India vs New Zealand 1st T20I: పంత్ ఓపెనర్‌గా రావాలి.. భువికి నో ఛాన్స్.. కివీస్‌తో మ్యాచ్‌పై జాఫర్ స్పందన-wasim jaffer says rishab pant should open indian innings against new zealand ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs New Zealand 1st T20i: పంత్ ఓపెనర్‌గా రావాలి.. భువికి నో ఛాన్స్.. కివీస్‌తో మ్యాచ్‌పై జాఫర్ స్పందన

India vs New Zealand 1st T20I: పంత్ ఓపెనర్‌గా రావాలి.. భువికి నో ఛాన్స్.. కివీస్‌తో మ్యాచ్‌పై జాఫర్ స్పందన

Maragani Govardhan HT Telugu
Nov 17, 2022 08:00 PM IST

India vs New Zealand 1st T20I: న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి తొలి టీ20 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు రిషబ్ పంత్‌ను ఓపెనింగ్ పంపాల్సిందిగా వసీం జాఫర్ సూచించాడు.

రిషబ్ పంత్
రిషబ్ పంత్ (AFP)

India vs New Zealand 1st T20I: పొట్టి ప్రపంచకప్ సమరంలో వైఫల్యం తర్వాత టీమిండియా.. న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ముందు 3 టీ20ల సిరీస్, అనంతరం 3 వన్డేల సిరీస్ ఆడనుంది. దీంతో మొదటి టీ20 శుక్రవారం ఆడనుంది భారత్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ఆటగాళ్లంతా దూరమైన వేళ హార్దిక్ పాండ్య నేతృత్వంలో యువ జట్టు తలపడనుంది. టీ20 వరల్డ్ కప్‌లో టాపార్డర్ విఫలమైన వేళ.. ఓపెనింగ్ ఎవర్నీ పంపిస్తారు అనే చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ స్పందించాడు. రిషభ్ పంత్‌తో ఓపెనింగ్ చేయిస్తే బాగుంటుందని స్పష్టం చేశాడు.

"రిషబ్ పంత్‌కు బెస్ట్ ప్లేస్ టాపార్డరే. ఓపెనర్‌గా వస్తే బెటర్. ఫీల్డర్‌లు సర్కిల్ లోపల ఉన్నప్పుడు అతడు టెస్టులు, వన్డేల్లో మాదిరిగా ప్రమాదకరంగా మారతాడు. ఒక్కసారి అతడు 20, 30 పరుగులు చేసినట్లయితే బయట ఫీల్డర్లను అస్సలు పట్టించుకోడని అనుకుంటున్నాను. సాధారణంగా అతడు ఎప్పుడూ వచ్చే 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే ఒత్తిడి కారణంగా సిక్సర్లు కొట్టడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. పంత్ లాంటి ఆటగాడిని మెరుగైన ఆరంభానికి ఉపయోగించుకోవాలి." అని జాఫర్ స్పష్టం చేశాడు.

అలాగే పేసర్లలో భువనేశ్వర్ కంటే కూడా మహమ్మద్ షమీకే జాఫర్ ఓటేశాడు. అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్‌తో కలిపి ముగ్గురు పేసర్లను ఎంపిక చేశాడు. శుభ్‌మన్ గిల్‌ను మరో ఓపెనర్‌గా తీసుకున్నాడు. స్పిన్నర్లలో కుల్దీప్, చాహల్‌లో ఒకరికి అవకాశమివ్వగా.. వాషింగ్టన్ సుందర్‌‌కు తుది జట్టులో స్థానామిచ్చాడు.

కివీస్‌తో తొలి టీ20కి జాఫర్ జట్టు..

శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, కుల్దీప్ యాదవ్/యజువేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

WhatsApp channel

సంబంధిత కథనం