Australia New Jersey: టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త జెర్సీలో ఆస్ట్రేలియా.. ఎలా ఉందో చూడండి-australia new jersey with indigenous theme ahead of t20 world cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Australia New Jersey: టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త జెర్సీలో ఆస్ట్రేలియా.. ఎలా ఉందో చూడండి

Australia New Jersey: టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త జెర్సీలో ఆస్ట్రేలియా.. ఎలా ఉందో చూడండి

Hari Prasad S HT Telugu
Sep 14, 2022 03:07 PM IST

Australia New Jersey: టీ20 వరల్డ్‌కప్‌ కోసం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా కొత్త జెర్సీల్లో బరిలోకి దిగుతోంది. ఈ జెర్సీలను బుధవారం (సెప్టెంబర్‌ 14) అక్కడి క్రికెట్‌ బోర్డు లాంచ్‌ చేసింది.

గతేడాది టీ20 వరల్డ్ కప్ ను తొలిసారి గెలిచిన ఆస్ట్రేలియా
గతేడాది టీ20 వరల్డ్ కప్ ను తొలిసారి గెలిచిన ఆస్ట్రేలియా (Getty Images)

Australia New Jersey: టీ20 వరల్డ్‌కప్‌ దగ్గర పడుతుండటంతో అన్ని బోర్డులు టీమ్స్‌ను ప్రకటించడంతోపాటు కొత్త జెర్సీలను కూడా లాంచ్‌ చేసే పనిలో ఉన్నాయి. ఇందులో ఆస్ట్రేలియా అందరి కంటే ముందు ఉంటోంది. ఈసారి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న ఆస్ట్రేలియా అందరి కంటే ముందే టీమ్‌ను ప్రకటించింది. ఇక ఇప్పుడు తమ కొత్త జెర్సీని కూడా లాంచ్‌ చేసింది.

గతేడాది తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఈసారి డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతోంది. అందుకే ఈసారి పూర్తి స్వదేశీ థీమ్‌ కిట్‌తో ఆసీస్‌ అలరించబోతోంది. అంతేకాదు తొలిసారి ఓ గ్లోబల్‌ క్రికెట్‌ ఈవెంట్‌లో అసలైన ఆస్ట్రేలియన్లకు ప్రతిరూపంగా ఈ కొత్త జెర్సీలు ఉండబోతున్నాయని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఆస్ట్రేలియా సాంప్రదాయ ఎల్లో కలర్‌ జెర్సీకే నల్లని స్లీవ్స్‌తోపాటు జెర్సీ ముందు భాగంలో ఆర్ట్‌వర్క్‌ను జోడించారు. ఈ కళే ఆస్ట్రేలియా సాంప్రదాయానికి అద్దం పట్టనుంది. ఇక జెర్సీ వెనుకాల చిన్నగా ఉన్న ఆర్ట్‌వర్క్‌.. 1868లో ఇంగ్లండ్‌ టూర్‌కు వెళ్లిన అప్పటి ఆస్ట్రేలియా ఆదివాసీ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. అప్పటి టీమ్‌ షిప్‌ ద్వారా యూకేకు సుదీర్ఘ ప్రయాణం చేసింది.

లార్డ్స్‌, ఓవల్‌లాంటి ప్రతిష్టాత్మక గ్రౌండ్స్‌లో 47 మ్యాచ్‌లు ఆడింది. అయితే ఈ టీమ్‌ నుంచి కేవలం నలుగురు మాత్రమే 1877లో ఆస్ట్రేలియా ఆడిన తొలి టెస్ట్‌ టీమ్‌లో చోటు సంపాదించారు. ఈ కొత్త జెర్సీ ద్వారా ఆస్ట్రేలియా తమ తొలి టీమ్‌ను స్మరించుకోవడం విశేషం. ఇక టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్‌ కోసం ఇండియాకు రానున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సిరీస్‌కు ముందు ముగ్గురు స్టార్‌ ప్లేయర్స్ గాయాల బారిన పడి దూరమయ్యారు. స్టార్క్‌, మార్ష్‌, స్టాయినిస్‌లకు గాయాలు కావడంతో బుధవారం మరోసారి ఇండియా టూర్‌కు కొత్తగా టీమ్‌ను ప్రకటించింది క్రికెట్‌ ఆస్ట్రేలియా. వచ్చే మంగళవారం (సెప్టెంబర్‌ 20) నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది.

WhatsApp channel

టాపిక్