Fertility Boosting Tips | స్త్రీలలో అండం నాణ్యత పెరగాలంటే.. ఇవిగో చిట్కాలు!
- మాతృత్వపు స్పర్శను కోరుకుంటున్నారా? మీ అండం నాణ్యతను పెంచి, మీ సంతానోత్పత్తి సామర్థ్యానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ చూడండి. భవిష్యత్తు కోసం స్త్రీలు తమ అండాలను భద్రపరచుకోవటానికి కూడా ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.
- మాతృత్వపు స్పర్శను కోరుకుంటున్నారా? మీ అండం నాణ్యతను పెంచి, మీ సంతానోత్పత్తి సామర్థ్యానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ చూడండి. భవిష్యత్తు కోసం స్త్రీలు తమ అండాలను భద్రపరచుకోవటానికి కూడా ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.
(1 / 7)
అండం నాణ్యతను పెరగాలన్నా, సంతానోత్పత్తిని మెరుగుపడాలన్నా అది ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటంతోనే ముడిపడి ఉంటుంది. ఈ రోజు చాలా మంది మహిళలు పిల్లల్ని కనటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందు జాగ్రత్తగా వారి అండాలను ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఇలా చేయటం ద్వారా భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ. ఇందుకోసం ఎలాంటి టిప్స్ పాటించాలో ఇక్కడ తెలుసుకోండి.(Shutterstock)
(2 / 7)
ఆల్కాహాల్ సేవించటం తగ్గించాలి. వీలైతే పూర్తిగా మానేయాలి. ఇటీవల కాలంలో స్త్రీలు అధికంగా ఆల్కాహాల్ సేవించటం ద్వారా ఇది వారి వంధ్యత్వానికి దారితీస్తుంది.(Unsplash)
(3 / 7)
ఒమేగా-3 కలిగిన ఆహారాలను ఎక్కువగా తినండి. చేపలు, నట్స్, ఫ్లాక్స్ సీడ్/కనోలా నూనె వంటి వాటిలో ఈ ఒమేగా-3 అధికంగా ఉంటుంది. ఒమేగా-3 స్త్రీల సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.(Unsplash)
(4 / 7)
మీరు గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కాఫీలు తాగటం తగ్గించండి. కాఫీలో ఉండే కెఫిన్ సమ్మేళనం అభివృద్ధి చెందుతున్న అండం నాణ్యతను ప్రభావితం చేస్తుంది.(Unsplash)
(5 / 7)
కఠినమైనవి కాకుండా తెలివిగా వ్యాయామం చేయండి. మితమైన వ్యాయామం కూడా శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. కాబట్టి తీవ్రంగా వర్కౌట్స్ చేయవలసిన అవసరం లేదు. అయితే మీ హృదయ స్పందన రేటును పెంచే వ్యాయామాలు చేయండి. వేగంగా ఊపిరి తీసుకునేటు వంటి కార్డియో చేయండి.(Unsplash)
(6 / 7)
సరిపడా నిద్రపోండి. మెలటోనిన్, కార్టిసాల్ వంటి నిద్రలేమిని కలిగించే హార్మోన్ల ప్రభావం సంతానోత్పత్తిపై కూడా పడుతుంది. సరైన నిద్ర ఉండటం వలన శరీరం, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది నాణ్యమైన అండం విడుదలకు ఉపయోగపడుతుంది.(Unsplash)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు