PFI condemns NIA-ED raids: ‘లొంగిపోయే ప్రసక్తే లేదు: పీఎఫ్ఐ’-will never surrender says pfi after nia ed raids at party offices across 11 states ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  "Will Never Surrender", Says Pfi After Nia-ed Raids At Party Offices Across 11 States

PFI condemns NIA-ED raids: ‘లొంగిపోయే ప్రసక్తే లేదు: పీఎఫ్ఐ’

HT Telugu Desk HT Telugu
Sep 22, 2022 02:52 PM IST

PFI condemns NIA-ED raids: దేశవ్యాప్తంగా సంస్థ కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఐఏ,ఈడీ దాడులు చేయడంపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) సంస్థ స్పందించింది.

ముంబైలోని PFI కార్యాలయం
ముంబైలోని PFI కార్యాలయం (PTI)

PFI condemns NIA-ED raids: ఉగ్ర వాద కార్యకలాపాలకు సహకరిస్తోందని, సమాజంలో అశాంతి, హింసాత్మక వాతావరణం నెలకొనేందుకు కుట్ర చేస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(Popular Front of India PFI) కార్యాలయాలపై దేశవ్యాప్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు NIA, ED దాడులు చేస్తోంది. దాదాపు 11 రాష్ట్రాల్లో ఏక కాలంలో దాడులు చేసి 100 మందికి పైగా పీఎఫ్ఐ సభ్యులు, సపోర్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

PFI condemns NIA-ED raids: లొంగిపోయే ప్రశ్నే లేదు

NIA, ED దాడులను PFI ఖండించింది. PFI నాయకులను, సభ్యులను భయపెట్టి, సమాజంలో భయానక వాతావరణం సృష్టించే లక్ష్యంతోనే ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించింది. PFI ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి బెదిరింపు చర్యలకు భయపడబోమని, తాము ప్రభుత్వ ఒత్తిడికి లొంగబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం PFI నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేసింది. అన్యాయంగా తమ నాయకులు, సభ్యులను అరెస్ట్ చేసి, వేధిస్తున్నారని ఆరోపించింది. సంస్థ నిర్వహిస్తున్న చట్టబద్ధ కార్యకలాపాలను కూడా అడ్డుకుని, సంస్థను అణచివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు తలొగ్గబోమని స్పష్టం చేసింది.

PFI condemns NIA-ED raids: 11 రాష్ట్రాల్లో దాడులు

పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ ఐ ఏ దాడులు నిర్వహించింది. సంస్థ చీఫ్ సహా మొత్తం 106 మందిని అరెస్ట్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, అస్సాం, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పుదుచ్చేరి, మహారాష్ట్రల్లోని పలు పట్టణాల్లో ఈ దాడులు జరిగాయి. కాగా, ఈ దాడులకు నిరసనగా కర్నాటకలోని మంగళూరులో PFI మద్దతుదారులు ధర్నా నిర్వహించారు.

PFI condemns NIA-ED raids: బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం..

2006 లో కేరళలో ఈ PFI సంస్థ ఏర్పాటైంది. మూడు వేర్వేరు సంస్థలు విలీనమై ఈ PFI ఏర్పడింది. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం కేరళలో ఏర్పాటైన National Development Front of Kerala, తమిళనాడుకు చెందిన Manitha Neethi Pasari, కర్నాటకకు చెందిన Karnataka Forum for Dignity సంస్థలు విలీనమై ఈ పీఎఫ్ఐ ఏర్పాటైంది. విద్య, ఉపాధి, స్వీయ రక్షణ తదితర విషయాల్లో ముస్లింలకు సహకారం అందించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ సంస్థపై ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తోందన్న ఆరోపణలు వచ్చాయి.

IPL_Entry_Point