Priapism : వయాగ్రా ఓవర్ డోస్ అయితే ఇంత పెద్ద సమస్యా?-what is viagra overdose which leads to the condition priapism know more details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  What Is Viagra Overdose Which Leads To The Condition Priapism Know More Details Inside

Priapism : వయాగ్రా ఓవర్ డోస్ అయితే ఇంత పెద్ద సమస్యా?

HT Telugu Desk HT Telugu
Jun 20, 2022 08:14 PM IST

యూపీలో ఇటీవలే ఓ వ్యక్తి.. అంగస్తంభన కోసం.. వయాగ్రాను వాడాడు. ఇక అతడు అప్పటి నుంచి.. ప్రియాపిజం అనే సమస్యతో బాధపడుతున్నాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

తినే ప్రతి ఒక్కటి సహజమైనది కాదు. ఏదైనా.. ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఔషధాల విషయానికి వస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ కు కట్టుబడి ఉండాలి. లేదంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిన కొత్తగా పెళ్లయిన వ్యక్తి అనుభవించాల్సిన పరిస్థితిని మీరు ఎదుర్కోవలసి ఉంటుంది.

యూపీకి చెందిన 28 ఏళ్ల వ్యక్తి తన స్నేహితుల సలహా తీసుకున్న తర్వాత తన లైంగిక పనితీరును మెరుగుపరచుకోవడానికి వయాగ్రాను వాడాడు. దానిని వినియోగించే సమయంలో.. సరైన జాగ్రత్త తీసుకోలేదు. వయాగ్రాను మోతాదుకు మించి మరీ వాడాడు. వైద్య పరీక్షల్లో రోజుకు 200 mgకి పెంచినట్లు తెలిసింది. ఇది సిఫార్సు చేసిన మొత్తం కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఈ ఘటన ఇటీవలే వైరల్ అయింది.

ఇక ఇప్పుడు అతడు సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అంగస్తంభన అలాగే ఉంది. 20 రోజుల తర్వాత కూడా తగ్గలేదు. దీనిని ప్రియాపిజం అంటారు. అప్పటి నుంచి అదే సమస్యను ఎదుర్కొంటున్నాడు. లైంగికంగా పాల్గొన్న కూడా.. అతడికి అంగస్తంభన తగ్గడం లేదు. ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు అతనికి పెనైల్ ప్రొస్థెసిస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అయినా అతడు సమస్యలు ఎదుర్కొంటున్నాడు. పిల్లలను కని సాధారణ జీవితాన్ని గడపగలిగినప్పటికీ, అతని ప్రైవేట్ పార్ట్స్ లో సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అంగస్తంభను దాచడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలని అంటున్నారు.

వయాగ్రా గత మూడు దశాబ్దాలుగా అత్యంత ప్రజాదరణ పొందిన మెడిసిన్. పురుషులలో అంగస్తంభన సమస్య కోసం వాడుతుంటారు. అయినా.. దాని అసలు పని అధిక రక్తపోటు, ఆంజినా చికిత్సకు సహాయం చేయడం. కానీ రాను రాను.. అంగస్తంభన సమస్యలకు చికిత్స చేయడంలో ఉపయోగపడే మెడిసిన్ గా ఎక్కువగా వాడుతున్నారు. దీంతో ఔషధ తయారీదారులకు సరికొత్త మార్కెట్‌ వచ్చింది. చాలా తక్కువ వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది.

వయాగ్రా ఎంజైమ్ చర్యను అడ్డుకుంటుంది. ఈ ఎంజైమ్‌ను నిరోధించడం ద్వారా రక్తనాళాలు విస్తరిస్తాయి. ఇది పురుషాంగానికి రక్త సరఫరాను పెంచుతుంది. కాబట్టి అంగస్తంభనను పొందడానికి సహాయపడుతుంది. వయాగ్రా 25mg, 50mg, 100mg వాడుతుంటారు. సాధారణంగా ఖాళీ కడుపుతో పూర్తి గ్లాసు నీటితో ఒక టాబ్లెట్ మాత్రమే తీసుకోవాలి. దీని ప్రభావాలు సాధారణంగా 5 గంటల వరకు ఉంటుంది. చాలా మంది పురుషులు 2 లేదా 3 గంటలలోపు ప్రభావాలను చూస్తారు.

వయాగ్రా గురించి వైద్యుడు సిఫార్సు చేసిన విధంగానే తీసుకోవాలి. కానీ ఒక వ్యక్తి వయాగ్రాను ఎక్కువగా తీసుకుంటే, అతను అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. సాధారణ మోతాదు కంటే.. ఎక్కువగా తీసుకుంటే.. ప్రియాపిజం వైపు దారి తీస్తుంది. దీంతో ఎప్పుడూ అంగస్తంభన జరిగే ఉంటుంది.

వయాగ్రా పురుషాంగం మరియు శరీరంలోని ఇతర భాగాలను ప్రభావితం చేస్తుంది. అయితే ప్రియాపిజం వస్తే మాత్రం.. దాచుకునేందుకే కాదు.. ఆరోగ్య సమస్యలు కూడా అధికంగా వస్తాయి. సుదీర్ఘమైన అంగస్తంభన పురుషాంగం కణజాలాలకు శాశ్వత నష్టానికి దారితీస్తుంది. వయాగ్రా సూచించిన మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే మీ రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది. గుండెపోటు వంటి గుండె సమస్యలకు కూడా దారి తీస్తుంది.

వయాగ్రా వాడుతున్నప్పుడు ద్రాక్షపండు రసం తాగకుండా ఉండాలి. ఒక్క గ్లాసు ద్రాక్షపండు రసం కూడా దుష్ప్రభావాల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ద్రాక్షపండు శరీరంలో రక్త స్థాయిలను పెంచుతుంది. వయాగ్రా వాడకంతో ఇంకా ఎక్కువై.. సమస్యలు వస్తాయి.

వయాగ్రాతో దుష్ప్రభావాలు ఉన్నాయి. వీటిలో కొంచెం ముఖం ఎర్రబడటం, నాసికా సమస్యలు, చాలా మంది పురుషులు తలనొప్పిని కూడా చూస్తారు. ఇలాంటి సమస్యలు చాలానే ఉంటాయి. తలనొప్పిగా అనిపించడం అసాధారణం కాదు. ఎందుకంటే ఇది రక్తపోటును తగ్గిస్తుంది.

IPL_Entry_Point

టాపిక్