Acne After Lovemaking । శృంగారం తర్వాత ముఖంపై మొటిమలా? అసలు కారణం ఇదీ!-acne after lovemaking these are the possible cause for pimples after sex ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Acne After Lovemaking । శృంగారం తర్వాత ముఖంపై మొటిమలా? అసలు కారణం ఇదీ!

Acne After Lovemaking । శృంగారం తర్వాత ముఖంపై మొటిమలా? అసలు కారణం ఇదీ!

Published Dec 08, 2022 04:09 PM IST HT Telugu Desk
Published Dec 08, 2022 04:09 PM IST

  • Acne After Lovemaking: రోజూ శృంగారం చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, ముఖంలో ప్రకాశం వస్తుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. మరి కలయిక వలన మొటిమలు కూడా వస్తాయా? తెలుసుకోండి..

ముఖంలో మొటిమలు రావటం సహజమే, యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పెళ్లి తర్వాత తగ్గుతుంది, అయితే పెళ్లి తర్వాత కూడా ఈ సమస్య రావచ్చు.

(1 / 6)

(Freepik)

సెక్స్ హార్మోన్ల స్రావం పెరిగినప్పుడు మొటిమలు వస్తాయని చాలా మంది అనుకుంటారు. మీ భాగస్వామితో సంభోగించిన తర్వాత ఉదయం మీకు మొటిమలు కనిపిస్తే అలాంటి అభిప్రాయం కలగడం సహజం. కానీ నిపుణుల ప్రకారం, ఇది అస్సలు నిజం కాదు. చర్మ సమస్యల వల్ల మొటిమలు ఎక్కువగా వస్తాయి. సంభోగం సమయంలో చేసే కొన్ను చర్యల కారణంగా మొటిమల సమస్యలు పెరుగుతాయి. దీనికి హార్మోన్ స్రావం బాధ్యత వహించదు.

(2 / 6)

సంభోగం సమయంలో ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత కూడా చాలా పెరుగుతుంది. దీనివల్ల విపరీతమైన చెమట పడుతుంది. ఈ చెమట చర్మంపై ఎక్కువ సేపు పేరుకుపోతే మొటిమల సమస్యలు వస్తాయి.

(3 / 6)

సన్నిహిత క్షణాలు గడిపే సమయంలో, ముఖంపై భాగస్వామి వివిధ భాగాలతో రుద్దటం వలన అలర్జీ కలగవచ్చు.ఉదాహరణకు, జుట్టుకు నూనెతో పాటు వివిధ సౌందర్య సాధనాలు అద్దుకుంటారు. దీని వల్ల మొటిమలు కూడా రావచ్చు.

(4 / 6)

భాగస్వామి యొక్క ముఖ వెంట్రుకల నుండి చర్మం చికాకు పెరుగుతుంది. సంభోగం సమయంలో, స్త్రీలు తరచుగా పురుషుల గడ్డాలు, మీసాలను ముఖంతో తాకుతారు. ఇది చర్మంలో సెబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. సెబమ్ మొటిమలకు కారకం అవుతుంది.

(5 / 6)

సంబంధిత కథనం

ఇతర గ్యాలరీలు