Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. ఈ రాశుల వారు దత్తాత్రేయుడిని పూజించాలి-rasi phalalu check horoscope today in telugu for 12 moon signs on thursday june 8 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. ఈ రాశుల వారు దత్తాత్రేయుడిని పూజించాలి

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. ఈ రాశుల వారు దత్తాత్రేయుడిని పూజించాలి

HT Telugu Desk HT Telugu
Jun 08, 2023 01:02 AM IST

Today Rasi Phalalu: ఈరోజు 08.06.2023వ తేదీ గురువారం కోసం రాశి ఫలాలను పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు ద్వాదశ రాశుల దిన ఫలాలను ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశిఫలితాలు
నేటి రాశిఫలితాలు

Today Rasi Phalalu: ఈరోజు 08.06.2023వ తేదీ గురువారం

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: జ్యేష్టము

వారం: గురువారం, తిథి: కృ పంచమి నక్షత్రం: శ్రవణం

మేష రాశి ఈరోజు ఫలాలు

మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. చికాకులు అధికముగా ఉండును. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మేషరాశికి జన్మస్థానము నందు బుధ, గురు, రాహువులు, వాక్‌ స్థానం నందు రవి ప్రభావంచేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. చతుర్ధ స్థానము నందు కుజ, శుక్రుల ప్రభావంచేత కుటుంబ విషయాలయందు చికాకులు ఏర్పడు సూచన. పనుల యందు ఆటంకములు, చికాకులు కలుగును. కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు అధికముగా ఉన్నాయి. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన.

ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. శివపార్వతులు అర్జనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి ఈరోజు రాశి ఫలాలు

వృషభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యయ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ప్రయాణములు, ఖర్చులు అధికముగా ఉండును. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. శారీరక శ్రమ, ఒత్తిడి అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములు ఉండును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికముగా ఉండును. వృషభ రాశి వారికి దశమము నందు శని ప్రభావం చేత ఆర్థికపరంగా లాభము చేకూరును.

ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

ఈరోజు మిథునరాశి ఫలితాలు

మిథునరాశి వారికి గురువారం మధ్యస్థముగా ఉంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఖర్చులు అధికమగును. మిథున రాశి వారికి వాక్‌ స్థానమునందు కుజుడు, వ్యయస్థానము నందు రవి ప్రభావంచేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల చికాకులు ఇబ్బందులు కలుగుగును. వివాదాలు ఏర్చడు సూచన. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుటచేత మిథునరాశివారికి కొన్ని పనులు అనుకూలించును. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము.

ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని, ముత్తయిదువలకు గాని తాంబూలం శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

కర్మాటకరాశి నేటి ఫలాలు

కర్కాటక రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. జన్మరాశియందు కుజుని, అష్టమ శని ప్రభావంచేత శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు ఏర్పడును. లాభస్థానమునందు రవి, దశమ స్థానమునందు బుధ గురు, రాహువుల ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరోగ్య విషయములయందు కుటుంబ వ్యవహారముల యందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. శివపార్వతులు అర్థ నారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

నేటి సింహరాశి దినఫలాలు

సింహరాశి వారికి ఈ రోజు మధ్యస్థంనుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యయ స్థానములో కుజ, శుక్రుల సంచారంచేత ఖర్చులు అధికమగును. ఇష్టమైన వస్తువులు కొనే ప్రయత్నం చేసెదరు. లాభ స్థానములో శుక్రుడు దశమ స్థానములో రవి ప్రభావంచేత భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ప్రభావం చేత సింహరాశి వారు చేసే ప్రతి పనీ అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. నూతన వస్తువుల కోసం ధనాన్ని అధికముగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయము. స్త్రీలు కుటుంబ విషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి.

ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి నేటి రాశి ఫలాలు

కన్యారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార విషయాలు లాభించును. కన్యారాశి వారికి లాభస్థానములో కుజ, శుక్రుల ప్రభావం చేత ధనలాభము కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. అష్టమస్థానము నందు బుధ, గురు, రాహువుల సంచారం వలన ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. స్త్రీ సౌఖ్యం కలుగును.

ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

ఈరోజు తులా రాశి ఫలాలు

తులారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. దశమ స్థానమునందు కుజ, శుక్రుల ప్రభావంచేత తులారాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఏర్పడును. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత కుటుంబము నందు చికాకులు ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు అనుకూలము. కుటుంబ విషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. అర్థనారీశ్వరుడి రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి నేటి రాశి ఫలాలు

వృశ్చిక రాశికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. కళత్ర స్థానమునందు రవి ప్రభావంచేత కుటుంబమునందు సమస్యలు ఏర్పడు సూచన. అర్జాష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. కుటుంబ విషయాల యందు శ్రమ అధికముగా ఉండును. స్త్రీలకు మధ్యస్థ సమయము. విద్యార్థులకు అనుకూల సమయము.

ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి నేటి రాశి ఫలాలు

ధనూరాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. అష్టమ కుజ, శుక్రుల ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సభ్యులతో సమస్యలు ఏర్పడు సూచన. ఐదో స్థానమందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించును. ధన లాభము కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వారం. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము.

ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

నేడు మకర రాశి దిన ఫలాలు

మకరరాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. ప్రయాణములు అనుకూలించును. ఆరోగ్యము అనుకూలించును. ఖర్చులు పెరుగు సూచన. చతుర్ధ స్థానమునందు బుధ, గురు, రాహువుల అనుకూలత వలన, పంచమ స్థానము నందు రవి అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. వ్యాపారస్తులకు కష్టకాలము. విద్యార్థులకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మకరరాశి వారికి ఏలినాటి శని ప్రభావంచేత ధన విషయమునందు జాగ్రత్తలు వహించాలి.

ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. అర్థనారీశ్వరుడి రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి ఈరోజు రాశి ఫలాలు

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం చేత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరో స్థానమునందు కుజ, శుక్రులు ప్రభావం చేత శత్రు పీడ అధికమగును. పనులయందు ఆలస్యములు ఏర్పడినప్పటికి అనుకున్న పనులు ఏదోవిధంగా పూర్తి చేసెదరు. ధనపరమైనటువంటి విషయాలయందు శ్రమ అధికమగును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము. విద్యార్థులకు మధ్యస్థ ఫలితములు కలుగును.

ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి నేటి రాశి ఫలాలు

మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నవి. ప్రయాణాలు అనుకూలించును. ఆరోగ్య విషయాలకై ధనమును ఖర్చు చేసెదరు. ఏలినాటి శని ప్రభావం, వాక్‌ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉద్యోగ వ్యాపారాలయందు చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉందును. ఉద్యోగస్తులకు మథ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉండును. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ 9494981000

WhatsApp channel