Ugadi 2023 Dhanu Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ధనూరాశి ఫలాలు
Ugadi 2023 Dhanu Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ధనూరాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
Ugadi 2023 Dhanu Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ధనూరాశి ఫలాలు:
ధనూరాశి వారి ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 6 అవమానం 3
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ధనూరాశి వారికి అనుకూల ఫలాలు ఉన్నట్టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ధనూరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి (గురు గ్రహం) 5వ స్థానమునందు సంచరిస్తున్నాడు. శని 3వ స్థానమునందు సంచరిస్తున్నాడు. రాహువు 5వ స్థానము యందు సంచరిస్తున్నాడు. అలాగే కేతువు 11వ స్థానము నందు సంచరిస్తున్నాడు. ఈ గ్రహ సంచారం కారణంగా ధనూరాశి వారికి ఈ సంవత్సరంలో అన్ని విధాలుగా అద్భుతముగా ఉన్నది.
ధనూరాశి వారు గత కొంత కాలముగా ఏలినాటి శని ద్వారా పడుతున్నటువంటి అనేక సమస్యల నుండి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో బయటకు రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం బృహస్పతి అనుకూలత వలన కుటుంబమునందు సౌఖ్యము, ఆనందము కలుగును. శని అనుకూల ప్రభావంచేత ఆర్ధిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు తొలగును. పంచమ స్థానం నందు రాహువు, లాభ స్థానమందు కేతువు ప్రభావంచేత చేసే ప్రతీ పనియందు విజయం పొందెదరు. మొత్తం మీద శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ధనూరాశి వారికి అనుకూలమైన, విజయాలతో కూడి యున్నటువంటి సంవత్సరం.
ధనూ రాశి ఉద్యోగస్తులకు రాశి ఫలాలు
శోభకృత్ నామ సంవత్సరంలో ధనూరాశి ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉ ద్యోగస్తులకు ఉద్యో గమునందు ప్రమోషన్లు, ధనలాభము, కీర్తి కలుగును. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ధనూరాశి విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. విదేశీ విద్యలు అనుకూలించును.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ధనూరాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యం కలుగును. ధనూరాశి రైతాంగం వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. ధనూరాశి సినీరంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలున్నాయి.
మొత్తం మీద ధనూరాశి వారికి ఈ సంవత్సరం శుభఫలితాలు అధికముగా ఉన్నాయి. ధనూరాశి వారు ఈ సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందాలనుకుంటే గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం, ఆదివారం రోజు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి.
ధనుస్సు రాశి మాసవారి ఫలితములు
ఏప్రిల్ :- ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యము సామాన్యంగా ఉండును. ప్రతి పనినీ తెలివిగా చేస్తూ ఇతరులను మర్యాదతో చూస్తారు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక ఇబ్బందులు కలుగును.
మే :- ఈ మాసం మీకు అనుకూలముగా ఉన్నది. ధనలాభము, కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. తలచిన పనులు నెరవేరును. పుత్ర సౌఖ్యము.
జూన్ : ఈ మాసం మీకు మధ్యస్తముగా ఉంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. సంతోషముగా ఉంటారు. శత్రు జయం. మీ ప్రయత్నాలు విజయాన్ని అందిస్తాయి.
జూలై:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారాలు అనుకూలించును. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పిల్లల చదువుల్లో ముందడుగు వస్తారు. విలాసంగా గడుపుతారు.
ఆగస్టు:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. విలాసవింతమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్ధికంగా లాభసాటి. మీరు తీసుకొనే నిర్ణయాలతో విజయం సాధిస్తారు. మంచి ఆదాయం కలుగుతుంది.
సెప్టెంబర్:- ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. ఉద్యోగులకు ప్రమోషన్లు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు. ఎక్కువ శ్రమ పడకుండా లాభాలు పొందుతారు.
అక్టోబర్ :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు. వేతనాలు పెంపు. పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. స్నేహితులు గౌరవిస్తారు. అధిక లాభం కలుగుతుంది.
నవంబర్:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులు, వ్యాపారం లాభదాయకంగా ఉంటాయి. అన్ని వర్గాలనుంచి గౌరవాన్ని పొందుతారు. ఆరోగ్యం అనుకూలించును.
డిసెంబర్:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రతిలో విజయం సాధిస్తారు. ఖర్చులను తగ్గించుకుంటారు.
జనవరి : – ఈ మాసం మీకు మధ్యస్తముగా ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుతారు.
ఫిబ్రవరి : – ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది.మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందిస్తాయి. మీ బంధువులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మీకు విలువ గౌరవం ఇస్తారు. ధైర్యంగా ముందడుగు వేస్తారు.
మార్చి: - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపార వృద్ధి. ఆర్యోగం సంతృప్తికకరం. దీర్ఘకాలిక వ్యాధి తగ్గుతుంది. స్నేహితుల వలన లాభాలు. మీరు జీవితంలో కొత్త అవకాశాన్ని పొందుతారు.
- పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
సంబంధిత కథనం
టాపిక్