Telugu News  /  Sports  /  Rahul Dravid Funny Interview With Surya Kumar Yadav Video Goes Viral
రాహుల్ ద్రావిడ్(ఫైల్ ఫొటో)
రాహుల్ ద్రావిడ్(ఫైల్ ఫొటో) (PTI)

Dravid On Surya Kumar : నా ఆట చూసి ఉండవు.. సూర్యపై ద్రావిడ్ జోకులు

09 January 2023, 11:11 ISTAnand Sai
09 January 2023, 11:11 IST

IND Vs SL : సూర్యకుమార్ యాదవ్‌పై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెగ జోకులు వేశాడు. కాసేపు ఫన్నీగా మాట్లాడాడు.

శ్రీలంకపై సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav) సూపర్ సెంచరీతో చెలరేగాడు. అతడితో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) కాసేపు ముచ్చటించాడు. సూర్య కుమార్ టీ20ల్లో మూడు సెంచరీలు చేశాడు. వీటిని ద్రావిడ్ గుర్తు చేశాడు. సూర్య తనకు కొత్త ఇన్నింగ్స్ చూపిస్తూనే వచ్చాడని ద్రావిడ్ అన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

'నువ్వు చిన్నప్పుడు నేను ఆడటం చూసి ఉండవు. కచ్చితంగా చూసి ఉండవు. లేదంటే ఇలా ఆడవు.' అని సూర్యకుమార్ యాదవ్ తో ద్రావిడ్ అన్నాడు. ఈ మాట వినగానే.. సూర్య నవ్వేశాడు. ది వాల్ అని ఇండియన్ క్రికెట్ లో ద్రావిడ్ కు పేరు. డిఫెన్స్ మీదనే ద్రావిడ్ ఫోకస్ ఎక్కువగా ఉండేది. సూర్య కుమర్ తనదైన శైలితో నలుమూలలా షాట్లు ఆడుతుంటాడు. ఈ ఈ క్రమంలో తన డిఫెన్స్ ఆట చూసి ఉండడని ద్రావిడ్(Dravid) అన్నాడు. అయితే దీనిపై సూర్య నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. చిన్నతనంలో మీ ఆట చూస్తూనే పెరిగానని సూర్య చెప్పుకొచ్చాడు.

' సూర్య అద్భుతమైన ఫామ్‌లో ఉన్నావ్. ఇంతకంటే.. గొప్ప టీ20 ఇన్నింగ్స్ చూడలేను అనుకున్న ప్రతిసారీ ఓ కొత్త ఇన్నింగ్స్ చూపిస్తూన్నావ్.' అని ద్రావిడ్ ప్రశంసించాడు.

ఇప్పటి వరకు సాధించిన మూడు టీ20 సెంచరీల్లో బెస్ట్ ఏదని ద్రావిడ్ క్వశ్చన్ చేశాడు. దీనికి సూర్య సమాధానం ఇస్తూ.. పరిస్థితి కష్టంగా ఉన్నప్పుడు ఆడటాన్ని బాగా ఎంజాయ్ చేశా. ఏదో ఒక ఇన్నింగ్స్‌ను ఎంపిక చేయడం కుదరదు. నా ఆటను ఎంజాయ్ చేశాను. కిందటి ఏడాది ఏం చేశానో.. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. కష్టమైన పరిస్థితుల్లో వాళ్లపై ఎదురుదాడికి దిగడం నాకు ఇష్టం.. అని సూర్య అన్నాడు.

జనవరి 7న శ్రీలంకతో జరిగిన మూడో టీ20(T20)లో సూర్యకుమార్ అద్భుతమైన సెంచరీతో రాణించాడు. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్ 51 బంతుల్లో 220 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 112 పరుగులు చేశాడు. భారత్ 5 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రీలంక జట్టు(Sri Lanka Team) కేవలం 137 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుత ప్రదర్శన చేసిన సూర్యకుమార్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.