Virat Kohli: టీమిండియాలోకి అడుగుపెట్టి 14 ఏళ్లు.. విరాట్‌ కోహ్లి స్పెషల్‌ వీడియో-virat kohli shares a special video on his completion of 14 years in international cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virat Kohli Shares A Special Video On His Completion Of 14 Years In International Cricket

Virat Kohli: టీమిండియాలోకి అడుగుపెట్టి 14 ఏళ్లు.. విరాట్‌ కోహ్లి స్పెషల్‌ వీడియో

Hari Prasad S HT Telugu
Aug 18, 2022 11:44 AM IST

Virat Kohli: ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లి.. టీమిండియాలోకి అడుగుపెట్టి గురువారాని(ఆగస్ట్‌ 18)కి సరిగ్గా 14 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియోను అతడు షేర్‌ చేశాడు.

14 ఏళ్లలో గ్రేటెస్ట్ బ్యాటర్ గా ఎదిగిన విరాట్ కోహ్లి
14 ఏళ్లలో గ్రేటెస్ట్ బ్యాటర్ గా ఎదిగిన విరాట్ కోహ్లి (Action Images via Reuters)

న్యూఢిల్లీ: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ నుంచి రిటైరైన తర్వాత ఎవరు? ఈ ప్రశ్న సగటు భారత క్రికెట్‌ అభిమానిని ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది. అతని స్థానాన్ని భర్తీ చేసేంతటి ప్లేయర్ మళ్లీ వస్తాడా? అసలు రావడం సాధ్యమేనా అన్న చర్చలూ జరిగాయి. కానీ విరాట్‌ కోహ్లి రూపంలో ఆ లెజెండరీ క్రికెటర్‌ను మరిపించే మరో ప్లేయర్‌ టీమిండియాలోకి వచ్చాడు.

2008, ఆగస్ట్‌ 18న విరాట్‌ కోహ్లి ఇండియన్‌ టీమ్‌ తరఫున తొలి వన్డే మ్యాచ్‌ ఆడాడు. శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో విరాట్‌ ఓపెనర్‌గా వచ్చి 22 బాల్స్‌లో 12 మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయింది. తొలి రెండు, మూడేళ్లపాటు టీమ్‌లో నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడిన కోహ్లి.. ఆ తర్వాత ఒక్కసారిగా చెలరేగిపోయాడు. గడిచిన దశాబ్ద కాలంగా ఇక అతడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

2008లో అండర్‌ 19 టీమ్‌ కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌ గెలవడంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన విరాట్‌.. అదే ఏడాది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఈ 14 ఏళ్లలో ఆడిన మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్‌ ఫిగర్స్‌ నమోదు చేశాడు. కెప్టెన్‌గానూ సక్సెస్‌ అందుకున్నాడు. కొన్నాళ్లుగా ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్నా.. తిరిగి గాడిలో పడటానికి తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు.

<p>దశాబ్ద కాలంగా అన్ని ఫార్మాట్లలోనూ టాప్ బ్యాటర్ గా ఉన్న విరాట్</p>
దశాబ్ద కాలంగా అన్ని ఫార్మాట్లలోనూ టాప్ బ్యాటర్ గా ఉన్న విరాట్ (Action Images via Reuters)

తాను ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 14 ఏళ్లు అయిన సందర్భంగా గురువారం (ఆగస్ట్‌ 18) విరాట్ ఓ స్పెషల్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అందులో తాను ఇండియన్‌ టీమ్‌కు ఆడిన తొలినాళ్ల ఫొటోల నుంచి తన కెరీర్‌లోని మధుర జ్ఞాపకాలను సంబంధించినవి కూడా ఉన్నాయి. "14 ఏళ్ల కిందట ఇదంతా మొదలైంది. ఇది నాకు దక్కన గౌరవం" అని విరాట్‌ ఈ వీడియోకు క్యాప్షన్‌ ఉంచాడు.

2008,ఆగస్ట్‌ 18న తొలి వన్డే ఆడిన విరాట్.. 2010, జూన్‌లో టీ20ల్లోకి, 2011, జూన్‌లో టెస్ట్‌ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ 14 ఏళ్లలో అతడు 102 టెస్టులు, 262 వన్డేలు, 99 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 27 సెంచరీలతో 8074 రన్స్‌, వన్డేల్లో 43 సెంచరీలతో 12344 రన్స్‌, టీ20ల్లో 30 హాఫ్ సెంచరీలతో 3308 రన్స్‌ చేశాడు. ఐపీఎల్‌ తర్వాత ఇంగ్లండ్‌తో మాత్రమే ఆడిన విరాట్.. ఇప్పుడు ఆసియా కప్‌ కోసం తిరిగి వస్తున్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం