OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రానున్న చిత్రాలు, సిరీస్‌లు.. హిట్ సినిమాలు వచ్చేస్తున్నాయి-here the some interesting movies and series will release in theater and otts
Telugu News  /  Entertainment  /  Here The Some Interesting Movies And Series Will Release In Theater And Otts
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రానున్న చిత్రాలు, సిరీస్‌లు.. హిట్ సినిమాలు వచ్చేస్తున్నాయి

14 March 2023, 11:33 ISTMaragani Govardhan
14 March 2023, 11:33 IST

OTT Releases This Week: ఈ వారం కొన్ని విజయవంతమైన చిత్రాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. అలాగే కొన్ని ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయబోతున్నాయి. ఉపేంద్ర పాన్ ఇండియా చిత్రం థియేటర్లలో ఈ వారమే సందడి చేయనుంది.

OTT Releases This Week: ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా కొన్ని చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ముఖ్యంగా గత నెలలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలు ఈ వారం డిజిటల్ వేదికల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ధనుష్ హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్, రైటర్ పద్మభూషణ్ లంటి సినిమాలు ఈ సారి ఓటీటీలో అలరించనున్నాయి. అవి కాకుండా కొన్ని వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. వీటితో పాటు థియేటర్లలోనూ కొన్ని సినిమాలు సందడి చేయనున్నాయి.

థియేటర్లలో విడుదలకానున్న చిత్రాలు..

కబ్జ..

ఈ వారం విడుదల కానున్న పాన్ ఇండియా చిత్రం కబ్జ. కన్నడ స్టార్లు, ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ కలిసి నటించిన ఈ సినిమా మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1942 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ఆర్ చంద్రు దర్శకత్వం వహించారు. కన్నడ, తెలుగుతో పాటు మరో ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో ఉపేంద్రకు జోడీగా శ్రియ (shriya) హీరోయిన్ గా నటించింది.

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి..

ప్రముఖ నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. నాగ శౌర్య, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మార్చి 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించాయి. వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. కల్యాణి మాలిక్ సంగీతాన్ని సమకూర్చారు.

ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు/సిరీస్‌లు..

సార్..

ధనుష్ కీలక పాత్రలో నటించిన సార్ చిత్రం గత నెల 17న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

రైటర్ పద్మభూషణ్..

కలర్ ఫొటో సినిమాతో అలరించిన సుహాస్ హీరోగా, టీనా శిల్పరాజ్ హీరోయిన్‌గా నటించిన చిత్రం రైటర్ పద్మభూషణ్. గత నెల 3న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది. ప్రముఖ ఓటీటీ వేది జీ5లో ఈ నెల 17 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు..

మనీషాట్- మార్చి 15న విడుదల

కుత్తే (హిందీ చిత్రం)- మార్చి 16

షాడో అండ్ బోన్(వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 16

మేస్ట్రో(వెబ్ సిరీస్)- మార్చి 17

ఇన్ హిజ్ షాడో మార్చి(సినిమా)- మార్చి 17

ది మెజిషియన్ ఎలిఫెంట్(సినిమా)- మార్చి 17

అమెజాన్ ప్రైమ్ వీడియో..

బ్లాక్ ఆడమ్(ఇంగ్లీష్)- మార్చి 15

డోమ్ (వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 17

జీ5..

లాక్(తమిళం)- మార్చి 17

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..

పాప్ కౌన్(హిందీ సిరీస్)- మార్చి 17

సోనీ లివ్..

రాకెట్ బాయ్స్(హిందీ సిరీస్ 2)- మార్చి 16

ఆహా..

సత్తిగాని రెండెకరాలు(తెలుగు)- మార్చి 17

లాక్డ్ (వెబ్ సిరీస్ సీజన్ 2)- మార్చి 17.