Astrological Remedies : సంతానం ప్రాప్తి కోసం జ్యోతిష్య పరిహారాలు ఇవే..-astrological remedies to conceive baby santana prapthi remedies for getting a child soon ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Astrological Remedies To Conceive Baby Santana Prapthi Remedies For Getting A Child Soon

Astrological Remedies : సంతానం ప్రాప్తి కోసం జ్యోతిష్య పరిహారాలు ఇవే..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 29, 2022 07:13 AM IST

Astro Remedies to Conceive Baby : చాలామంది జంటలు పెళ్లై పిల్లలను పొందకపోతే.. చాలా అవమానాలు ఎదుర్కొంటారు. వాళ్లు ఆస్పత్రులతో పాటు.. దేవుళ్లను విపరీతంగా మొక్కుతారు. అయితే పిల్లలు కలగడానికి.. కొన్ని జ్యోతిష్య పరిహారాలు ఉన్నాయి అంటున్నారు జ్యోతిష్యులు. వాటిని చేస్తే.. పిల్లలు కలిగే అవకాశముందని చెప్తున్నారు.

సంతానం ప్రాప్తి కోసం జ్యోతిష్య పరిహారాలు
సంతానం ప్రాప్తి కోసం జ్యోతిష్య పరిహారాలు

Astro Remedies to Conceive Baby : తల్లి కావాలనే కోరికతో చాలా మంది స్త్రీలు పూజలు చేస్తూనే ఉంటారు. పూజ-పారాయణం నుంచి తాంత్రిక-తోత్కా, ఔషధం-వైద్యం వరకు ఇలా ప్రతిదీ చేస్తారు. ఎప్పటికైనా తమకు పిల్లలు కలగకపోతారా? అమ్మా అని పిలిపించుకోకపోతామా అని చూస్తారు. అయితే జ్యోతిష్యంలోని కొన్ని కారణాల వల్ల కొందరికి ఎంత ప్రయత్నించినా.. పిల్లలు కలగరని.. వాటికి పరిహారం చేస్తే.. పిల్లలు కలిగే అవకాశముందని చెప్తున్నారు జ్యోతిష్యులు. ఇంతకీ.. ఆ పరిహారాలు ఏంటో మీరు తెలుసుకుని.. వాటిని ట్రై చేయండి. ఇప్పటివరకు పిల్లల కోసం మీరు ఎన్నో చేసి ఉంటారు. వీటిని ప్రయత్నిస్తే పోయేదేమి లేదు అనుకుంటే.. ఈ పరిహారాలు చేయండి.

పిల్లల పుట్టుకకు జ్యోతిష్య నివారణలు

బృహస్పతిని పూజించండి..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఐదవ స్థానంలో బృహస్పతి దుష్ప్రభావం వల్ల సంతానం పొందడంలో ఆటంకాలు ఎదురవుతాయి. లగ్నస్థ జాతకంలో ఐదవ స్థానంలో అధిపతి బాధతో ఉంటే.. అతన్ని పూజించండి. సంతానం కలగాలంటే గురు గ్రహాన్ని పూజించాలి అంటారు. గురువారం బెల్లం దానం చేయండి. బృహస్పతి గ్రహాన్ని బలోపేతం చేయడానికి.. మూడు లోకాలకు బుద్ధిమంతుడైన బృహస్పతికి నమస్కారం చెప్తూ.. ఓం గ్రం గ్రిం గ్రౌం సః గురవే నమః । హ్రీం గురవే నమః । బృహస్పతియ నమః । అనే మంత్రాన్ని జపించండి.

మీ నడుము చుట్టూ జిల్లేడు వేరును కట్టుకోండి

పెళ్లయి చాలా సంవత్సరాలు గడిచినా.. గర్భం దాల్చకపోతే శుక్రవారం రోజున జిల్లేడు వేరును.. చెట్టు నుంచి వేరు చేసి నడుముకు కట్టుకుంటే గర్భవతి అవుతారని చెప్తారు.

కృష్ణుడి సహస్త్రాణం పఠించండి

గర్భం రాని స్త్రీలు.. రోజూ స్నానం చేసి వెంటనే.. కృష్ణుడి సహస్రనామం పఠించాలి. ఇలా చేయడం వల్ల సంతాన సంపద కలుగుతుంది.

నవగ్రహ పూజ చేయండి

సంతానం కలగాలంటే నవగ్రహ పూజలు చేయవచ్చు. దీని కోసం మీరు ఆలయంలో హవనం, అభిషేకం చేయడం ద్వారా తొమ్మిది గ్రహాల శాంతి కోసం పూజలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల బలహీన గ్రహాలన్నీ బలపడి తమ శుభాశుభాలను ఇవ్వడం ప్రారంభిస్తాయని చెబుతారు.

జంతువులకు ఆహారం ఇవ్వండి

ఇంటికి వచ్చే కుటుంబ సభ్యులు, అతిథుల సంఖ్య కంటే ప్రతినెలా ఫుడ్ తయారు చేసి.. మూగ జీవులకు తినిపిస్తే.. సంతానం కలుగుతుందని చెప్తారు.

ఆవుకి ప్రత్యేకమైన ఆహారం తినిపిస్తే..

సంతానం కలగాలంటే గోధుమపిండిని ఒక ముద్దలా చేసి.. అందులో నానబెట్టిన శెనగపప్పు, కొద్దిగా పసుపు కలిపి ఆవుకు రోజూ తినిపిస్తే సంతానానందం కలుగుతుంది.

స్కంద మాతను పూజించండి

స్కందమాతను ఆరాధించడం వల్ల మాతృసంతోషం కూడా కలుగుతుందని నమ్ముతారు. స్కంద మాత అనుగ్రహం పొందడానికి ఆమెను సంపూర్ణ హృదయంతో పూజించండి.

Disclaimer : ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఊహలు, సమాచారం ఆధారంగా మాత్రమే అందించాము. దీనిని హిందూస్తాన్ టైమ్స్ ఎలాంటి గుర్తింపును, సమాచారాన్ని నిర్ధారించజం లేదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని పొందడానికి.. వీటిని అమలు చేసేముందు.. సంబంధిత నిపుణులను సంప్రదించండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్