Surya Kumar Yadav Records: శ్రీలంకపై సెంచరీతో సూర్య కుమార్ బ్రేక్ చేసిన రికార్డులు ఇవే
Surya Kumar Yadav Records: శనివారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన టీమ్ ఇండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఆ రికార్డులు ఏవంటే...
Surya Kumar Yadav Records: శనివారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు సూర్యకుమార్ యాదవ్. 51 బాల్స్‌లో తొమ్మిది సిక్సర్లు, ఏడు ఫోర్లతో 112 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో ఇరవై ఓవర్లలో టీమ్ ఇండియా 228 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో తడబడిన శ్రీలంక 137 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ విజయంతో 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను టీమ్ ఇండియా కైవసం చేసుకున్నది. ఈ మ్యాచ్ ద్వారా టీ20 క్రికెట్‌లో పలు రికార్డులను తిరగరాశాడు సూర్యకుమార్. టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన రెండో క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.
ఈ జాబితాలో రోహిత్ శర్మ నాలుగు సెంచరీలతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. రెండు సెంచరీలతో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో ఉన్నాడు. అంతే కాకుండా టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా సూర్య కుమార్ యాదవ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
గతంలో శ్రీలంకపై 35 బాల్స్‌లోనే రోహిత్ శర్మ సెంచరీ చేయగా శనివారం మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 45 బాల్స్‌లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ జాబితాలో కె.ఎల్ రాహుల్ మూడో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌పై 46 బాల్స్‌లో సెంచరీ చేశాడు రాహుల్.
అలాగే అంతర్జాతీయ టీ20ల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో ప్లేయర్‌గా కె.ఎల్ రాహుల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ లిస్ట్‌లో నాలుగు సెంచరీలతో రోహిత్ శర్మ తొలి ప్లేస్‌లో నిలచాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్, కొలిన్ మున్రో, సబావూన్ డావిజీతో కలిసి మూడు సెంచరీలతో సూర్యకుమార్ యాదవ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు