యేకంగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. అమితాబ్ వాయిస్‌తో రిలీజైన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 టీమిండియా
టీమిండియా

Amitabh Bachchan: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాల్గొన‌బోతున్న టీమిండియా క్రికెట‌ర్ల‌కు ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ మూవీ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌రంలో గొప్ప‌గా పోరాడాలి అంటూ స్పెష‌ల్ మెసేజ్‌ను అందించింది. బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్ వాయిస్‌తో క‌ల్కి మూవీ టీమ్ రిలీజ్ చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అమితాబ్ వాయిస్‌తో...

క‌ల్కి టీమ్ రిలీజ్ చేసిన ఈ వీడియోలో అమితాబ్ బ‌చ్చ‌న్ క‌ల్కిలో చేసిన అశ్వ‌త్థామ గెట‌ప్‌లో క‌నిపించారు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ఉద్దేశిస్తూ ఇదొక మ‌హాయుద్ధం. ఈ సంగ్రామంలో పోరాడేందుకు సిద్ధంగా ఉండండి. ఈ యుద్ధంలో ధైర్యంగా మీ బ‌లాన్ని చూపించండి. మీ శ‌క్తి సామ‌ర్థాల్ని పూర్తిగా ప్ర‌ద‌ర్శించండి. విజ‌యం ముందు త‌ల‌వంచొద్దు అంటూ టీమిండియా క్రికెట‌ర్ల‌లో స్ఫూర్తిని నింపారు అమితాబ్‌. ఆయ‌న వాయిస్ గంభీరంగా ఈ వీడియోలో వినిపిస్తోంది. ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వ‌స్తోన్న క‌ల్కి బీజీఎమ్ ఆక‌ట్టుకుంటోంది.

ధోనీ నుంచి విరాట్ వ‌ర‌కు...

ఈ వీడియోలో వ‌ర‌ల్డ్ క‌ప్‌కు సెలెక్ట్ అయిన టీమిండియా క్రికెట‌ర్లు అంద‌రూ క‌నిపించారు. విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, బుమ్రాతో పాటు మాజీ క్రికెట‌ర్లు ధోనీ, ఇర్ఫాన్ ప‌ఠాన్‌, జోగింద‌ర్ శ‌ర్మ లాంటి క్రికెట‌ర్ల‌ను చూపించారు. టీమిండియా తొలి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన వీడియోల‌ను ఆవిష్క‌రించారు. అలాగే పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లి చేసుకున్న గెలుపు సంబ‌రాలు, రోహిత్ శ‌ర్మ సిక్స్‌లు కొట్టిన‌ట్లుగా చూపించ‌డం వీడియోలో ఆక‌ట్టుకుంటోంది.

క‌ల్కి టీమ్ క్రియేటివిటీ...

క‌ల్కి టీమ్ రిలీజ్ చేసిన ఈ వీడియో క్రికెట్ అభిమానుల‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. క‌ల్కి ప్ర‌మోష‌న్స్‌లో మూవీ టీమ్ త‌న క్రియేటివిటీని చూపిస్తోంద‌ని అంటున్నారు.

జూన్ 27న రిలీజ్‌...

క‌ల్కి మూవీ జూన్ 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. తొలుత మే 9న క‌ల్కి మూవీని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో సినిమా రిలీజ్ వాయిదాప‌డింది.

క‌ల్కి మూవీని నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌భాస్‌ మూవీతోనే దీపికా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌గా న‌టిస్తోన్న ఈసినిమా ప్ర‌భాస్ గురువుగా కీల‌క పాత్ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ క‌నిపించ‌బోతున్నాడు.

600 కోట్ల బ‌డ్జెట్‌...

దాదాపు ఆరు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై టాలీవుడ్ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ మూవీని నిర్మిస్తోన్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందిన ఈ మూవీని త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో డ‌బ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

నాలుగు సినిమాలు...

క‌ల్కి 2989 ఏడీ తో పాటు మ‌రో మూడు సినిమాల‌కు ప్ర‌భాస్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రాజా సాబ్ పేరుతో సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ మూవీ చేస్తోన్నాడు ప్ర‌భాస్‌. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీ ఏడాదే రిలీజ్ కానుంది. ప్ర‌భాస్‌, సీతారామం ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కాంబోలో ఓ ల‌వ్ స్టోరీ తెర‌కెక్కుతోంది. వీటితో పాటు స‌లార్ 2 కూడా చేయ‌బోతున్నాడు ప్ర‌భాస్‌.

IPL_Entry_Point