WTC 2023 Final: రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్.. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో మార్పులు-yashasvi jaiswal replaces ruturaj gaikwad as stand by player for wtc final ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc 2023 Final: రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్.. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో మార్పులు

WTC 2023 Final: రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్.. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో మార్పులు

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 06:46 PM IST

WTC 2023 Final: రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అతడి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

రుతురాజ్ గైక్వాడ్
రుతురాజ్ గైక్వాడ్ (PTI)

WTC 2023 Final: ఐపీఎల్ 2023 సీజన్ ముగింపునకు వచ్చింది. ఇప్పుడు ఈ టోర్నీ తర్వాత అందరి కళ్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌పైనే ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరగనున్న ఈ మ్యాచ్‌లో సగటు క్రికెట్ ప్రేక్షకులకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. పాట్ కమిన్స్ నేతృత్వంలోనే ఆస్ట్రేలియాతో పోటీ పడనుంది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 7న లండన్ ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరుజట్లను ప్రకటించారు. అయితే టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఎంచుకున్నారు. ఫలితంగా భారత టెస్టు జట్టులో అతడు కీలకం కానున్నాడు.

అతడితో పాటు ఐపీఎల్ స్టార్స్ రుతురాజ్ గైక్వాడ్, ముకేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లను స్టాండ్‌బై ప్లేయర్లుగా తీసుకున్నారు. తాజా రిపోర్టుల ప్రకారం రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మరొకరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌ను రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంచుకున్నట్లు సమాచారం.

ఎందుకంటే గైక్వాడ్‌కు జూన్ 3న వివాహం జరగబోతుంది. ఈ కారణంగా అతడు భారత జట్టుతో జూన్ 5 తర్వాతే కలవనున్నాడు. దీంతో అతడి స్థానంలో యశస్వీకి అవకాశం కల్పించారు సెలక్టర్లు. స్టాండ్ బై ప్లేయర్స్ లిస్టులో జైస్వాల్‌ను ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడనున్నాడు. రాజస్థాన్ ఓపెనర్‌కు వీసా ఉన్నందున అతడు వచ్చే వారం లండన్‌కు బయలుదేరే అవకాశముంది.

యశస్వీ జైస్వాల్ ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ఫామ్‌తో ఆకట్టుకున్నాడు. అతడు 14 ఇన్నింగ్స్‌ల్లో 625 పరుగులు చేశాడు. మొత్తంగా 37 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1172 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో యశస్వి జైస్వాల్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 15 మ్యాచ్‌ల్లో 80.21 సగటుతో 1845 పరుగులు చేశాడు. ఇందులో 9 శతకాలు రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

సంబంధిత కథనం

టాపిక్