Ben Stokes: విరాట్‌ కోహ్లి.. ఓ ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా కెరీర్‌ ముగిస్తాడు: బెన్‌ స్టోక్స్‌-ben stokes says virat kohli is one of the greatest ever players to have ever played the game ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ben Stokes: విరాట్‌ కోహ్లి.. ఓ ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా కెరీర్‌ ముగిస్తాడు: బెన్‌ స్టోక్స్‌

Ben Stokes: విరాట్‌ కోహ్లి.. ఓ ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా కెరీర్‌ ముగిస్తాడు: బెన్‌ స్టోక్స్‌

Hari Prasad S HT Telugu
Jul 19, 2022 07:02 PM IST

Ben Stokes: అనూహ్యంగా వన్డేలకు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన కామెంట్‌పై స్పందించాడు. ఈ సందర్భంగా విరాట్‌పై అతడు ప్రశంసల వర్షం కురిపించాడు.

సౌతాఫ్రికాతో చివరి వన్డే ఆడుతున్న బెన్ స్టోక్స్
సౌతాఫ్రికాతో చివరి వన్డే ఆడుతున్న బెన్ స్టోక్స్ (Action Images via Reuters)

లండన్‌: ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ వన్డే క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు సోమవారం (జులై 18) ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం (జులై 19) సౌతాఫ్రికాతో తన చివరి మ్యాచ్‌లో అతడు ఆడుతున్నాడు. అయితే స్టోక్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన రిటైర్మెంట్‌ ప్రకటనపై విరాట్‌ కోహ్లి కామెంట్‌ చేశాడు. నీలాంటి పోటీతత్వం కలిగిన ప్లేయర్‌ మరొకరు లేరు అంటూ స్టోక్స్‌ను ప్రశంసించాడు కోహ్లి.

ఇప్పుడు కోహ్లి కామెంట్‌పై స్లోక్స్‌ స్పందించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌తో మాట్లాడుతూ.. కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. "విరాట్‌ అన్ని ఫార్మాట్లలోనూ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్స్‌లో ఒకడిగా తన కెరీర్‌ ముగిస్తాడు" అని స్టోక్స్‌ అనడం విశేషం. కోహ్లి పోటీతత్వాన్ని మెచ్చుకున్న స్టోక్స్‌.. అతనితో ఎప్పుడూ ఆడినా తాను ఎంజాయ్‌ చేసినట్లు చెప్పాడు.

"అతడో గొప్ప ప్లేయర్. అతనితో ఆడిన ప్రతిసారీ నేను ఎంజాయ్‌ చేశాను. ఫీల్డ్‌లో అతని నిబద్ధత, ఎనర్జీ మొదటి నుంచీ నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అలాంటి వ్యక్తులతో ఆడినప్పుడు అసలు ఆట అంటే ఏంటో తెలుస్తుంది. అతనితో ఫీల్డ్‌లో మరింత ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను" అని స్టోక్స్‌ అన్నాడు. ఇంగ్లండ్‌ 2019 వరల్డ్‌కప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్‌.. అనూహ్యంగా వన్డే ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.

మూడు ఫార్మాట్లలోనూ ఆడటం తన వల్ల కావడం లేదని స్టోక్స్‌ తన రిటైర్మెంట్‌ ప్రకటనలో చెప్పాడు. ఇంగ్లండ్‌ తరఫున అతడు 104 వన్డేలు ఆడాడు.

WhatsApp channel

సంబంధిత కథనం