Team India Dressing Room Celebrations: టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ అందరి ఆటగాళ్లలా కాకుండా తన ఆటతీరుతోనే కాకుండా.. నడుచుకునే విధానం కూడా విభిన్నంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే మన గబ్బర్ వీలు చిక్కినప్పుడల్లా.. తన డ్యాన్స్ వీడియోలు, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. ఈ ఏడాది వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ధావన్.. ఆ విజయానంతరం డ్రెస్సింగ్ రూంలో తన సహచరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నాడు. తన ఆనందంలో అందర్నీ భాగం చేస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన మూడో వన్డేలో విజయంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్ గెలిచింది. ఆ విజయానందంలో తనదైన తరహాలో సంబురాలు చేసుకున్నాడు ధావన్. టీమ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.,ఈ వీడియోను గమనిస్తే.. ఇందులో శిఖర్ ధావన్ తన సహచర ఆటగాళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. 90వ దశకం చివర్లో ఎంతో పాపులరైన దేలర్ మెహందీ ఆలపించిన బోలో తారా..రా..రా అనే పంజాబీ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేశారు. జట్టంతా కలిసి ఆ పాటకు డ్యాన్స్ వేస్తుంటే చూసేందుకు చాలా బాగుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.,ఈ వీడియోపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే 7 లక్షల 55 వేల మందికిపై లైక్ చేశారు. సంజూ శాంసన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, రాజస్థాన్ రాయల్స్ తదితర ప్రముఖులు ఈ వీడియోను లైక్ చేశారు. ఇంకా ఈ వీడియోకు వ్యూస్‌తో పాటు లైకుల వర్షం కురుస్తోంది.,చివరి వన్డేలో విజయం సాధించిన ధావన్ సేన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. 100 రన్స్ స్వల్ప లక్ష్యాన్ని ఇండియా 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. అంతకుముందు సిరీస్‌ను నిర్ణయించే కీలకమైన మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్ 27.1 ఓవర్లలో కేవలం 99 రన్స్‌కు ఆలౌటైంది. వన్డేల్లో ఇండియాపై సౌతాఫ్రికాకు ఇదే అతి తక్కువ స్కోరు కావడం విశేషం. టీమిండియా బౌలర్లు కుల్దీప్ 4 వికెట్లతో విజృంభించగా.. సుందర్, సిరాజ్, షాబాజ్ తలో రెండు వికెట్లు తీశారు.,,