Microgreens Health Benefits | మీ ఆహారంలో మైక్రోగ్రీన్స్ చేర్చుకోండి.. ఎందుకంటే?-reasons you need to add microgreens to your diet ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Microgreens Health Benefits | మీ ఆహారంలో మైక్రోగ్రీన్స్ చేర్చుకోండి.. ఎందుకంటే?

Microgreens Health Benefits | మీ ఆహారంలో మైక్రోగ్రీన్స్ చేర్చుకోండి.. ఎందుకంటే?

Sep 05, 2022, 09:08 AM IST HT Telugu Desk
Sep 05, 2022, 09:08 AM , IST

  • మొలకలలాగే మైక్రోగ్రీన్స్‌ను ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాలుగా పరిగణిస్తున్నారు. అయితే మొలకలు, మైక్రోగ్రీన్స్ రెండూ ఒకటి కావు. తక్కువ వయసు ఉన్న సూక్ష్మ ఆకుకూరలు, మొక్కలను మైక్రోగ్రీన్స్ అంటారు. వీటిని తరచుగా వంటల్లో రంగు, రుచిని చేర్చటానికి వేస్తారు. ఇవి చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు చూడండి. 

మైక్రోగ్రీన్స్ అనేవి పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్. ఇవి చూడటానికి పచ్చి మొలకలలా ఉంటాయి. మొలకల్లాగే మైక్రోగ్రీన్స్ ను కూడా ఇంట్లో సులభంగా పెంచవచ్చు. సాధారణంగా ఇవి పెరగడానికి ఒక వారం పడుతుంది. మీ వంటగది కిటికీ దగ్గర, మీ బాల్కనీ లేదా కారిడార్‌లో సరైన లైటింగ్‌తో ఉన్నచోట పెంచుకోవచ్చు. మొలకెత్తిన 7-21 రోజుల తర్వాత కోతకు వస్తాయి. మనకు 60 రకాలకు పైగా మైక్రోగ్రీన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో సన్‌ఫ్లవర్ మైక్రోగ్రీన్స్, ముల్లంగి మైక్రోగ్రీన్స్, పాక్ చాయ్ మైక్రోగ్రీన్స్, బ్రోకలీ మైక్రోగ్రీన్స్, క్యాబేజీ మైక్రోగ్రీన్స్ మొదలైనవి ఉన్నాయి.మైక్రోగ్రీన్స్‌లోని పోషక స్థాయిలు పచ్చని ఆకుకూరల కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంటాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. మీరు వీటిని సలాడ్‌లో వేయవచ్చు లేదా మీ పాస్తా, మాంసం, చేపల పైన కొంచెం చల్లుకోవచ్చు లేదా గిలకొట్టిన గుడ్లు, ఆమ్లెట్‌లలో కలపవచ్చు.

(1 / 7)

మైక్రోగ్రీన్స్ అనేవి పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్. ఇవి చూడటానికి పచ్చి మొలకలలా ఉంటాయి. మొలకల్లాగే మైక్రోగ్రీన్స్ ను కూడా ఇంట్లో సులభంగా పెంచవచ్చు. సాధారణంగా ఇవి పెరగడానికి ఒక వారం పడుతుంది. మీ వంటగది కిటికీ దగ్గర, మీ బాల్కనీ లేదా కారిడార్‌లో సరైన లైటింగ్‌తో ఉన్నచోట పెంచుకోవచ్చు. మొలకెత్తిన 7-21 రోజుల తర్వాత కోతకు వస్తాయి. మనకు 60 రకాలకు పైగా మైక్రోగ్రీన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో సన్‌ఫ్లవర్ మైక్రోగ్రీన్స్, ముల్లంగి మైక్రోగ్రీన్స్, పాక్ చాయ్ మైక్రోగ్రీన్స్, బ్రోకలీ మైక్రోగ్రీన్స్, క్యాబేజీ మైక్రోగ్రీన్స్ మొదలైనవి ఉన్నాయి.మైక్రోగ్రీన్స్‌లోని పోషక స్థాయిలు పచ్చని ఆకుకూరల కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంటాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. మీరు వీటిని సలాడ్‌లో వేయవచ్చు లేదా మీ పాస్తా, మాంసం, చేపల పైన కొంచెం చల్లుకోవచ్చు లేదా గిలకొట్టిన గుడ్లు, ఆమ్లెట్‌లలో కలపవచ్చు.(Unsplash)

తక్కువ కొలెస్ట్రాల్: ఎర్ర క్యాబేజీ మైక్రోగ్రీన్‌లు తింటే అవి శరీరంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, లివర్ కొలెస్ట్రాల్, ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌ల స్థాయిలను తగ్గిస్తాయని ఒక అధ్యయనం కనుగొంది.

(2 / 7)

తక్కువ కొలెస్ట్రాల్: ఎర్ర క్యాబేజీ మైక్రోగ్రీన్‌లు తింటే అవి శరీరంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, లివర్ కొలెస్ట్రాల్, ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌ల స్థాయిలను తగ్గిస్తాయని ఒక అధ్యయనం కనుగొంది.(Unsplash)

పేగు ఆరోగ్యానికి మంచివి: మైక్రోగ్రీన్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా మంచి ఆహారం. మలబద్ధకం, ఇతర జీర్ణశయాంతర సమస్యలను నివారిస్తాయి.

(3 / 7)

పేగు ఆరోగ్యానికి మంచివి: మైక్రోగ్రీన్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా మంచి ఆహారం. మలబద్ధకం, ఇతర జీర్ణశయాంతర సమస్యలను నివారిస్తాయి.(Unsplash)

క్యాన్సర్‌తో పోరాడేశక్తి: బ్రోకలీ మొలకలలో సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుందని పరిశోధనలు తెలిపాయి.

(4 / 7)

క్యాన్సర్‌తో పోరాడేశక్తి: బ్రోకలీ మొలకలలో సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుందని పరిశోధనలు తెలిపాయి.(Unsplash)

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ: మైక్రోగ్రీన్స్‌లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇది ఒక యాంటీఆక్సుడెంట్. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించటంలో సహాయపడగలదు.

(5 / 7)

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ: మైక్రోగ్రీన్స్‌లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇది ఒక యాంటీఆక్సుడెంట్. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించటంలో సహాయపడగలదు.(Unsplash)

అల్జీమర్స్ ప్రమాదం తగ్గిస్తుంది: మైక్రోగ్రీన్‌లలో అధిక మొత్తంలో పాలీఫెనాల్స్ ఉన్నందున, ఇది అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలదు.

(6 / 7)

అల్జీమర్స్ ప్రమాదం తగ్గిస్తుంది: మైక్రోగ్రీన్‌లలో అధిక మొత్తంలో పాలీఫెనాల్స్ ఉన్నందున, ఇది అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలదు.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు