Pathan on Dhoni: ఒకప్పుడు చిరుతలా పరుగెత్తేవాడు.. కానీ ఇప్పుడిలా: ధోనీని చూసి బాధపడుతున్న పఠాన్-pathan on dhoni says his heart is breaking when he is limping ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pathan On Dhoni: ఒకప్పుడు చిరుతలా పరుగెత్తేవాడు.. కానీ ఇప్పుడిలా: ధోనీని చూసి బాధపడుతున్న పఠాన్

Pathan on Dhoni: ఒకప్పుడు చిరుతలా పరుగెత్తేవాడు.. కానీ ఇప్పుడిలా: ధోనీని చూసి బాధపడుతున్న పఠాన్

Hari Prasad S HT Telugu
May 11, 2023 03:00 PM IST

Pathan on Dhoni: ఒకప్పుడు చిరుతలా పరుగెత్తేవాడు.. కానీ ఇప్పుడిలా అంటూ ధోనీని చూసి బాధపడుతున్నాడు ఇర్ఫాన్ పఠాన్. డీసీతో మ్యాచ్ లో ధోనీ పరుగెత్తడానికి ఇబ్బందిపడటం చూసి అతడీ కామెంట్స్ చేశాడు.

మోకాలి గాయంతో బాధపడుతున్న ధోనీ
మోకాలి గాయంతో బాధపడుతున్న ధోనీ (AFP)

Pathan on Dhoni: సీఎస్కే కెప్టెన్ ఎమ్మెస్ ధోనీపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బుధవారం (మే 10) డీసీతో మ్యాచ్ లో ధోనీ వికెట్ల మధ్య పరుగెత్తడానికి ఇబ్బంది పడటం చూసి అతడీ కామెంట్స్ చేశాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న ధోనీ.. పరుగెత్తడానికి ఇబ్బంది పడుతున్నాడు. డీసీతో మ్యాచ్ లోనూ అతని పరిస్థితి ఇలాగే ఉంది.

అది చూసిన పఠాన్.. మ్యాచ్ తర్వాత ట్వీట్ చేశాడు. "ధోనీ ఇలా వికెట్ల మధ్య పరుగెత్తడానికి ఇబ్బంది పడుతుంటే చాలా బాధగా ఉంది. వికెట్ల మధ్య చిరుతలాగా పరుగెత్తేవాడు" అని పఠాన్ ట్వీట్ చేయడం విశేషం. ఈ మ్యాచ్ లో చివర్లో బ్యాటింగ్ కు దిగిన ధోనీ కేవలం 9 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. రెండు సిక్సర్లు కూడా బాదడం విశేషం.

అయితే తన పనే సిక్స్ లు బాదడం అని, వికెట్ల మధ్య ఎక్కువగా పరుగెత్తకుండా చూడాలని తాను అవతలి వైపు బ్యాటర్లను కోరినట్లు మ్యాచ్ తర్వాత ధోనీ కూడా చెప్పాడు. 126 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి సీఎస్కే చిక్కుల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చాడు ధోనీ. అతన్ని చూడగానే స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా పెద్దగా అరిచారు.

వాళ్లను మిస్టర్ కూల్ నిరాశపరచలేదు. ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్లో రెండు సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టిన ధోనీ 9 బంతుల్లోనే 20 రన్స్ చేశాడు. అయితే అతడు వికెట్ల మధ్య పరుగెత్తడానికి మాత్రం అంగీకరించలేదు. అంతకుముందు సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్ కూడా ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. ఈ సీజన్ లో ధోనీ ఎప్పుడూ బ్యాటింగ్ ఆర్డర్లో పైకి రావడానికి కూడా ప్రయత్నించలేదు.

చివర్లో క్రీజులోకి వచ్చి ఇన్నింగ్స్ ను గొప్పగా ముగించాలని చూశాడు. డీసీతో మ్యాచ్ లోనూ ధోనీ ఇన్నింగ్సే సీఎస్కేను గెలిపించిందని చెప్పాలి. అతడు మెరుపు వేగంతో చేసిన పరుగులే ఆ జట్టుకు మంచి స్కోరు అందించాయి. తన పని కూడా ఇలా మ్యాచ్ లను ముగించడమే అని మ్యాచ్ తర్వాత ధోనీ స్పష్టం చేశాడు.

WhatsApp channel

సంబంధిత కథనం