కుజ శుక్రుల సంయోగం.. ఈ 3 రాశులకు కష్టకాలం-with mars venus conjunction difficult period for these 3 moon signs as per vedik astrology ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  With Mars Venus Conjunction Difficult Period For These 3 Moon Signs As Per Vedik Astrology

కుజ శుక్రుల సంయోగం.. ఈ 3 రాశులకు కష్టకాలం

HT Telugu Desk HT Telugu
Jun 02, 2023 12:32 PM IST

కుజ శుక్రుల సంయోగంతో 3 రాశులకు కష్టకాలం రానుంది. ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, ఖర్చులు, ఆఫీసులో వివాదాలు వెన్నాడుతాయి.

కుజ శుక్రల కలయికతో 3 రాశులకు గడ్డుకాలం
కుజ శుక్రల కలయికతో 3 రాశులకు గడ్డుకాలం

కర్కాటకంలో కుజుడు, శుక్రుడి కలయిక కారణంగా పలు రాశులకు జూలై 1 వరకు కాలం భారంగా నడుస్తుంది. చంద్రుడి రాశి అయిన కర్కాటకంలో కుజుడు, శుక్రుడు కలవడం వల్ల ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.

జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజుడు ధైర్యసాహసాలు,శక్తి మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు సంతోషం, సంపద, సౌభాగ్యాలకు కారకుడు. కుజుడు మే 10, 2023న మధ్యాహ్నం 1.44 గంటలకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. జూలై 1 వరకు ఇదే రాశిలో ఉంటాడు. ఇక శుక్రుడు 30 మే 2023న రాత్రి 7.39 గంటలకు కర్కాటకంలోకి ప్రవేశించి జూలై 7 వరకు అదే రాశిలో ఉంటాడు. అంటే మే 30 నుంచి జూలై 1 వరకు కర్కాటకంలో కుజుడు, శుక్రుడి కలయిక ఉంటుంది. కర్కాటకంలో కుజ శుక్రల కలయిక పలు రాశుల వారికి కష్టాలను తెచ్చిపెడుతుంది.

కర్కాటక రాశిపై కుజశుక్రుల కలయిక ప్రభావం

కర్కాటకంలో కుజుడు, శుక్రుడి కలయిక ఆ రాశి పదో స్థానంలో ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో శుక్రుడి రాశిచక్రంలో ఈ మార్పు మీ పని ప్రాంతంపై ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. సహోద్యోగాలతో మీ సంబంధాలు బెడిసికొట్టకుండా ఉండాలంటే మీరు ఆఫీసు రాజకీయాల జోలికి వెళ్లొద్దు. లేదంటే మీ ఉద్యోగ పురోగతికి ఆటంకం కలుగుతుంది. ఈ కాలంలో మీ ప్రమోషన్‌లో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారాలతో సంబంధం ఉన్న వారు నష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ధనుస్సు రాశిపై కుజ శుక్రుల కలయిక ప్రభావం

ధనుస్సు యొక్క ఎనిమిదో ఇంటిలో శుక్ర సంచారం ఏర్పడుతుంది. కుజుడు, శుక్రుడి కలయిక మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే అవకాశం ఉంది. మీరు దాచుకున్న డబ్బును ఖర్చు చేయకుండా ఉండాలి. కుటుంబ సభ్యులతో వాదనలు చేయకూడదు. ఈ కాలంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఎందుకంటే ఇది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది.

కుంభ రాశి పై ప్రభావం

కుంభం ఆరో ఇంట్లో కుజుడు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయత్నాలకు తగిన ఫలితం ఉండదు. సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. వారు కుట్రలకు పాల్పడవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు అనేక సవాళ్లను ఎదుర్కోవల్సి రావొచ్చు. ఈకాలంలో వివాదాలకు దూరంగా ఉండాలి.

WhatsApp channel