Twitter blasts Dravid, KL Rahul: ఇంత చెత్త సెలక్షనా.. కుల్దీప్‌నే తీసేస్తారా.. ద్రవిడ్‌, రాహుల్‌పై ఫ్యాన్స్‌ సీరియస్‌-twitter blasts dravid and kl rahul over the decision of dropping kuldeep yadav ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Twitter Blasts Dravid, Kl Rahul: ఇంత చెత్త సెలక్షనా.. కుల్దీప్‌నే తీసేస్తారా.. ద్రవిడ్‌, రాహుల్‌పై ఫ్యాన్స్‌ సీరియస్‌

Twitter blasts Dravid, KL Rahul: ఇంత చెత్త సెలక్షనా.. కుల్దీప్‌నే తీసేస్తారా.. ద్రవిడ్‌, రాహుల్‌పై ఫ్యాన్స్‌ సీరియస్‌

Hari Prasad S HT Telugu
Dec 22, 2022 10:28 AM IST

Twitter blasts Dravid, KL Rahul: ఇంత చెత్త సెలక్షనా.. కుల్దీప్‌నే తీసేస్తారా అంటూ కోచ్‌ ద్రవిడ్‌, స్టాండిన్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై ఫ్యాన్స్‌ సీరియస్‌ అవుతున్నారు.

కుల్దీప్ యాదవ్
కుల్దీప్ యాదవ్ (AP)

Twitter blasts Dravid, KL Rahul: ఓ మ్యాచ్‌ విన్నర్‌నే పక్కన పెడతారా? ఇంత చెత్త సెలక్షనా అంటూ హెడ్‌ కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌, స్టాండిన్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు టీమిండియా అభిమానులు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌కు కుల్దీప్‌ స్థానంలో జైదేవ్‌ ఉనద్కట్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

తొలి టెస్ట్‌లో 8 వికెట్లు తీయడంతోపాటు తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసిన కుల్దీప్‌ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. పైగా 22 నెలల తర్వాత తొలిసారి ఓ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతూ ఈ స్థాయిలో ప్రదర్శన చేయడం అభిమానులను బాగా ఆకట్టుకుంది. అయితే ఒక్క మ్యాచ్‌తోనే కుల్దీప్‌తోపాటు ఫ్యాన్స్‌ ఆనందం కూడా ఆవిరైంది. అలాంటి ప్లేయర్‌ను తర్వాతి మ్యాచ్‌కే ఎలా పక్కన పెడతారు అంటూ వాళ్లు సీరియస్‌ అవుతున్నారు.

ట్విటర్‌లో కోచ్ ద్రవిడ్‌, కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌లను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. "కుల్దీప్‌ యాదవ్‌ పరిస్థితి చూడండి. తొలి మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్.. రెండో మ్యాచ్‌లో అసలు స్థానమే దక్కలేదు. ముఖ్యంగా అతడు 22 నెలల తర్వాత టీమ్‌లోకి తిరిగొచ్చిన విషయం గుర్తుంచుకోవాలి" అంటూ ఓ యూజర్‌ ట్విటర్‌లో రాశాడు.

కుల్దీప్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన జైదేవ్‌.. 12 ఏళ్ల తర్వాత టీమిండియాకు ఆడుతున్నాడు. రెండో టెస్ట్ జరుగుతున్న మీర్పూర్‌లో కూడా పిచ్‌ స్పిన్నర్లకే అనుకూలిస్తుందని తేలిన తర్వాత కూడా టీమ్ కుల్దీప్‌ను పక్కన పెట్టడం గవాస్కర్‌లాంటి మాజీలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. "ప్రతిసారీ కుల్దీప్‌కే ఇలా ఎందుకు జరుగుతుంది? కుల్దీప్‌గా ఉండటం చాలా కష్టం. ఎవరైనా అతనికి ధైర్యం చెప్పాలి" అంటూ మరో యూజర్‌ ట్వీట్‌ చేశాడు.

"పిచ్‌పై పచ్చిక అంతలా ఉందా.. ఏకంగా కుల్దీప్‌నే పక్కన పెట్టారు? వాతావరణం మేఘావృతమైన మాట నిజమే కానీ.. కుల్దీప్‌ స్థానంలో జైదేవ్‌ సరైన ఎంపికేనా" అని మరో యూజర్‌ ప్రశ్నించాడు. "ఓ మ్యాచ్‌ విన్నర్‌నే పక్కన పెడతారా? ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు?" అని ఇంకో యూజర్‌ విమర్శించాడు. ఇక మరో అభిమాని అయితే.. విరాట్‌, రవిశాస్త్రే కుల్దీప్‌ కెరీర్‌ను నాశనం చేశారని మండిపడ్డాడు.

WhatsApp channel