Saturn Transit 2022 : ఆ రాశివారిపై శనిప్రభావం.. రాజకీయంగా కలిసి వస్తుందట..-saturn transit gives good luck on five zodiacs here is the details ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Transit 2022 : ఆ రాశివారిపై శనిప్రభావం.. రాజకీయంగా కలిసి వస్తుందట..

Saturn Transit 2022 : ఆ రాశివారిపై శనిప్రభావం.. రాజకీయంగా కలిసి వస్తుందట..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 10, 2022 02:47 PM IST

Saturn Transit 2022 : శనిలో మార్పులు పలు రాశులపై మంచి, చెడు ప్రభావాలను చూపిస్తాయి. ముఖ్యంగా శని అనగానే చెడు సంకేతంగా చెప్తారు. అయితే శనిలోని మార్పుల వల్ల పలురాశుల వారికి సానుకూల ప్రయోజనాలు ఉంటున్నాయి అంటున్నారు జ్యోతిష్యులు. శని మకర రాశిలో ఉండడం వల్ల 5 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది అంటున్నారు.

పలు రాశులపై శని ప్రభావం
పలు రాశులపై శని ప్రభావం

Saturn Transit 2022 : వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. జనవరి 17 వరకు శని మకరరాశిలో ఉంటాడు. దీనివల్ల కెరీర్, వ్యాపార పరంగా 5 రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది అంటున్నారు జ్యోతిష్యులు. జ్యోతిషశాస్త్రంలో శనిని న్యాయ దేవుడిగా పిలుస్తారు. వ్యక్తుల కర్మల వల్ల ఫలితాలు ఇస్తాడని చెప్తారు. ఇదిలా ఉండగా.. శని తాజాగా మకరరాశిలోకి మారాడు. జనవరి 17 వరకు శని మకరరాశిలోనే ఉంటాడు.

దీని ప్రభావం అన్ని రాశిలపై కనిపిస్తుంది. కానీ 5 రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి వస్తోంది. ఫలితంగా ఆదాయం పెరగవచ్చు. అంతే కాకుండా.. జీవితంలోని వివిధ సమస్యలు కూడా తొలగిపోతాయి. మరి ఏ రాశులవారికి మంచిగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథునం

శని సంచారం మిధున రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శని మీ జాతకంలో ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు. అంతేకాకుండా.. మీ సంచార రాశిలో హన్స్, భద్ర అనే రాజ్ యోగం ఏర్పడుతోంది. దీనివల్ల మీకు ప్రజాదరణ పెరుగుతుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఏ పదవినైనా పొందుతారు. అలాగే విదేశాల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

సింహం

సింహ రాశిలోని వారు ప్రస్తుతం కొన్ని మంచి అవకాశాలను పొందవచ్చు. ఉద్యోగంలో వారి ప్రతిష్ట పెరుగుతుంది. వారి ఆదాయం కూడా పెరగవచ్చు. అంతే కాదు కుటుంబ స్థాయిలో వారికి గౌరవం దక్కుతుంది.

తుల

మకరరాశిలో శని స్థానం కూడా ఈ రాశివారికి మంచిదే. ఈ రాశివారు దీనివల్ల సమయ ప్రయోజనాన్ని పొందుతారు. మీ గౌరవం పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. వచ్చే ఏడాది ప్రారంభం వరకు మీకు అన్ని విషయాలు అనుకూలంగానే ఉంటాయి.

మకరం

శని ప్రభావం మీపై చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీ ఆరోహణ రాశిలో జరుగుతోంది. అందువల్ల ఈ సమయంలో ఉద్యోగులకు విజయం, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. దానికి కూడా ఇది మంచి సమయమే. కోర్టు కేసుల్లో మంచి విజయాన్ని పొందుతారు.

మీనం

శని మీ సంచార రాశిలో 11వ స్థానంలో ఉన్నాడు. జ్యోతిషశాస్త్రంలో ఇది ఆదాయ, లాభానికి చిహ్నంగా పరిగణిస్తారు. దీంతో మీరు డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలను వింటారు.

సంబంధిత కథనం

టాపిక్