Kapil Dev on Suryakumar: సూర్యలాంటి ప్లేయర్ శతాబ్దానికి ఒక్కడే ఉంటాడు: కపిల్ దేవ్
Kapil Dev on Suryakumar: సూర్యలాంటి ప్లేయర్ శతాబ్దానికి ఒక్కడే ఉంటాడంటూ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అనడం విశేషం. సచిన్, రిచర్డ్స్, కోహ్లిలాంటి ప్లేయర్స్‌ను తాను చూశాను కానీ.. సూర్యలాంటి ప్లేయర్‌ను చూడలేదని అన్నాడు.
Kapil Dev on Suryakumar: క్రికెట్‌లో ఓ ప్లేయర్‌ను సచిన్ టెండూల్కర్ లేదా వివ్ రిచర్డ్స్ లేదా విరాట్ కోహ్లిలాంటి ప్లేయర్‌తో పోలిస్తే అంతకుమించిన పొగడ్త మరొకటి ఉండదు. క్రికెట్‌లో వీళ్లు సృష్టించిన రికార్డులు అలాంటివి. ఇప్పుడు వీళ్లందరినీ మరిపిస్తూ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డ్‌లో సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. శ్రీలంకతో మూడో టీ20లో సూర్య ఆడిన తీరు చూసి మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అతన్ని ఆకాశానికెత్తాడు.
ట్రెండింగ్ వార్తలు
కేవలం 51 బాల్స్‌లోనే 112 రన్స్ బాదాడు సూర్యకుమార్. దీంతో చివరి మ్యాచ్‌లో లంకను 91 రన్స్‌తో చిత్తు చేసి మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో గెలిచింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో సూర్య ఆడిన తీరుపై ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ కపిల్ దేవ్ స్పందించాడు.
"అతడు ఆడిన ఈ ఇన్నింగ్స్‌ను ఎలా వర్ణించాలో నాకు తెలియడం లేదు. సచిన్, రోహిత్, విరాట్ లాంటి ప్లేయర్స్‌ను చూసినపుడు ఏదో ఒక రోజు ఆ లిస్ట్‌లో చేరే ఓ ప్లేయర్ వస్తాడని అనిపిస్తుంది. ఇండియాలో నిజంగానే అలాంటి ఎంతో నైపుణ్యం ఉంది. సూర్య ఫైన్ లెగ్ మీదుగా ఆడిన ల్యాప షాట్ ఎలాంటి బౌలర్‌నైనా భయపెడుతుంది. అతడు క్రీజులో నిల్చొని మిడాన్, మిడాఫ్‌ల మీదుగా సిక్స్‌లు బాదగలడు" అని కపిల్ చెప్పాడు.
"ఆ ఆటే బౌలర్లకు కష్టాలు తెచ్చి పెడుతుంది. అతడు లైన్ అండ్ లెంత్‌ను నిలకడగా అంచనా వేయగలుగుతున్నాడు. నేను డివిలియర్స్, రిచర్డ్స్, సచిన్, విరాట్, పాంటింగ్‌లాంటి ప్లేయర్స్‌ను చూశాను. కానీ సూర్యలాగా చాలా కొద్ది మంది మాత్రమే అలా క్లీన్ షాట్స్ ఆడగలరు. సూర్యకు హ్యాట్సాఫ్. ఇలాంటి ప్లేయర్స్ శతాబ్దానికి ఒకసారి మాత్రమే వస్తారు" అని కపిల్ అతన్ని ఆకాశానికెత్తాడు.
ప్రస్తుతం ఇండియన్ క్రికెట్‌లో రోహిత్, కోహ్లి తర్వాత ఆ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ప్లేయర్ సూర్యనే. 2021లో తాను తొలిసారి ఇండియన్ క్రికెట్‌కు ఆడటం ప్రారంభించినప్పటి నుంచీ అతడో అద్భుతమైన బ్యాటర్‌గా ఎదిగాడు. సచిన్ 1998లో, విరాట్ 2016లో ఏ స్థాయి ఫామ్‌లో ఉన్నారో 2022లో సూర్య కూడా అదే ఫామ్‌లో ఉన్నాడు.