Ravishastri on Pant vs Karthik: సెమీస్‌లో పంత్‌, కార్తీక్‌లలో ఎవరు ఆడాలి.. రవిశాస్త్రి సమాధానమిదీ-ravishastri on pant vs karthik in semifinal against england ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ravishastri On Pant Vs Karthik In Semifinal Against England

Ravishastri on Pant vs Karthik: సెమీస్‌లో పంత్‌, కార్తీక్‌లలో ఎవరు ఆడాలి.. రవిశాస్త్రి సమాధానమిదీ

Hari Prasad S HT Telugu
Nov 08, 2022 02:50 PM IST

Ravishastri on Pant vs Karthik: సెమీస్‌లో పంత్‌, కార్తీక్‌లలో ఎవరు ఆడాలి? ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్‌ను వేధిస్తున్న ప్రశ్న ఇది. అయితే దీనికి రవిశాస్త్రి నేరుగా సమాధానమిచ్చాడు.

రిషబ్ పంత్
రిషబ్ పంత్ (AFP)

Ravishastri on Pant vs Karthik: టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా సెమీస్‌ చేరింది. నాలుగు విజయాలతో గ్రూప్‌ టాపర్‌గా గ్రూప్‌ 1లో రెండోస్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌తో ఫైట్‌కు సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్‌లో దినేష్‌ కార్తీక్‌ లేదా పంత్‌లలో ఎవరిని తీసుకుంటారన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. సూపర్‌ 12 స్టేజ్‌లో నాలుగు మ్యాచ్‌లలో కార్తీక్‌ ఆడినా తీవ్రంగా నిరాశపరిచాడు.

ట్రెండింగ్ వార్తలు

దీంతో జింబాబ్వేతో మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌కు ఛాన్సిచ్చారు. అయితే అతడు కూడా ఏమీ మెరుపులు మెరిపించలేదు. 5 బాల్స్‌లో 3 రన్స్‌ చేసి ఔటయ్యాడు. దీంతో ఈ ఇద్దరిలో కీలకమైన సెమీఫైనల్లో ఎవరికి ఛాన్సివ్వాలన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి స్పందిస్తూ.. కార్తీక్‌ స్థానంలో పంత్‌కే అవకాశం ఇవ్వాలని తేల్చి చెప్పడం విశేషం.

"దినేష్ ఓ మంచి టీమ్‌ ప్లేయర్‌. కానీ ఇంగ్లండ్‌ లేదా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ అంటే.. వాళ్ల బౌలింగ్‌ అటాక్‌ చూసినప్పుడు ఓ మ్యాచ్‌ విన్నర్‌, ధాటిగా ఆడగలిగే లెఫ్ట్‌ హ్యాండరే ఉండాలి" అని స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ రవిశాస్త్రి చెప్పాడు. పైగా గతంలో పంత్‌ ఇంగ్లండ్‌పై రాణించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా శాస్త్రి గుర్తు చేశాడు.

"ఇంగ్లండ్‌పై పంత్‌ బాగా ఆడాడు. ఇంగ్లండ్‌పై ఓ వన్డే మ్యాచ్‌లో ఒంటిచేత్తో గెలిపించాడు. నా వరకూ పంత్‌కే అవకాశం ఇస్తాను. ఇక్కడ ఆడాడన్న అంశం ఒక్కటే కాదు కానీ ఇంగ్లండ్‌పై అతని అవసరం ఉంది" అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అడిలైడ్‌ స్టేడియంలో స్క్వేర్‌ బౌండరీలు చిన్నగా ఉండటం కూడా ఓ లెఫ్ట్‌ హ్యాండర్‌కు కలిసొస్తుందని చెప్పాడు.

"అడిలైడ్‌లో మ్యాచ్‌ జరగబోతోంది. అక్కడ స్క్వేర్‌ బౌండరీ చిన్నగా ఉన్నాయి. ఇంగ్లండ్‌ బౌలింగ్‌ అటాక్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి అందుకే ఓ లెఫ్ట్‌ హ్యాండర్‌ అవసరం. ఎక్కువ మంది రైట్‌ హ్యాండర్లు ఉంటే ఒకేలా ఉంటుంది. ఇంగ్లండ్‌ బౌలింగ్‌ బాగుంది. లెఫ్ట్, రైట్‌ హ్యాండర్‌ బౌలర్లు ఉన్నారు. టాప్‌లో 3, 4 వికెట్లు కోల్పోయినా సరే మ్యాచ్‌ను గెలిపించగలిగే లెఫ్ట్‌ హ్యాండర్‌ ఉండాలి" అని రవిశాస్త్రి అన్నాడు.

WhatsApp channel