Dinesh Karthik About Rishabh Pant: టీమిండియాలో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎంత మంది ఉన్నప్పటికీ సరైన ప్రణాళికలు లేక, జట్టు కూర్పు లాంటి సమస్యలతో గత కొన్ని రోజులుగా సతమతమవుతోంది. ఇందుకు ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ వైఫల్యాలే ఉదాహరణ. ఫినిషర్ దినేశ్ కార్తిక్, రిషబ్ పంత్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పంత్ కంటే కూడా దినేశ్ కార్తీక్‌కే తన ఓటు వేస్తున్నాడు. ఫలితంగా పంత్‌కు పెద్దగా ఆవకాశాలు రావడం లేదు. టీ20 ప్రపంచకప్‌లో చివరి రెండు మ్యాచ్‌లు మినహా మిగిలిన గేముల్లో తీసుకోలేదు. కార్తిక్ ఫినిషర్‌గా వస్తుండటంతో పంత్ ఏ పొజిషన్‌లో ఆడించాలో కూడా తెలియడం లేదు. తాజాగా ఈ అంశంపై దినేశ్ కార్తిక్ స్పందించాడు. రిషబ్ పంత్ టాపార్డర్‌లో రావడం వల్ల బెనిఫిట్ ఉంటుందని స్పష్టం చేశాడు.,"భారీ షాట్లు ఆడటంలో పంత్ సామర్థ్యం గురించి అందరికీ తెలుసు, ఫీల్డర్లు ఇన్నర్ సర్కిల్‌లో ఉన్నప్పుడు పవర్ ప్లేలో పంత్ లాంటి ఆటగాడు ఉండాలి. కాబట్టి అతడిని టాపార్డర్‌లో పంపిస్తే మెరుగ్గా రాణిస్తాడు. టెస్టు క్రికెట్‌లో ఇప్పటికే రిషబ్ పంత్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అలాగే వన్డేల్లోనూ స్థిరంగా రాణిస్తున్నాడు. టీ20ల వద్దకు వచ్చేసరికి విభిన్న స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. టీమిండియా అతడు ఏ స్థానంలో బాగా ఆడతాడో గుర్తించి ఆ పొజిషన్‌లో పంపాలి." అని దినేశ్ కార్తిక్ తెలిపాడు.,పంత్ స్ట్రోక్ ప్లేను కార్తిక్ కొనియాడాడు. అతడి దూకుడు స్వభావం కారణంగా వైఫల్యాలను ఎదుర్కొంటున్నాడని చెప్పాడు.,"అతడు ఆడటం మొదలుపెట్టినప్పుడు స్ట్రైక్ రేట్ అధికంగా ఉంటుంది. ఫీల్డ్ అప్‌ను అతడు ఇష్టపడతాడు. బౌలర్లను ఎదుర్కోవడం, వారిని ఒత్తిడిలో నెట్టడాన్ని ఎంజాయ్ చేస్తాడు. స్ట్రోక్ ప్లే విషయానికొస్తే అతడకతడే సాటి. చాలా మంది అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఫలితంగా కొన్నిసార్లు వైఫల్యాలను చూశాడు. కానీ అతడి ఆటతీరు మాత్రం అద్భుతం." అని దినేశ్ కార్తిక్ తెలిపాడు.,ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఈ టూర్‌లో భారత్ కివీస్‌తో 3 టీ2ల సిరీస్ సహా.. మూడు వన్డేల సిరీస్ కూడా ఆడుతుంది. టీ20లకు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలి టీ20 శుక్రవారం జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా రద్దయింది. రెండో టీ20 ఆదివారం నాడు జరగనుంది. టీ20 సిరీస్ తర్వాత వన్డే సిరీస్ ఆడనుంది భారత్. ఈ జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.,