Sehwag Angry on Kohli: కోహ్లీని గట్టిగా అరిచిన సెహ్వాగ్.. ట్రిపుల్ సెంచరీ మిస్ అయినప్పుడు కూడా అంత కోపం రాలేదని స్పష్టం-virendra sehwag angry on virat kohli once for dropped the catch ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virendra Sehwag Angry On Virat Kohli Once For Dropped The Catch

Sehwag Angry on Kohli: కోహ్లీని గట్టిగా అరిచిన సెహ్వాగ్.. ట్రిపుల్ సెంచరీ మిస్ అయినప్పుడు కూడా అంత కోపం రాలేదని స్పష్టం

Maragani Govardhan HT Telugu
Mar 25, 2023 04:37 PM IST

Sehwag Angry on Kohli: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఓ సారి విరాట్ కోహ్లీపై కోప్పపడాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. ఓ సారి సెహ్వాగ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ జారవిడవడంతో అతడిని గట్టిగా అరిచాడట.

కోహ్లీపై కోప్పడిన సెహ్వాగ్
కోహ్లీపై కోప్పడిన సెహ్వాగ్ (AFP)

Sehwag Angry on Kohli: వీరేంద్ర సెహ్వాగ్.. తన డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాటింగ్‌తో అదరగొట్టడం గురించి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా మిలినియల్స్‌కు సెహ్వాగ్ ఆటతీరు ఎప్పటికీ ప్రత్యేకమే. ప్రత్యర్థి బౌలర్ ఎంతటి వాడైనా.. తనదైన శైలి దూకుడుతో పరుగుల వరద పారిస్తాడు. కేవలం బ్యాటింగ్‌లోనే కాదు పార్ట్ టైమ్ బౌలర్‌గా తన సామర్థ్యాన్ని పలుమార్లు నిరుపించుకున్నాడు. ఏదో బౌలింగ్ చేశామంటే చేశామని కాకుండా.. తన బౌలింగ్ ప్రతిభంతో టాప్ క్లార్ అంతర్జాతీయ బ్యాటర్ల వికెట్లను సైతం తీశాడు. ఒకసారి తన బౌలింగ్‌లో ప్రత్యర్థి ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ జారవిడిచాడట. అయితే అప్పుడే కొత్తగా జట్టులోకి అరంగేట్రం చేసిన కోహ్లీని సెహ్వాగ్ కోపంతో గట్టిగా అరిచాడట. ఈ విషయం వీరూనే స్వయంగా తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు

"నాకు మ్యాజిక్ గురించి తెలియదు. కానీ నేను నా బౌలింగ్‌లో పాంటింగ్, హెడెన్, హస్సీ, సంగక్కర, జయవర్దనే, దిల్షాన్, లారా లాంటి టాప్ బ్యాటర్లను ఔట్ చేశాను. ఓ సారి పెర్త్‌లో గిల్‌క్రిస్ట్‌ను కూడా పెవిలియన్ చేర్చాను. నా బౌలింగ్ కెరీర్‌లో ఇవి చాలా పెద్ద వికెట్లు." అని సెహ్వాగ్ అన్నాడు.

"ఓ సారి నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు. అప్పుడు చాలా బాధపడ్డాను. బహుశా బౌలింగ్‌లో నేను ఏదోక మైలురాయిని అందుకుని ఉండేవాడిని. కానీ కోహ్లీ వల్ల సాధ్యం కాలేదు. అతడిపై చాలా కోపం వచ్చింది. బహుశా ట్రిపుల్ సెంచరీ కోల్పోయినప్పుడు కూడా అంతగా కోపం రాలేదు. కమాన్ మ్యాన్.. అంటూ అతడిపై అసంతృప్తి వ్యక్తం చేశాను" అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్‌లో 104 టెస్టులు ఆడి 40 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్ల మైలురాయి కూడా ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో 104 పరుగులిచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 251 వన్డేల్లో 96 వికెట్లు తీశాడు. అత్యుత్తమంగా 6 పరుగులకే 4 వికెట్లతో అదరగొట్టాడు. 2010 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ముష్ఫీకర్ రహీమ్ సహా ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టాడు. సెహ్వాగ్ 2013లో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలికాడు.

WhatsApp channel