Saturn Remedies : శని ప్రభావం తగ్గాలంటే.. శనివారం ఈ పనులు చేయండి..-to reduce shani effect on your zodiac follow these saturn remedies ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  To Reduce Shani Effect On Your Zodiac Follow These Saturn Remedies

Saturn Remedies : శని ప్రభావం తగ్గాలంటే.. శనివారం ఈ పనులు చేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 12, 2022 08:48 AM IST

Saturn Remedies : శని ప్రతి మనిషికి అతని కర్మల ప్రకారం ఫలాలను ఇస్తాడు. శని రాశిచక్రాన్ని మార్చినప్పుడు అది మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ఈ క్రమంలో వచ్చే శని మహా దశ చాలా ముఖ్యమైనదిగా చెప్తారు. ఈ సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే.. శనిప్రభావం తగ్గుతుంది అంటారు.

శని ప్రభావం ఇలా తగ్గించుకోండి..
శని ప్రభావం ఇలా తగ్గించుకోండి..

Saturn Remedies : శని మహాదశ చాలా ముఖ్యమైనది. ఎలాంటి అడ్డంకులు వచ్చినా తొలగిపోవాలంటే ఈ శని మహాదశ చాలా ముఖ్యమని.. వైదిక జ్యోతిష్యం చెబుతోంది. నవంబర్ 12వ తేదీన శని మార్గశీర్ష మాసం చుట్టూ ప్రత్యేక మహాదశతో ప్రత్యేక సంబంధాన్ని కలిగిస్తుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. నవంబర్ 9 నుంచి శుభ ముహూర్తం ప్రారంభమవుతుంది. నవంబరు 9 నుంచి ప్రారంభమయ్యే కొత్త మాసం రెండున్నర వారాలు శనిగ్రహం గడపడం శుభప్రదం. ఈ మార్గశీర్ష మాసంలో నవంబర్ 12 మొదటి శనివారం. ఈ శనివారం కొన్ని నిబంధనలు పాటించాలని.. అలాగే లక్ష్మీదేవిని పూజించాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

శనిగ్రహం అశుభ ప్రభావాన్ని ఎలా తగ్గించాలంటే..

* శని దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే.. అతను తన భక్తులను కష్టాల నుంచి రక్షిస్తాడు. అటువంటి పరిస్థితిలో శని దేవుడి అశుభ ప్రభావాన్ని తగ్గించడానికి శనివారం శని దేవుడికి నల్ల నువ్వులు, ఆవాల నూనె సమర్పించండి. అలాగే రుద్రాక్ష జపమాలతో ఓం శనిశ్చరాయ నమః అని 108 సార్లు జపించండి.

* దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. నల్ల నువ్వులు, నల్ల గుడ్డ, దుప్పట్లు, ఇనుప పాత్రలు, ఉసిరి పప్పు వంటివి శనివారము నాడు శక్తికి తగినట్లుగా దానం చేయండి. దీని వలన శని దేవుడు ప్రసన్నుడై శుభ ఫలితాలను అందిస్తాడు.

* శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత.. సూర్యునికి నీరు సమర్పించండి. ఏకకాలంలో ఏడు ప్రదక్షిణలు చేసి.. అదే రోజు సాయంత్రం ఆవాల దీపం వెలిగించాలి.

* శనిగ్రహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోవాలంటే శనివారం సూర్యాస్తమయం సమయంలో నల్ల గుర్రపుడెక్క లేదా పడవ మేకుతో ఉంగరాన్ని తయారు చేసి మధ్య వేలుకు ధరించండి. ఇది చేసే ముందు కచ్చితంగా జ్యోతిష్యుల సలహా తీసుకోండి.

* మత విశ్వాసాల ప్రకారం.. శని దేవుడు తన భక్తులను ఎప్పుడూ వేధించనని బజరంగబలికి వరం ఇచ్చాడు. అందుకే శనివారం నాడు హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి.

* నల్ల నువ్వులు, పిండి, పంచదార కలిపిన మిశ్రమాన్ని తయారు చేసి ప్రతి శనివారం చీమలకు తినిపించాలి. ఇది శని దేవుడి అశుభ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

* శనివారం నాడు భోలేనాథ్ స్వామికి నల్ల నువ్వులను నీటిలో కలిపి సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా వ్యక్తి తీవ్రమైన వ్యాధుల నుంచి విముక్తి పొందుతాడు.

WhatsApp channel

సంబంధిత కథనం