Beetroot for Beauty : బీట్​రూట్​ స్క్రబ్, ఫేస్​ప్యాక్, జెల్​ను ఇలా చేసేయండి..-step by step beetroot facial for glowing skin at home ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Step By Step Beetroot Facial For Glowing Skin At Home

Beetroot for Beauty : బీట్​రూట్​ స్క్రబ్, ఫేస్​ప్యాక్, జెల్​ను ఇలా చేసేయండి..

Nov 30, 2022, 02:03 PM IST Geddam Vijaya Madhuri
Nov 30, 2022, 02:03 PM , IST

  • Beetroot for Beauty : బీట్‌రూట్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో, టాన్‌ను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అయితే ఇంట్లోనే బీట్‌రూట్‌తో ఫేషియల్ చేసుకోవచ్చు. మూడు-దశల్లో చేసుకునే ఈ ఫేషియల్ పార్లర్ కంటే మెరుగైన ఫలితాలు ఇస్తుంది.

బీట్​రూట్​ మీ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటితో ఇంట్లోనే మంచి ఫేషియల్ చేసుకోవచ్చు. ఇది టాన్‌ను తొలగించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా గ్లోయింగ్ స్కిన్ ఇవ్వడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దుంపలతో ఫేషియల్ చేయడం వల్ల మీ ముఖం కోల్పోయిన తేజస్సును సులభంగా తిరిగి పొందవచ్చు.

(1 / 6)

స్క్రబ్: బీట్​రూట్​ దుంపలను తురుముకోవాలి. ఓ గిన్నె తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ బియ్యప్పిండి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల తురిమిన బీట్​రూట్​ వేసి కలపండి. మీ ముఖాన్ని ఫేస్ వాష్‌తో క్లీన్ చేసుకుని.. ఈ మిశ్రమాన్ని.. ముఖానికి అప్లై చేయండి. అనంతరం దీనిని 1 నిమిషం పాటు మసాజ్ చేయండి. ఇది మృతకణాలు, ట్యాన్ తొలగించడంలో సహాయం చేస్తుంది. అనంతరం నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

(2 / 6)

ఫేస్ ప్యాక్ : 1 టేబుల్ స్పూన్ శెనగపిండి, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ బీట్‌రూట్ జ్యూస్‌తో మసాజ్ క్రీమ్ చేయండి. మీ ముఖానికి అప్లై చేసి.. రెండు మూడు నిమిషాల పాటు మసాజ్ చేయండి. తర్వాత నీటితో కడిగేయండి.

(3 / 6)

జెల్: 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్‌కి 1 టేబుల్ స్పూన్ బీట్‌రూట్ జ్యూస్ మిక్స్ చేసి.. ముఖానికి అప్లై చేయండి. మీరు ప్రతి ఉదయం, మధ్యాహ్నం దీనిని మీ ముఖానికి అప్లై చేయవచ్చు.

(4 / 6)

ఈ బీట్‌రూట్ ఫేషియల్‌ను వారానికి రెండుసార్లు అప్లై చేయవచ్చు. CTM రొటీన్‌ను కూడా ఫాలో అవ్వొచ్చు. అంటే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. పగటిపూట సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడండి. ఇలా రెగ్యూలర్​గా చేస్తే.. మీరు ఒక నెలలోనే మంచి ఫలితాలు చూస్తారు.

(5 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు