Same sex marriages: ‘LGBTQIA సమస్యలపై కమిటీ ఏర్పాటు చేస్తాం’ - కేంద్రం-will form committee to look into issues faced by lgbtqia community centre to sc ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Will Form Committee To Look Into Issues Faced By Lgbtqia Community: Centre To Sc

Same sex marriages: ‘LGBTQIA సమస్యలపై కమిటీ ఏర్పాటు చేస్తాం’ - కేంద్రం

HT Telugu Desk HT Telugu
May 03, 2023 03:22 PM IST

Same sex marriages: ఎల్జీబీటీక్యూఐఏ (LGBTQIA) కమ్యూనిటీ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచించడానికి కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. స్వలింగ వివాహాలకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయం వెల్లడించింది.

సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు (HT_PRINT)

Same sex marriages: ఎల్జీబీటీక్యూఐఏ (LGBTQIA) కమ్యూనిటీ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచించడానికి కేంద్ర కేబినెట్ సెక్రటరీ (Union Cabinet Secretary) నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు (Supreme Court)కు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. స్వలింగ వివాహాలకు (Same sex marriages) సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయం వెల్లడించింది.

Same sex marriages: కేబినెట్ సెక్రటరీ

లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్, ఇంటర్ సెక్స్, అసెక్సువల్ (LGBTQIA) కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేయడానికి కేంద్ర కేబినెట్ సెక్రటరీ (Union Cabinet Secretary) నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వలింగ వివాహాలకు (Same sex marriages) చట్టబద్ధత కల్పించే అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) లో వాదనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్ర చూడ్ (Justic DY Chandrachud), జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమ కొహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహ సభ్యులుగా ఉన్న రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ కేసులో ప్రభుత్వం తరఫు స్పందనలో భాగంగా ఈ విషయాన్ని బుధవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి (Supreme Court Constitution Bench) వెల్లడించింది.

Same sex marriages: సూచనలకు ఆహ్వానం..

ఈ విషయంలో కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి పిటిషన్ దారులే కాకుండా స్వలింగ వివాహాలను (Same sex marriages) సమర్ధించే, వ్యతిరేకించే వర్గాలు సలహాలు, సూచనలు పంపించవచ్చని సొలిసిటర జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. LGBTQIA కమ్యూనిటీకి చెందిన జంట (Same sex marriages) కలిసి ఉండే హక్కును ప్రభుత్వం అంగీకరించిందనే తాము భావిస్తున్నామని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. సామాజిక ప్రయోజనాలను పొందే విషయంలో స్వలింగ జంటలు ఎదుర్కొనే సమస్యలపై సుప్రీంకోర్టు ఆందోళనలను ప్రభుత్వం అర్థం చేసుకుందని, అయితే, ఈ స్వలింగ జంటలకు (Same sex marriages) సామాజిక ప్రయోజనాలు అందించే విషయంలో కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం అవసరమని ఎస్జీ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. స్వలింగ వివాహాలకు (Same sex marriages) చట్టబద్ధత ఇవ్వకుండానే, వారికి సామాజిక ప్రయోజనాలు అందించే విషయంలో స్పందించాలని ఏప్రిల్ 27 నాటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

IPL_Entry_Point