Ganguly on Shubman Gill: శుభ్‌మన్ గిల్ జట్టులో పర్మనెంట్ ప్లేయర్: సౌరవ్ గంగూలీ-ganguly on shubman gill says he is a permanent player now in team india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ganguly On Shubman Gill: శుభ్‌మన్ గిల్ జట్టులో పర్మనెంట్ ప్లేయర్: సౌరవ్ గంగూలీ

Ganguly on Shubman Gill: శుభ్‌మన్ గిల్ జట్టులో పర్మనెంట్ ప్లేయర్: సౌరవ్ గంగూలీ

Hari Prasad S HT Telugu
Mar 15, 2023 08:02 PM IST

Ganguly on Shubman Gill: శుభ్‌మన్ గిల్ జట్టులో పర్మనెంట్ ప్లేయర్ గా మారిపోయాడని అన్నాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. రెవ్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ దాదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సౌరవ్ గంగూలీ
సౌరవ్ గంగూలీ (PTI)

Ganguly on Shubman Gill: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఇక అతడు జట్టులో పర్మనెంట్ ప్లేయర్ అయిపోయాడని అనడం విశేషం. అంతేకాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఇండియా గెలుస్తుందని కూడా దాదా అంచనా వేశాడు. రెవ్ స్పోర్ట్స్ తో మాట్లాడిన గంగూలీ.. విదేశాల్లో అశ్విన్, జడేజా, అక్షర్ లను ఆడించడం కుదరదు కానీ.. వాళ్లది చాలా మంది కాంబినేషన్ అని అన్నాడు.

టీమ్ వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్.. ఫామ్ లో లేకపోవడంతో టీమ్ లోనూ చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అతని స్థానంలో మూడు ఫార్మాట్లలోనూ శుభ్‌మన్ గిల్ రాణిస్తున్నాడు. ప్రస్తుతం గిల్ లేని టీమిండియాను ఊహించుకోలేం. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులోనూ గిల్ సెంచరీ చేశాడు. దీంతో అతనిపై గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు.

"ఆస్ట్రేలియాను ఓడించినందుకు ఇండియాకు శుభాకాంక్షలు. ఆస్ట్రేలియాలో ఇండియా గెలిచింది. ఇంగ్లండ్ లోనూ గెలిచింది. అందువల్ల ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలవకపోవడానికి కారణం కనిపించడం లేదు. బ్యాటింగ్ బాగా చేయండి. 350, 400 స్కోరు చేయండి. అప్పుడే గెలిచే స్థితిలో ఉంటారు. గిల్ తన స్థానాన్ని నిలుపుకుంటాడు. గత ఆరేడు నెలలుగా గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు చేయాల్సింది ఇంకేముంది? అతడు ఇప్పుడు పర్మనెంట్ ప్లేయర్" అని గంగూలీ స్పష్టం చేశాడు.

ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సంయుక్తంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన అశ్విన్, జడేజాలనూ గంగూలీ ఆకాశానికెత్తాడు. "అశ్విన్, జడేజా చాలా బాగా ఆడుతున్నారు. అక్షర్ పటేల్ గురించి కూడా మాట్లాడాలి. లోయర్ ఆర్డర్ లో అతడు బ్యాట్ తో సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నాడు. బౌలింగ్ అవకాశం వచ్చినప్పుడల్లా బాగానే చేస్తున్నాడు. అశ్విన్, జడేజా, అక్షర్ లు ఉండటమే ఇండియా బలం. విదేశాల్లో ముగ్గురినీ ఆడించటం కుదరదని తెలుసు. కానీ వాళ్లలో మంచి సత్తా ఉంది అని గంగూలీ అన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్