Ganguly on Australia: ఇదేమీ స్టీవ్ వా టీమ్ కాదు.. ఈ ఆస్ట్రేలియాకు అంత సీన్ లేదు: గంగూలీ-ganguly on australia says its not steve waughs team ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ganguly On Australia Says Its Not Steve Waughs Team

Ganguly on Australia: ఇదేమీ స్టీవ్ వా టీమ్ కాదు.. ఈ ఆస్ట్రేలియాకు అంత సీన్ లేదు: గంగూలీ

Hari Prasad S HT Telugu
Feb 27, 2023 03:01 PM IST

Ganguly on Australia: ఇదేమీ స్టీవ్ వా టీమ్ కాదు.. ఈ ఆస్ట్రేలియాకు అంత సీన్ లేదని అన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ప్రస్తుత టీమ్ లో స్మిత్, వార్నర్, లబుషేన్ లాంటి వాళ్లు ఉన్నా.. ఇండియన్ కండిషన్స్ లో ఆడటం వాళ్లకు అంత తేలిక కాదని స్పష్టం చేశాడు.

ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్
ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ (ANI )

Ganguly on Australia: ఆస్ట్రేలియా మెన్స్ ఒకప్పుడు దశాబ్దాల పాటు క్రికెట్ ను ఏలింది. ఇండియాలోనూ తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు కూడా బలమైన జట్లలో ఒకటిగా ఉన్నా.. ఇండియాలో మాత్రం ఆ టీమ్ పప్పులు ఉడకటం లేదు. సుమారు 19 ఏళ్లుగా ఇండియాకు వచ్చి ఉత్త చేతులతోనూ వెనుదిరుగుతోంది. ఈసారి కూడా వాళ్ల చేతికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చిక్కలేదు.

ట్రెండింగ్ వార్తలు

తొలి రెండు టెస్టులను మూడు రోజుల్లోపే ముగించిన టీమిండియా 2-0తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్, 2001లో ఆస్ట్రేలియాపై చారిత్రక సిరీస్ విజయం సాధించిన సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియాను ఇండియాలో ఓడించడం దాదాపు అసాధ్యమని, అయినా ఇదే స్టీవ్ వా టీమ్ కాదని అనడం గమనార్హం.

"ఇండియాలో ఇండియా పూర్తిగా భిన్నమైన టీమ్. ప్రపంచంలో ఎక్కడైనా ఇండియా మంచి టీమే అయినా.. స్వదేశంలో మాత్రం వాళ్లను ఓడించడం చాలా కష్టం. బంతి కాస్త స్పిన్ అయితే చాలు ఏ టీమ్ కంటే కూడా ఇండియా గొప్ప టీమ్ అవుతుంది" అని గంగూలీ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్ అయిన దాదా.. ఆ టీమ్ ప్రత్యేకమైన క్యాంప్ ప్రారంభం సందర్భంగా మాట్లాడాడు.

4-0తో గెలవడం సాధ్యమే..

ఆస్ట్రేలియాను ఇండియా 4-0తో ఓడించడం సాధ్యమే అని ఈ సందర్భంగా గంగూలీ అన్నాడు. "ఇండియా 4-0తో గెలుస్తుందని అనుకుంటున్నా. ఆస్ట్రేలియా దీనిని ఎలా అడ్డుకుంటుందో నాకు తెలియదు. ఇక్కడ సమస్య ఏంటంటే.. ఈ ఆస్ట్రేలియా టీమ్ ను గతంలోని జట్లతో పోలుస్తున్నాం. కానీ ఈ టీమ్ అలా లేదు.

మాథ్యూ హేడెన్, జస్టిన్ లాంగర్, రిక్కీ పాంటింగ్, స్టీవ్ వా, మార్క్ వా, గిల్‌క్రిస్ట్ లాంటి వాళ్లు లేరు. ఆ క్వాలిటీ ఇప్పటి టీమ్ లో లేదు. స్టీవ్ స్మిత్ గొప్ప ప్లేయరే. వార్నర్ సరిగా ఆడటం లేదు. లబుషేన్ మంచి ప్లేయరే అయినా ఈ కండిషన్స్ లో కష్టం. ఇది స్టీవ్ వా ఆస్ట్రేలియా టీమ్ అనుకోవడమే మనం చేస్తున్న తప్పు" అని గంగూలీ స్పష్టం చేశాడు.

ఇక ఫామ్ లో లేని కేఎల్ రాహుల్ గురించి కూడా దాదా స్పందించాడు. ఇండియన్ టీమ్ కు ఆడినప్పుడు పరుగులు చేయలేకపోతే పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పాడు. రాహుల్ గత పది టెస్ట్ ఇన్నింగ్స్ లో 25 రన్స్ మార్క్ కూడా దాటలేకపోయిన విషయం తెలిసిందే.

WhatsApp channel

సంబంధిత కథనం